Adsense

Showing posts with label TTD TIRUMALA TUGUPATHI. Show all posts
Showing posts with label TTD TIRUMALA TUGUPATHI. Show all posts

Saturday, November 23, 2024

తిరుమల ఫిబ్రవరి నెల టికెట్స్ విడుదల తేదీలు TTD TIRUMALA TUGUPATHI

తిరుమల ఫిబ్రవరి నెల టికెట్స్ విడుదల తేదీలు

👉 వర్చువల్ సేవలు, సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల ఆన్ లైన్ కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తారు.

👉 వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 ఫిబ్రవరి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
👉 తిరుమల, తిరుపతిల‌లో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 నవంబర్ 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు