Adsense

Saturday, March 9, 2024

శ్రీ రుద్రం నుంచి ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు - ఫలితాలు!! Five Powerful Shiva Meditation Mantras from Sri Rudram - Results!!

శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు - ఫలితాలు!!

1.ఓం నమః శివాయ - మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి

2.ఓం నమో భగవతే రుద్రాయ - బలం కోసం , ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి

3.ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ  సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః - శరణాగతి కీ , సర్వ శుభాలకీ

4.త్రయంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ - ఆయుర్దాయం కోసం

5.ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి - మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి

హర హర మహాదేవ్ .... ...ఓం నమః శివాయః

Kedareswara Swamy is the bikkaos who give darshan only on Mahashivratri

పాలకొల్లు లో క్షీరా రామలింగేశ్వర స్వామి దర్శనం Darshan of Ksheera Ramalingeswara Swamy in Palakollu

పాలకొల్లు లో క్షీరా రామలింగేశ్వర స్వామి దర్శనం

శ్రీ శివ అష్టోత్తర శతనామావళి Sri Shiva Ashtottara Shatanamavalih

శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిరేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్థినే నమః
ఓం  నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం అంధకాసురసూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటక్షాయ నమః
ఓం కలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సోమప్రియాయ నమః
ఓం సర్వమయాయ నమః
ఓం త్రయీమూర్తాయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నామః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమాసూర్యాగ్నిలోచానాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞామయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాధాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దురాధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగభూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాసినే నమః
ఓం పురాగతాయే నామః
ఓం  భగవతే నమః
ఓం ప్రమదాధిపాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః
ఓం ఆహిర్భుధ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తాయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశువే నమః
ఓం అజాయ నమః
ఓం పాతక విమోచనాయ నమః
ఓం మృడాయనమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అశ్వాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతాభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తరూపాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రప్రసాదాయ నమః
ఓం త్రివర్గప్రసాదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీ సదాశివాయ నమః
ఇతి అష్టోత్తర శతనామ పూజ

శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం Shiva Panchakshara Nakshatramala Stotra.

శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం .

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ
శ్రీ మదాత్మనే గుణైక సింధవే నమ:శ్శివాయ
ధామలేక దూత కోక భంధవే నమ:శ్శివాయ
నామశోషి తానమద్భావాంధవే నమ:శ్శివాయ
పామ రేతర ప్రధాన భంధవే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

కాలభీత విప్రబాల పాలతే నమ:శ్శివాయ
శూలభిన్న దుష్టదక్ష బాలతే నమ:శ్శివాయ
మూలకారణీయ కాలకాలతే నమ:శ్శివాయ
పాలయాధునా దయాలవాలతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

ఇష్టవస్తు ముఖ్యదాన హేతవే నమ:శ్శివాయ
దుష్టదైత్య వంశ ధూమ కేతవే నమ:శ్శివాయ
సృష్టి రక్షణాయ ధర్మసేతవే నమ:శ్శివాయ
అష్ట మూర్తయే వృషేంద్ర కేతవే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

ఆపదద్రి భేద టంక హస్తతే నమ:శ్శివాయ
పాపహారి దివ్య సింధు మస్తతే నమ:శ్శివాయ
పపచారిణే లన న్నమస్తతే నమ:శ్శివాయ
శాపదోష ఖండన ప్రశస్తతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

వ్యోమ కేశ దివ్య భవ్య రూపతే నమ:శ్శివాయ
హేమ మేదినీ ధరేంద్ర చాపతే నమ:శ్శివాయ
నామ మాత్ర దగ్ద సర్వ పాపతే నమ:శ్శివాయ
కామ నైక తానహృద్దురాపతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

బ్రహ్మమ స్తకావలీనిబద్ధతే నమ:శ్శివాయ
జిహ్మ గేంద్ర కుండల ప్రసిద్ధతే నమ:శ్శివాయ
బ్రహ్మణే ప్రణీత వేదపద్ధతే నమ:శ్శివాయ
జిహ్మకాల దేహదత్త పద్ధతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

కామనాశనాయ శుద్ధకర్మణే నమ:శ్శివాయ
సామగాన జాయమాన శర్మణే నమ:శ్శివాయ
హేమకాంతి చాక చక్య వర్మణే నమ:శ్శివాయ
సామజాసురాంగలబ్ధ చర్మణే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

జన్మ మృత్యు ఘోర దు:ఖ హారిణే నమ:శ్శివాయ
చిన్మ యైక రూప దేహధారిణే నమ:శ్శివాయ
మన్మనోర ధావపూర్తి కారిణే నమ:శ్శివాయ
మన్మనోగతాయ కామవైరిణే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

యక్షరాజ భండవే దయాలవే నమ:శ్శివాయ
ధక్షపాణి శోభి కాంచనాలవే నమ:శ్శివాయ
పక్షి రాజవాహహృచ్చయాలవే నమ:శ్శివాయ
అక్షిఫాల వేవేదపూత తాలవే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

ధక్షహస్త నిష్ట జాతవేదసే నమ:శ్శివాయ
అక్షరాత్మనే నమద్బిడౌజసే నమ:శ్శివాయ
దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమ:శ్శివాయ
ఉక్షరాజవాహతే సతాంగతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

రాజతాచలేంద్రసాను వాసినే నమ:శ్శివాయ
రాజమాన నిత్య మందహాసినే నమ:శ్శివాయ
రాజకోర కావతంస భాసినే నమ:శ్శివాయ
రాజరాజ మిత్రతా ప్రకాశినే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

దీనమానవాళి కామ ధేనవే నమ:శ్శివాయ
సూనబాణ దాహ త్క్రుశానవే నమ:శ్శివాయ
స్వానురాగ భక్త రత్నసానవే నమ:శ్శివాయ
దాన వాంధకార చండభావనే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

సర్వమంగళా కుచాగ్ర శాయినే నమ:శ్శివాయ
సర్వదేవతా గణాతి శాయినే నమ:శ్శివాయ
పూర్వదేవ నాశ సంవిధాయినే నమ:శ్శివాయ
సర్వ మన్మనోజ భంగదాయినే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

స్తోకభక్తితోపి భక్త పోషణే నమ:శ్శివాయ
మాకరందసారవర్షి భాషిణే నమ:శ్శివాయ
ఏకబిల్వ దానతోపి తోషిణే నమ:శ్శివాయ
నైకజన్మ పాపజాల శోషిణే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

సర్వజీవ రక్షనైక శీలినే నమ:శ్శివాయ
పార్వతీ ప్రియాయ భక్తపాలినే నమ:శ్శివాయ
దుర్విదగ్ధ దైత్యసైన్య దారిణే నమ:శ్శివాయ
శర్వరీశ ధారిణే కపాలినే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

పాహిమా ముమా మనోజ్ఞ దేహతే నమ:శ్శివాయ
దేహి మే వరం సితాద్రిగేహతే నమ:శ్శివాయ
మొహితర్శ కామినీసమూహతే నమ:శ్శివాయ
స్వేహిత ప్రసన్న కామ దోహాతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

మంగళ ప్రదాయ గోతురంగతే నమ:శ్శివాయ
గంగయా తరంగితోత్త మంగతే నమ:శ్శివాయ
సంగత ప్రవృత్త వైరి భంగతే నమ:శ్శివాయ
అంగజారయే కరే కురంగతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

ఈహిత క్షణ ప్రదాన హేతవే నమ:శ్శివాయ
ఆహితాగ్ని పాల కోక్షకేతవే నమ:శ్శివాయ
దేహకాంతి ధూతరౌప్యదాతవే నమ:శ్శివాయ
దేహ దు:ఖపుంజ ధూమకేత వే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

త్య్ర్ క్ష దీన సత్క్రుపా కటాక్షతే నమ:శ్శివాయ
దక్ష సప్తతంతు నాశ దక్షతే నమ:శ్శివాయ
ఋక్షరాజ భాను పాపకాక్షతే నమ:శ్శివాయ
రక్షమాం ప్రసన్న మాత్రరక్షతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

స్యంకుపాణయే శివంకరాయతే నమ:శ్శివాయ
సంకటాబ్ది తీర్ధ కింకరాయతే నమ:శ్శివాయ
పంక భీషితా భయంకరాయతే నమ:శ్శివాయ
పంజాననాయ శంకరాయతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

కర్మపాశనాశ నీలకంఠతే నమ:శ్శివాయ
శర్మదాయ వర్వభస్మకంఠతే నమ:శ్శివాయ
నిర్మమర్షి సేవితోపకంఠతే నమ:శ్శివాయ
కుర్మహే నతీర్మమద్వికుంఠతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ
విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమ: శ్శివాయ
శిష్టవిప్ర హృద్గుహా చరిష్ణవే నమ: శ్శివాయ
ఇష్టవస్తు నిత్య తుష్ట జిష్ణవే నమ: శ్శివాయ
కష్ట నాశనాయ లోకజిష్ణవే నమ: శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

అప్రమేయ దివ్య సుప్రభావతే నమ:శ్శివాయ
సుప్రసన్న రక్షణ స్వభావతే నమ:శ్శివాయ
స్వప్రకాశ నిస్తులానుభావతే నమ:శ్శివాయ
విప్రడింభ దర్శితార్ధ భావతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

సేవకాయ మే మృడ ప్రసీదతే నమ:శ్శివాయ
భావలభ్యతావక ప్రసాదతే నమ:శ్శివాయ
పావకాక్ష దేవపూజ్య పాదతే నమ:శ్శివాయ
తావకాంఘ్రి భక్త దత్త మోదతే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

భుక్తిముక్తి దివ్యభోగ దాయినే నమ:శ్శివాయ
శక్తి కల్పిత ప్రపంచ భాగి నే నమ:శ్శివాయ
భక్త సంకటాపహార యోగి నే నమ:శ్శివాయ
యుక్తసన్మవస్సరోజ యోగినే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

అంతకాంత కాయ పాపహారిణే నమ:శ్శివాయ
శన్త మాయ దన్తి చర్మ ధారిణే నమ:శ్శివాయ
సంతతాశ్రితవ్యధా విదారిణే నమ:శ్శివాయ
జంతు జాత నిత్య సౌఖ్య కారిణే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

శూలినే నమో నమ:క పాలినే నమ:శ్శివాయ
పాలినే విరించి తుండ మాలినే నమ:శ్శివాయ
లీలినే విశేష రుండ మాలినే నమ:శ్శివాయ
శీలినే నమ: ప్రపుణ్య శాలినే నమ:శ్శివాయ

నమ:శ్శివాయ నమ:శ్శివాయ జటాఝూటధారీ నమ:శ్శివాయ

శివ పంచాక్షర ముద్రాం
చతుష్పదోల్లాస పద్య మణి ఘటితాం
నక్షత్రమాలికా మిహ
దధ దుపకంఠం కరో భావే త్సోమ:

శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీ మదానన్ధరామాయనే వాల్మీకియే మనోహరకండే శ్రీ ఆంజనేయ కవచం.

శ్రీ శతకోటి రామచరితాంతర్గత శ్రీ మదానన్ధరామాయనే వాల్మీకియే మనోహరకండే శ్రీ ఆంజనేయ కవచం.



*శ్రీమదానన్దరామాయణాన్తర్గత శ్రీ హనుమత్ కవచం*

*ఓం శ్రీ హనుమతే నమః!!*

*ఓం అస్య శ్రీ హనుమత్కవచ స్తోత్ర మహామన్త్రస్య| శ్రీ రామచన్ద్ర ఋషిః |
శ్రీ హనుమాన్ పరమాత్మా దేవతా | అనుష్టుప్ ఛన్దః | మారుతాత్మజేతి బీజం | అఞ్జనీసూనురితి శక్తిః | లక్ష్మణప్రాణదాతేతి కీలకం | రామదూతాయేత్యస్త్రం | హనుమాన్ దేవతా ఇతి కవచం | పిఙ్గాక్షోమిత విక్రమ ఇతి మన్త్రః | శ్రీరామచన్ద్ర ప్రేరణయా రామచన్ద్ర ప్రీత్యర్థం మమ సకల కామనా సిద్ధ్యర్థం  జపే వినియోగః ||*

*కరన్యాసః:-*

*ఓం హాం అఞ్జనీసుతాయ అఙ్గుష్ఠాభ్యాం నమః | ఓం హీం రుద్ర మూర్తయే తర్జనీభ్యాం నమః |ఓం హూం రామదూతాయ మధ్యమాభ్యాం నమః | ఓం హైం వాయుపుత్రాయ  అనామికాభ్యాం నమః | ఓం హౌం అగ్నిగర్భాయ కనిష్ఠికాభ్యాం నమః | ఓం హః బ్రహ్మాస్త్ర నివారణాయ కరతల కరపృష్ఠాభ్యాం నమః ||*

*అంగన్యాసః:-*

*ఓం హాం అఞ్జనీసుతాయ హృదయాయ నమః | ఓం హీం రుద్ర మూర్తయే శిరసే స్వాహా | ఓం హూం రామదూతాయ శికాయై వషట్ | ఓం హైం వాయుపుత్రాయ  కవచాయ హుం |  ఓం హౌం అగ్నిగర్భాయ నత్రత్రయాయ వౌషట్ |  ఓం హః బ్రహ్మాస్త్ర నివారణాయ అస్త్రాయ ఫట్ |భూర్భువఃసువరోమితి దిగ్బన్ధః ||*


*అథ ధ్యానమ్:-*

*1) ధ్యాయేత్బాలదివాకరద్యుతినిభం దేవారిదర్పాపహం|*
*దేవేన్ద్ర ప్రముఖం ప్రశస్తయశసం దేదీప్యమానం రుచా ||*

*సుగ్రీవాది సమస్తవానరయుతం సువ్యక్త తత్త్వప్రియం |*
*సంసక్తారుణ లోచనం పవనజం |పీతామ్బరాలఙ్కృతం ||*


*2) ఉద్యన్ మార్తాణ్డకోటి ప్రకట రుచియుతం చారువీరాసనస్థం |*
*మౌఞ్జీ యఙ్యోపవీతాభరణ రుచిశిఖం శోభితం కుణ్డలాఙ్గం |*
*భక్తానామిష్టదం తం ప్రణతమునిజనం వేదనాద ప్రమోదం|*
*ధ్యాయేదేవం విధేయం ప్లవగ కులపతిం గోష్పదీభూత వార్ధిం ||*


*3) వజ్రాఙ్గం పిఙ్గకేశాఢ్యం స్వర్ణకుణ్డల మణ్డితం | నిగూఢముపసఙ్గమ్య పారావార పరాక్రమం ||*


*4) స్ఫటికాభం స్వర్ణకాన్తిం ద్విభుజం చ కృతాఞ్జలిం |*
*కుణ్డల ద్వయ సంశోభిముఖాంభోజం హరిం భజే ||*


*5) సవ్యహస్తే గదాయుక్తం వామహస్తే కమణ్డలుం |*
*ఉద్యద్ దక్షిణ దోర్దణ్డం హనుమన్తం విచిన్తయేత్ ||*

*అథ మన్త్రః:-*
*ఓం నమో హనుమతే శోభితాననాయ యశోలఙ్కృతాయ అఞ్జనీగర్భ సంభూతాయ |రామ లక్ష్మణానన్దకాయ |*
*కపిసైన్య ప్రకాశన పర్వతోత్పాటనాయ |సుగ్రీవసాహ్యకరణ పరోచ్చాటన | కుమార బ్రహ్మచర్య | గంభీర శబ్దోదయ |*
*ఓం హ్రీం సర్వదుష్టగ్రహ నివారణాయ స్వాహా |
ఓం నమో హనుమతే ఏహి ఏహి |*
*సర్వగ్రహ భూతానాం శాకినీ డాకినీనాం
విశమదుష్టానాం సర్వేషామాకర్షయాకర్షయ |
మర్దయ మర్దయ | ఛేదయ ఛేదయ | మర్త్యాన్ మారయ మారయ | శోషయ శోషయ | ప్రజ్వల ప్రజ్వల | భూత మణ్డల పిశాచమణ్డల నిరసనాయ | భూతజ్వర ప్రేతజ్వర చాతుర్థికజ్వర బ్రహ్మరాక్షస పిశాచః ఛేదనః క్రియా విష్ణుజ్వర |*
*మహేశజ్వరం ఛిన్ధి ఛిన్ధి | భిన్ధి భిన్ధి | అక్షిశూలే శిరోభ్యన్తరే హ్యక్షిశూలే గుల్మశూలే|*
*పిత్తశూలే బ్రహ్మ రాక్షసకుల ప్రబల నాగకులవిష నిర్విషఝటితిఝటితి ||*


*ఓం హ్రీం ఫట్ ఘేకేస్వాహా| ఓం నమో హనుమతే పవనపుత్ర వైశ్వానరముఖ|*
*పాపదృష్టి శోదా దృష్టి హనుమతే ఘో అఙ్యాపురే స్వాహా |*
*స్వగృహే ద్వారే పట్టకే తిష్ఠ తిష్ఠేతి తత్ర
రోగభయం రాజకులభయం నాస్తి |*
*తస్యోచ్చారణ మాత్రేణ సర్వే జ్వరా నశ్యన్తి ||*

*ఓం హ్రాం హ్రీం హ్రూం ఫట్ ఘేఘేస్వాహా.*


*శ్రీ రామచన్ద్ర ఉవాచ:-*

*1)హనుమాన్ పూర్వతః పాతు దక్షిణే పవనాత్మజః | అధస్తు విష్ణు భక్తస్తు పాతు మధ్యం చ పావనిః ||*


*2) లఙ్కా విదాహకః పాతు సర్వాపద్భ్యో నిరన్తరం | సుగ్రీవ సచివః పాతు మస్తకం వాయునన్దనః ||*


*3) భాలం పాతు మహావీరో భృవోర్మధ్యే నిరన్తరం | నేత్రే ఛాయాపహారీ చ పాతు నః ప్లవగేశ్వరః ||*

*4) కపోలే కర్ణమూలే చ పాతు శ్రీరామకిఙ్కరః |నాసాగ్రం అఞ్జనీసూనుః పాతు వక్త్రం హరీశ్వరః ||*


*5) వాచం రుద్రప్రియః పాతు జిహ్వాం పిఙ్గల లోచనః | పాతు దేవః ఫాల్గునేష్టః చిబుకం దైత్యదర్పహా ||*


*6) పాతు కణ్ఠం చ దైత్యారిః స్కన్ధౌ పాతు సురార్చితః | భుజౌ పాతు మహాతేజాః కరౌ చ చరణాయుధః ||*


*7) నఖాన్ నఖాయుధః పాతు కుక్షౌ పాతు కపీశ్వరః | వక్షో ముద్రాపహారీ చ పాతు పార్శ్వే భుజాయుధః ||*


*8) లఙ్కా నిభఞ్జనః పాతు పృష్ఠదేశే నిరన్తరం | నాభిం చ రామదూతస్తు కటిం పాత్వనిలాత్మజః ||*


*9) గుహ్యం పాతు మహాప్రాఙ్యో లిఙ్గం పాతు శివప్రియః | ఊరూ చ జానునీ పాతు లఙ్కాప్రసాద భఞ్జనః ||*


*10) జఙ్ఘే పాతు కపిశ్రేష్ఠోః గుల్ఫౌ పాతు మహాబలః | అచలోద్ధారకః పాతు పాదౌ భాస్కర సన్నిభః ||*


*11) అఙ్గాన్యమిత సత్వాఢ్యః పాతు పాదరఙ్గులీస్తథా | సర్వాఙ్గాని మహాశూరః పాతు రోమాణి చాక్మవిత్ ||

*12) హనుమత్ కవచం యస్తు పఠేద్ విద్వాన్ విచక్షణః | స ఏవ పురుషశ్రేష్ఠో భుక్తిం ముక్తిం చ విన్దతి ||*

*13) త్రికాలమేకకాలం వా పఠేన్ మాసత్రయం నరః | సర్వాన్ రిపూన్ క్షణాన్ జిత్వా స పుమాన్ శ్రియమాప్నుయాత్ ||*

శివ పంచాక్షరి స్తోత్రం Shiva Panchakshari Stotra




ఓం నమః శివాయ శివాయ నమః ఓం
ఓం నమః శివాయ శివాయ నమః ఓం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥

శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥

యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

శివ ద్వాదశ నామ స్తోత్రం



*ప్రథమస్తు మహాదేవో ద్వితీయస్తు మహేశ్వరః !
*తృతీయం శంకరో జ్ఞేయశ్చతుర్థో వృషభధ్వజః !!

*పంచమః కృత్తివాసాశ్చ షష్ఠః కామాంగ నాశనః !
*సప్తమో దేవదేవేశః శ్రీకంఠశ్చాష్టమః స్మృతః !!

*ఈశ్వరో నవమో జ్ఞేయో దశమః పార్వతీపతిః !
*రుద్ర ఏకాదశశ్చైవ ద్వాదశః శివ ఉచ్యతే !!

*ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యఃఫఠేన్నరః !
*కృతఘ్నశ్చైవ గోఘ్నశ్చ బ్రహ్మహా గురుతల్పగః !!

*స్త్రీ బాలఘాతుకశ్చైవ సురాపో వృషలీపతిః !
*ముచ్యతే సర్వపాపేభ్యో రుద్రలోకం స గఛ్ఛతి !!

హరహర మహాదేవ శంభోశంకర
.

Friday, March 8, 2024

ఏ స్తోత్రం చదివితే ఏమి ఫలితం వస్తుంది?

ఏ స్తోత్రం చదివితే ఏమి ఫలితం వస్తుంది..

1. గణనాయకాష్టకం - అన్ని విజయాలకు.

2. శివాష్టకం - శివ అనుగ్రహం

3. ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం

4. శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది

5. అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి

6. కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం

7. దుర్గష్టోత్తర శతనామం - భయహరం

8. విశ్వనాథ అష్టకం - విద్య విజయం

9. సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం

10. హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ

11. విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి

12. శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి

13. భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి

14. శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం.

15. లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం.

16. కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం

17. ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యయత

18. శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం..

19. లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి

20. శ్యామాల దండకం - వాక్శుద్ధి

21. త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి

22. శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి

23. శని స్తోత్రం - శని పీడ నివారణ...

24. మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం..

25. అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి

26. కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం

27. కనకధార స్తోత్రం - ఆర్థికాభివృద్ధి కోసం

28. శ్రీ సూక్తం - ధన లాభం

29. సూర్య కవచం - సామ్రాజ్య సిద్ది

30. సుదర్శన మంత్రం - శత్రు నాశనం

31. విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం...

32. రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి

33. దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు.

34. భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు..

35. వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు...

36. దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు

37. లలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి.

తిరుమల విమాన వేంకటేశ్వరస్వామి

ఆనంద నిలయ విమానం మీద వాయవ్యమూలకు గూడులాంటి చిన్న మందిరం వెండి మకరతోరణంతో అలంకరింపబడింది.ఆ మందిరంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు,హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు. ఆనంద నిలయ విమానంపై వేంచేసి ఉన్నందువల్ల ఆయన "విమాన వేంకటేశ్వరుడు"గా పిలువబడుచున్నాడు.

ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని "వేంకటాచలమాహాత్మ్యం" ద్వారా తెలుస్తోంది.ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాణ్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం.ఒకవేళ ఆనందనిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వేంకటేశ్వరుని దర్శిస్తే చాలట యాత్రా ఫలితం దక్కుతుందట.

పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా "విమాన వేంకటేశ్వరస్వామి"వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట.పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించడం జరుగుతూ ఉంది.ఈ విమాన వేంకటేశ్వరస్వామివారిని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలగుతాయి అంతేకాదు సర్వశుభాలు కలుగుతాయట.

ఆనందనిలయ విమానం మీద ఉన్న ఈ వేంకటేశ్వరస్వామివారు శ్రీ వ్యాసతీర్థుల వారికాలంనుండిప్రాధాన్యాన్నివిశిష్టతనుసంతరించుకున్నాడు.శ్రీకృష్ణదేవరాయలవారి కాలంలో ప్రసిద్ధి పొందిన ద్వైతపీఠసంప్రద్రాయ ప్రవర్ధకులు ఈ వ్యాసతీర్థులు.కృష్ణదేవరాయలకు కలిగిన "కుహూ" యోగమనే కాలసర్ప దోషంనుండి కాపాడడానికి విజయనగర సింహాసనాన్ని తానే అధిష్ఠించినారట.అందువల్లే ఈ యతీశ్వరులకు "రాయలు"అనే బిరుద నామం ఏర్పడి "వ్యాసరాయలు"గా లోకంలో ప్రసిద్ధి పొందినారు.తదుపరి శ్రీవ్యాసరాయలు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు 12 సంవత్సరాలపాటు అర్చనాధికములు నిర్వహించినారట. ఆ సమయంలో విమానవేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో పారాయణలు,దర్శనాదులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.అందువల్లే శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించిన తర్వాత విమాన ప్రదక్షిణమార్గంలో నడుస్తున్న భక్తులు ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడంకూడ ప్రధాన ఘట్టంగా ఆలయ సంప్రదాయంలో స్థిరంగా నిలిచి ఉన్నది.ఇలా భక్తులు మాత్రమేకాదు చివరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు కూడ ఆలయం బయటకు వెళ్ళే ముందుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఈ విమాన వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో కాసేపు నిలబడి హారతులందుకుంటాడు.

ప్రతి సంవత్సరానికొకసారి మూడురోజులపాటు జరిగే పవిత్రోత్సవ సమయంలో విమాన వేంకటేశ్వరస్వామివారికి కూడా పవిత్ర మాలలు సమర్పింపబడతాయి.దీని కోసం అర్చకస్వాములు విమాన వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్ళడానికి వీలుగా నిచ్చెనలు ఏర్పాటు చేస్తారు.అంతేగాక ప్రతిరోజు మూడుపూటలా ఆనందనిలయంలో జరుపబడే నివేదన సమయంలో అర్చకులు ఆలయం లోపలినుండే విమానవేంకటేశ్వరస్వామివారికి నివేదనలు సమర్పిస్తారు.
గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చే వాడైతే ఈ విమాన వేంకటేశ్వరుడు కేవలం మోక్ష ప్రదాత. అందుకనే ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి.

గర్భాలయం లో స్వామిని దర్శించుకోవడానికే సమయం సరిపోదు. కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంత సేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు.

Thursday, March 7, 2024

మహా శివ రాత్రి సందర్బంగా.శివరాత్రి జాగారం ,ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?On the occasion of Maha Shiva night.Shivratri Vigil,Do you know why you fast?

మార్చి 8 వ తేది.. 

మహా శివ రాత్రి సందర్బంగా.
శివరాత్రి జాగారం ,
ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?

శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరనతో మారుమోగిపోతున్నాయి.

శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు.

ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం.

వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి.

మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది.

అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది.

ఈ పర్వదినాన లింగాష్టకం ,
శివ పంచాక్షరి జపిస్తారు.
దీపారాధన చేసి ,
భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు.
రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి ,
రాత్రి జాగారం చేస్తారు.
శివరాత్రి పర్వదినానికి ఉపవాసం,
జాగారం ముఖ్యం.

*అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ?

ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు ? జాగారం ఎందుకు చేస్తారు ?
జాగారం ఎవరు , ఎప్పుడు ప్రారంభించారు ?*

అంటే దానికి ఒక కథ ఉంది.

అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు.

అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది.

హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు.

హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు.

లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి , గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు.

 హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి , నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు.

గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది.

ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు.

 నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.

అయినా , శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట.

అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు.

హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట.

ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట.

అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి , జాగారం ఉంటారు

జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు.

ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.

క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు.

 క్రీస్తుపూర్వం 1500-1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది.

క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది.

 ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది.

అయితే , ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు , సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్‌ ఫ్లడ్‌ వంటి చరిత్రకారుల అంచనా.

శివారాధనలో మూర్తి రూపం , లింగరూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది.

అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని 12 శివుని ప్రసిద్ద ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు.

రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం , జాగారం ముఖ్యం.
ఓం నమః శివాయ నమః 

శివుడి"కి, అత్యంత ప్రీతికరమైనరోజు సోమవారం...! Monday is the most auspicious day for Lord Shiva...!

శివుడి"కి,  అత్యంత ప్రీతికరమైనరోజు సోమవారం...!

"సోమ" అంటే.,
        "స+ఉమ"
"ఉమ"తో కూడినవాడు అనే అర్థం .......!

"శివుడు" శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు....!
"పార్వతీ దేవి" సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ, వుంటుంది.......!

అందువలన "సోమవారం" రోజున "పార్వతీ "పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో, ఆరాధించాలని "ఆధ్యాత్మిక గ్రంధాలు" చెబుతున్నాయి......!

           ఈ రోజున అంతా ఆ స్వామికి, "పూజాభిషేకాలు" జరుపుతుంటారు......!

ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో, గల "శివలింగాన్ని" ఏర్పాటు చేసుకుని,

పూజామందిరంలోనే స్వామికి "పూజాభిషేకాలు" నిర్వహిస్తుంటారు....!
ఇక ఎవరిలోనైనా ఆ "సదాశివుడికి" కావలసినది అంకితభావమే.....!

చిత్తశుద్ధితో పూజించాలేగాని, ఆయన అనుగ్రహించనిది లేదు......!!

          ఇలా "ఆదిదేవుడికి" సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ "లేమి" అనే మాట వినిపించదని చెప్పబడుతోంది.....!

అంటే ఆ "స్వామి" అనుగ్రహం వలన "దారిద్ర్యం" అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి, రాదు.....!

ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని సేవిస్తారు.....!

"సోమవారం" రోజున "పార్వతీ పరమేశ్వరులను" పూజించడం వలన "సమస్త పాపాలు" పటాపంచలై పోవడమే కాకుండా, "సంపదలు ......సౌఖ్యాలు" లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది......!

             "శివపూజలో " ప్రధానమైన అంశం, అభిషేకం, శివుడు "అభిషేక ప్రియుడు".

"హాలాహలాన్ని" కంఠమందు ధరించాడు...! "ప్రళయాగ్ని" సమానమైన మూడవ కన్ను కలవాడు.....! నిరంతరం "అభిషేక జలం" తో "నేత్రాగ్ని" చల్లబడుతుంది......!

అందుచేతనే "గంగను, చంద్రవంక" ను తలపై ధరించాడు శివుడు.
                                   
        ఓం నమః శివాయ!

లింగోద్భవ సమయంలో పటించాల్సిన శ్లోకం

లింగోద్భవ మాలికా 
 (లింగోద్భవ సమయంలో పటించాల్సిన శ్లోకం)

పురి మధురం గిరి మాధుర్యం
గరిమధురంధరనితంబభారాఢ్యం !
స్థూలకుచం నీలకుచం
బాలకచంద్రాంకితం తేజః !!........(1)

హ్రృదితరస విదితరసా గ
తదితరసాహిత్యవాజ్నమే లగతి !
కవిలోకే న విలోకే భువి
లోకేశస్య శాహజేరుపమానమ్ !!.... (2)

లత మధురం రమ మధురం
లతరమ సుందర సుమాల ప్రేమాభ్యం !
లత మోనం రమ మోనం
భర్త సమానాంకితం తేజః.!! .......(3)

చిరు తమకం సిరి తమకం
చిరుసిరి తన్మయ ప్రభావ ప్రేమాభ్యం!
చిరు హాసం సిరి హాసం
సవ్య సుమాలాంకృతం తేజః.!!....(4)

శశి కిరణం తన్మయ సౌలభ్య విదితం
కవి నయనం హ్రృద్యయ పన్నీరు కవితం!
రివి కిరణం ప్రార్ధన అస్తమ విజయం
శివ తరుణం సద్భుధ్ధి చంద్రుని వినయం!!..... 5

Tuesday, March 5, 2024

గోమతిచక్రాలు: ఉపయోగాలు -పూజా విధానం

గోమతిచక్రాలు:

గోమతిచక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి.

చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతోఇవి రూపు దిద్దుకుంటాయి.. ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈశుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును.

జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి,ప్రేమ,దాంపత్య సౌఖ్యం,సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి. గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.

దీనినే "నాగ చక్రం" అని "విష్ణు చక్రం" అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని "నత్త గుళ్ళ "స్టోన్ అని కూడ అంటారు.

గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. గోమతిచక్రం ముందుభాగం తెల్ల గాను,కొన్ని ఎర్ర గాను ఉంటాయి.

తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు
అన్ని రకాల పూజా కార్యక్రమాలకి,
సకల కార్యసిధ్ధికి,
ఆరోగ్య సమస్యలకి,
ధరించటానికి ఉపయోగపడతాయి. ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి,
శత్రునాశనానికి,
క్షుద్రప్రయోగాలకి,
తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి.
గోమతిచక్రాలలో ఆరు,తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి .

సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి,తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావటం ,వివాహాం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబర్చకపోవటం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి.

పూజా విధానం:-

గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతో తుడవాలి. గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి. గోమతిచక్రాలను లలితా సహస్త్ర నామం జపిస్తూ కుంకుంతో గాని హానుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి.

గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు.
పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు.
గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని,హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి.
గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.

గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక.
ఉపయోగాలు:-

1)ఒక్క గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది.

గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది.

బాలారిష్ట దోషాలు కూడ పోతాయి .

2)రెండు గోమతిచక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.

రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.

3)మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ,కమ్యూనికేషన్,సహాకారం లభిస్తుంది.

మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద అతని పేరు వ్రాసి నీటిలో వేయటం గాని వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

4)నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది.
గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు.
నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాలనుండి నివారించబడతారు.
5)ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది.

ఐదు గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది.

తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.

ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది.
శత్రువులపై విజయం సాదించవచ్చును.కోర్టు గొడవలు ఉండవు.విజయం సాదించవచ్చును.
(సేకరణ)

క్షేత్రాలు ప్రత్యేకతలు


పూర్వ కాలంలో దేవాలయములు నిర్మించేటప్పుడు ఒక ప్రేత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించినారు. ఒక్కొక్క దేవాలయానికీ ఒక్కొక్క ప్రత్యేకత వుండేది. ఉదాహరణకు కొన్ని :

1. ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే మాడవీధులలోనికి వచ్చేది చిదంబరం నటరాజ స్వామి.

2. కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడ శిల్పకళా చాతుర్యం చాల అద్భుతంగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్ధం మాత్రమె తెలుస్తుంది.

కొంచెం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది.

ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము దగ్గర నుండీ... అంటే వాలి, సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నట్టు చెక్కబడిన స్తంభం దగ్గర నుంచీ చూస్తే శ్రీ రాముడు (ధనుర్దారిగా చెక్కబడిన స్తంభం) కనపడడు కాని రెండవ స్తంభము, అంటే శ్రీ రాముడు ధనుర్దారిగా వున్న స్తంభం దగ్గర నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది.
(అంతరార్ధం అర్ధమైనదనుకుంటాను)

3. ధర్మపురి (తమిళనాడు)
మల్లికార్జున స్వామి కోవెలలో నవంగా మంటపం (అంటే తొమ్మిది స్తంభముల మంటపం అన్నమాట) లో రెండు స్థంభములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటాయి.

4. కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ఠ గావింపబడి వున్నాయి.

5. గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇచ్చేది కుంభకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో.

6. కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది.

అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది. 

స్వామి సన్నిధిలో వున్నప్పుడు,
ఆ గరుడ వాహనం బరువు,
నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటికి తీసుకు వస్తుంటే,
బరువు పెరుగుతూ,
రాను రాను ఎనిమిది మంది ...
పదహారు మంది...
ముప్పైరెండు మంది ... 
బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసేంత బరువు అయిపోతుంది. 

తిరిగి  స్వామి గుడిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు  అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. 

ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం ఇంకా విచిత్రం.

7. చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో ఉన్నటువంటి విగ్రహం శిల కాదు ...

పంచలోహ విగ్రహమూ కాదు కేవలం కుకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో చేసినది.

8. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో స్థల వృక్షం ఒక మారేడు చెట్టు.

మారేడు కాయలు ఎలా ఉంటాయో మనకి తెలుసు... కానీ ఆ చెట్టుకి కాచే కాయలు లింగాకారంలో ఉంటాయి.

9. కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుడి గుడి వుంది

అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది.

అందుకే ఆ కోవేలని  పంచ వర్నేస్వరుడి కోవెల అని పిలుస్తారు

10. విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుడి కోవెలలో నందికి కొమ్ములు, చెవులు, వుండవు.

11. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ విగ్రహం కనులు, భద్రాచల శ్రీ రామ సన్నిధిలో వున్న శ్రీ రాముడి పాదములు ఒకే ఎత్తులో వుండడం.

12. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నాయి. పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.

13. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారంతోనూ... నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది

14. ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామి అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్రీ రూపముతో ఉంటాయి.

ఇలా మనకు తెలియని ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమ శాస్త్ర విధానంగా కట్టిన దేవాలయాలలో వున్నాయి.

అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత

*“ఓమ్ నమో నారాయణాయ”*

అనే అష్టాక్షరీ “ఓమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని,

“నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది.

ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది.

ఇంకా,
“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి.
“ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి.
“య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు.
“ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది.

ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు.

ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత స్వేతివైశ్రుతిః!

స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.

ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః
ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!

సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర ‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.

ఆమ్నా యాభ్య  సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం
మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని
తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద
ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః

‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది.

ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).

శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,
హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్

‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు.

  “ఓమ్ నమో నారాయణాయ

తుష్టాయ నమః అని నిత్యం జపించే భక్తులజీవితాలు సుఖంగా, ఆనందంగా. ఉండును

తుష్టాయ నమః...!!
       

రావణ సంహారానంతరం బ్రహ్మ, ఇంద్రాది దేవతలు , అష్టదిక్పాలకులు  అందరూ
ఆకాశం నుండి శ్రీ రాముని మీద పుష్పవృష్టి కురిపిస్తూ
స్తుతించసాగారు.

  " అనంత విశ్వ సృష్టికర్తవు నీవే సృష్టిస్థితి లయాలకు ఆదిపురుషుడవు నీవే.

ఈ విశ్వం సృష్టించడానికి ముందూ మీరు వున్నారు.
ప్రళయంలో విశ్వమంతా
మునిగిపోయిన పిదప కూడా మీరు వున్నారు"  అని దేవతలంతా స్తుతించడం రామునికి రుచించలేదు.
శ్రీ రాముడు వారి స్తోత్రాలకు  అడ్డుపడి ఈవిధంగా అన్నాడు.

" నేను భగవంతుడిని కాను. దశరధ మహారాజు పుత్రుడిని మాత్రమే.  మీరు స్తుతించేంత కీర్తి దాశరధిగా నాకు లేదు. " అని అన్నాడని
వాల్మీకి రామాయణం
యుధ్ధకాండ 120-11 లో వర్ణించబడింది.

శ్రీమద్రామాయణాన్ని  రామానుజాచార్యులవారికి వారి మేనమామయైన తిరుమలై నంబి క్రింది తిరుపతిలో ఒక చింత చెట్టు క్రింద  సంపూర్ణంగా ఉపదేశించారు.

తిరుమలై నంబి శ్రీ రాముడు చెప్పిన
యీ విషయాలకు
విశిష్టమైన వ్యాఖ్యానం చేసారు.
రాముడు  ఏమన్నాడంటే

" దేవతలారా.. నేనే విశ్వానికి మూల కారణం అని బ్రహ్మదేవుని
సృష్టించినది నేనేననిఎన్నో విధాల స్తుతించారు.

కాని యీ విశిష్టతలన్నీ
వేదాలలో మునుపే వివరించబడి వున్నవి. నేను ఒక
సామన్య మానవునిగా జన్మించాను.

ఈ జన్మలోని నా గుణగణాలను మాత్రమే కొనియాడవచ్చును  కదా..
నా అతీత శక్తులను కీర్తించే కన్నా ఈ జన్మలో నేను గడిపిన    నిరాడంబర జీవితాన్ని ప్రశంసిస్తే అదే
నా కీర్తిగా భావిస్తాను.

నన్ను  నారాయణ, వాసుదేవ, వైకుంఠనాధా అనే పేర్లతో కాక ఈ జన్మలోని  రాముడనే
పవిత్ర నామంతో పిలిచిన చాలు.

శ్రీరాముడని నన్ను పిలిచే కంటే  దశరధ
పుత్రుడనని మీరు  నన్ను పిలిస్తే
ఇంకా సంతోషిస్తాను."

రాముడన్న  ఈ మాటలకి అర్ధం తనను భగవంతునిగా స్తుతించే కన్నా   పితృవాక్య పరిపాలకుడైన ఒక మహారాజు
పుత్రుని గా కీర్తించడమే
శ్రీ రామునికి ప్రీతిపాత్రం.

ఎందుకంటే   వైకుంఠంలోని మహావిష్ణువు చెంతకు భూలోకంలోని
భక్తులు వెళ్ళలేరు.
దశరధుని పుత్రునిగా అవతరించినందువలన
ప్రజలంతా సులభంగా ఆ అవతారపురుషుని దగ్గరకు వెళ్ళగలిగారు.

తన తండ్రిని తనే ఎన్నుకునే శక్తి మంతుడైన
భగవంతుడు రామావతారంలో తన తండ్రిగా దశరధుని ఎన్నుకుని నిరాడంబరమైన మానవతామూర్తిగా
భక్తదాసులకు దర్శనమనుగ్రహించాడు దశరధ మహారాజు పుత్రునిగా మహావిష్ణువు అవతరించాడు.

భక్తులందరూ తన వద్దకు వచ్చే మంచి అవకాశాన్ని
కలిగించిన అవతారం.
అందువలన తనని  దశరధ  మహారాజు పుత్రడనని చెప్పుకోవడంలోనే  సంతోషాన్ని అనుభవించినవాడు రాముడు.

ఈనాటికి శ్రీవైష్ణవులు అంతా
రాముడని అనకుండా
చక్రవర్తి కుమారుడని (దశరధాత్మజం)
పిలుస్తారు.

ఈవిధంగా  దశరధ మహారాజు పుత్రుడనని
తెలుపుతూ రాముడు
సంతోషిస్తున్నందు వలన
'తుష్టః" అని పిలువబడుతున్నాడు.'తుష్టః' అంటే సంతోషించే
వాడని అర్ధం.

దశరధ మహారాజు  పుత్రుడిగా అవతరించి భక్తులందరిని సులభంగా
అనుగ్రహించి ప్రసన్నుడైనందున
" రామునికి'' తుష్టః అనే
పేరు వచ్చింది.

యీ నామమే అనంతుని
ఆనంద నామములలో
393 వ నామము.

' తుష్టాయ నమః అని నిత్యం జపించే భక్తుల
జీవితాలు సుఖంగా, ఆనందంగా వుండేలా
శ్రీ రాముడు అనుగ్రహిస్తాడు..

ఏకాదశరుద్రులు, ద్వాదశాధిత్యులు అంటే ఎవరు?

శివోమహేశ్వర: శంభు: శ్రీ కంఠోభవ ఈశ్వర:
మహాదేవ: పశుపతి: నీలకంఠో వృషధ్వజ:
పరమేశ ఇమే రుద్రా, ఏకాదశ సమీరితా:.
అని శివతత్త్వ రత్నాకరం. దీనిని బట్టి 1. శివుడు, 2. మహేశ్వరుడు, 3. శంభుడు, 4. శ్రీకంఠుడు, 5. భవుడు,  6. ఈశ్వరుడు, 7. మహాదేవుడు, 8. పశుపతి, 9. నీలకంఠుడు, 10. వృషధ్వజుడు, 11. పరమేశుడు అనువారు ఏకాదశరుద్రులు.
మరో పక్షాన్నిఅనుసరించి

1. అజుడు, 2. ఏకాపాదుడు, 3. అహిర్భుధ్న్యుడు , 4. త్వష్ట, 5. రుద్రుడు, 6. హరుడు, 7. శంభుడు, 8. త్ర్యంబకుడు, 9. అపరాజితుడు, 10. ఈశానుడు, 11. త్రిభువనుడు ఏకాదశరుద్రులుగా పేర్కొనబడ్డారు.
ఇంకా కొన్ని మతభేదాలు ఉన్నాయి. వాటి ప్రకారం పై పేర్లలో కొన్నింటికి బదులు వృషాకపి, కపర్ది, శర్వుడు మొదలైన పేర్లు వినబడుతున్నాయి.
ఇలాగే ద్వాదశాదిత్యులు అన్న విషయంలో కూడా భేదాలు కనబడుతున్నాయి. ఒక మతాన్ని అనుసరించి ఈ క్రిందివారు

ద్వాదశాదిత్యులవుతారు.
1. ధాత, 2. మిత్రుడు, 3. అర్యముడు, 4. శుక్రుడు, 5. వరుణుడు, 6. అంశుడు, 7. భగుడు, 8. వివస్వంతుడు, 9. పుమ్షుడు, 10. సవిత, 11. త్వష్ట 12. విష్ణువు.
మరోక పక్షంలో వీటిలో కొన్ని పేర్లకు బదులు -
1. జయంతుడు, 2. భాస్కరుడు, 3. భానుడు, 4. హిరణ్యగర్భుడు, 5. ఆదిత్యుడు ఇత్యాదిగా గల నామాలు పేర్కొనబడివున్నాయి.

Saturday, March 2, 2024

కృష్ణాష్టకం ప్రతిరోజూ పఠించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థిక వృద్ధి, వ్యాపార వృద్ధి చేకూరుతుంది.



వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ 1
ఆతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ 2
కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ 3
మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ 4
ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ 5
రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ 6
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ |
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ 7
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ 8
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి

Friday, March 1, 2024

శ్రీ కనకధారా స్తోత్రం...

శ్రీ కనకధారా స్తోత్రం...



వందే వందారు మందార మందిరానంద కందలం
అమందానంద సందోహ బంధ ురం సింధురాననం

అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః

ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగ తంత్రం
ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరనీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః

దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః


శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః

బిల్వాటవీమధ్యలసత్ సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం

కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
పరిమార్జయ మాతరంఘ్రిణాతే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం

అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదాయారవిందం

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః

సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్
ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం సంపూర్ణాం..