ఈ కేంద్రానికి ఆక్సిజన్ తో పాటు ఇతర సదుపాయాలను సమకూరుస్తున్న - బి.పి.సి.ఎల్
కేరళలోని అంబాలముగల్‌లో బి.పి.సి.ఎల్.కు చెందిన కొచ్చి రిఫైనరీ నిర్వహిస్తున్న పాఠశాల వద్ద, దాని ప్రాంగణానికి ఆనుకొని 100 పడకల భారీ కోవిడ్ చికిత్సా కేంద్రం ఈ రోజు ప్రారంభమైంది. భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘మహారత్న’ పి.ఎస్.యు., భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బి.పి.సి.ఎల్), ఈ కేంద్రానికి ఆక్సిజన్, విద్యుత్తు, నీటి సరఫరా లను ఉచితంగా అందిస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ గొట్టాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం, మొదటి దశలో 100 పడకలతో వైద్య సదుపాయం కల్పించారు. క్రమంగా, అదే ప్రాంగణంలో, ఈ వైద్య సదుపాయాన్ని 1,500 పడకలకు విస్తరించనున్నారు.
ప్రతి నెలా కొచ్చి రిఫైనరీ నుండి 100 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్ను సరఫరా చేయడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలకు నెలకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వాయువును ఉచితంగా సరఫరా చేయడానికి ముంబై మరియు బినా లోని చమురు శుద్ధి కర్మాగారాల్లో సౌకర్యాల స్థాయిని పెంచడం ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కు మద్దతు ఇవ్వడంలో భారత్ పెట్రోలియం ముందంజలో ఉంది.
మహారాష్ట్రలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో, కేరళలోని మూడు ఆస్పత్రులు, మధ్యప్రదేశ్‌లోని ఐదు ఆసుపత్రులలో కూడా పి.ఎస్.ఎ. ఆక్సిజన్ ప్లాంట్లను బి.పి.సి.ఎల్. ఏర్పాటు చేస్తోంది. వీటికి అదనంగా, రిఫైనరీ వద్ద బాట్లింగ్ కంప్రెసర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఇది సహాయపడుతుంది.
ఈ సందర్భంగా బి.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కొచ్చి రిఫైనరీ) శ్రీ సంజయ్ ఖన్నా మాట్లాడుతూ, "ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సమాజానికి తగిన సహాయం అందించడానికి, భారత్ పెట్రోలియం సంస్థ, ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. మా ప్రాంగణంలో కోవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఉచితంగా ఆక్సిజన్, ఇతర సదుపాయాలను కల్పించడం, దేశ ప్రజల జీవితాలను శక్తివంతం చేయాలన్న మా ప్రధాన ప్రయోజనం పట్ల మా నిబద్ధతలో ఒక భాగం. మా ఆక్సిజన్ ఉత్పత్తి సౌకర్యాన్ని, అతి తక్కువ సమయంలో, అభివృద్ధి చేయడం ఒక సవాలే, అయితే, మేము, ఈ మొత్తం కార్యాచరణను ఐదు రోజుల్లో పూర్తి చేయగలం.” అని పేర్కొన్నారు.
Release Id :-1718720
No comments:
Post a Comment