🎻🌹🙏*ఈరోజు ఆషాడ శుద్ధ షష్ఠి కుమార షష్ఠి -
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
అనగా సుబ్రహ్మణ్యుని యొక్క దివ్యమైన ఆరాధనకు అనువైన శుభతిథి...*
ఏ మాసమందైనా ఉభయపక్షాలలోనూ షష్ఠి ప్రధానంగా చెప్పబడుతున్నది.
విష్ణువునకు ఏకాదశి, గణపతికి చతుర్థి, శివునికి మాసశివరాత్రి ఏవిధంగా ఉన్నాయో , సుబ్రహ్మణ్యునికి షష్ఠీ తిథి అంతముఖ్యమైనది.
ఈరోజున సుబ్రహ్మణ్యారాధన విశేషం.
సుబ్రహ్మణ్యుని తత్వము చాలా దివ్యమైనటువంటిది,
వేదం మనకు అందించినటువంటి ఆరు మతాలలో ఒకటి సుబ్రహ్మణ్య మతం - దీనికి స్కాందం అని కూడా పేరు.
ఈ రోజు సుబ్రమణ్య షష్టి సందర్భముగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొని ఆరాధించడం మంచిది ఈ పర్వదిన వేళ...
శివపుత్రుడు కుమారస్వామికి ఆరు ముఖాలు ఉంటాయని చెబుతారు, ఆయనను ఆరుగురు అక్కచెల్లెల్లు పెంచారని కూడా పురాణాలు పేర్కొంటున్నాయి.
అందుకనే ఆరు అనే సంఖ్యను ఆ స్వామికి ప్రతీకగా భావిస్తుంటారు...
ఆయనకు ఎన్ని క్షేత్రాలు ఉన్నా, అందులో ఆరు క్షేత్రాలను మరింత మహత్యం ఉన్నవిగా పేర్కొంటారు...
15వ శతాబ్దంలో తమిళ భక్తి సాహిత్యంలో ఈ క్షేత్రాలను తొలిసారిగా పేర్కొన్నారట.
వీటిని తమిళనాట ‘ఆరు పడై వీడు’ ఆరు పుణ్యక్షేత్రాలుఅని పిలుస్తారు. అవేమిటంటే...
*ఆరు పుణ్యక్షేత్రాలు*
*1, తిరుప్పారకుండ్రం*
ఆరు పైడైవీడులో ఇది తొలి క్షేత్రం. మధుర మీనాక్షిని దర్శించుకునేవారు,
ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఈ తిరుప్పారకుండ్రం ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు.
ఇంద్రుని కుమార్తె దేవసేనని, కుమారస్వామి వివాహం చేసుకున్నది ఇక్కడే అని భక్తుల నమ్మకం.
*2, తిరుచెందూరు*
కుమారస్వామి ఆరు ప్రముఖ ఆలయాలలో సముద్రతీరాన ఉన్న ఏకైక ఆలయం తిరుచెందూరు.. తిరువన్వేలి, కన్యాకుమారి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఈ ఆలయం కాస్త దగ్గరే! ఇక్కడ కుమారస్వామి, సూరపద్ముడు అనే రాక్షసుని మీద విజయం సాధించాడట!
*3, పళని*
తమిళనాట దిండుగల్ జిల్లాలో ఉన్న పళని కొండ తెలుగువారికి సుపరిచితమే! ఇక్కడ ఓ చిన్ని కొండ మీద ఉండే కుమారస్వామి దండాన్ని చేతపట్టుకుని ఉంటాడు,
అందుకునే ఆయనను ‘దండాయుధపాణి’ అని పిలుస్తారు. ఇక్కడి స్వామివారి విగ్రహాన్ని తొమ్మిది రకాల లోహాలతో రూపొందించడo మరో విశేషం...
*4, స్వామిమలై*
తమిళనాడులోని కుంభకోణం అనే ఊరుకి అతిసమీపంలో ఈ ఆలయం ఉంది.
ఇక్కడ కుమారస్వామి సాక్షాత్తు తన తండ్రి శివునికే ఓంకారం గురించి తెలియచేశాడట.
స్వామిమలై కేవలం కుమారస్వామి ఆలయానికే కాదు...
ఇత్తడి విగ్రహాల తయారీకి కూడా ప్రసిద్ధమే!
*5, తిరుత్తణి*
రాక్షసులతో యుద్ధం ముగిసిన తర్వాత, కుమారస్మామి సేదతీరిన ప్రదేశం ఇది, ఇక్కడే ఆయన వల్లీదేవిని వివాహం చేసు
కున్నారు.
తిరుపతి లేదా చెన్నైకి వెళ్లినవారు
అక్కడికి సమీపంలోనే ఉండే ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించి తీరుతారు.
*6, పలముదిర్ చోలై*
మధురై నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల నడుము, ఓ చిన్న కొండ మీద ఉందీ క్షేత్రం.
అందమైన ప్రకృతి నడుమ, వల్లీదేవసేన సమేతంగా ఉన్న ఇక్కడి స్వామివారిని చూడటం ఓ దివ్యమైన అనుభూతి అంటారు భక్తులు...సేకరణ..🌞🙏🌹🎻.
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment