Adsense

Friday, February 18, 2022

నేడు గురుపాడ్యమి.



*కలియుగములో రెండవ దత్తావతారమైన శ్రీ నృశింహ సరస్వతి స్వామి వారు శ్రీశైలం పాతాళ గంగ తీరమున ఒక పుష్పరధము అధిరోహించి నిజానంద గమనం చేరి తమ అవతార సమాప్తి గావించిరి.*
*ఆ రోజు బహుధాన్య సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం మాఘ బహుళ పాడ్యమి శుక్రవారం, పుష్యమీ నక్షత్రం దినము అవతార సమాప్తి చేసారు.*
*శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు చివరగా గాణ్గాపూర్ నందు 23 సం. ప్రవాసం చేసి ఎన్నొ విశేషములు జరిగినవి.*
*భక్తుల శారీరిక మానసిక బాధలు తొలగించి అందరినీ అనుగ్రహించారు.* 
*శ్రీ స్వామి వారు చూపిన లీలలు అనంతం.*

*అందులొ భాగముగా శ్రీ గురుచరిత్ర 40 అధ్యాయములో నరహరి కుష్టు రోగము తొలగించుట.*
*అందుకు గాను శ్రీ నరహరి చేసిన శ్రీ నరసింహ సరస్వతి స్వామీ వారిని స్తోత్రం  చేసిన అష్టకం ఎంతో మహిమన్వితమైనది.*

*ఈ గురుపాడ్యమినాడు ఆ స్తోత్రాన్నీ పఠించి దత్తాత్రేయుని అనుగ్రహం పొందుదాము.*                                     🌹🌹🌹🙏🙏🙏దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా🙏🙏🙏🌹🌹🌹దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతి

No comments: