Adsense

Wednesday, June 15, 2022

కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం: నారాయణవనం, చిత్తూరు జిల్లా

 
👉 కలియుగ దైవం వేంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైబోగం. అలాంటి కలియుగ నాధుని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది.
సాక్షాతూ శ్రీ ఏడుకొండల వాడు "ఎరుకలసాని " గా తిరుగాడిన పవిత్రమైన తిరువీదులు ఉన్న పురం నారాయణవనం . లోకకళ్యాణం కోసం పద్మావతి శ్రీనివాసులు భూలోకం లో పరిణయమాడిన స్థలం ఈ నారాయణవనం.
      
తిరుమల యాత్ర లో తప్పక దర్శించాల్సిన ఈ ఆలయ ప్రాంగణం లోనే ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవం గా జరిగింది.

🔅 స్థలపురాణం : శ్రీ వేంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజుకు పిల్లలు లేకపోవటంతో పుత్రకామేష్టి యాగం చేశాడట. పొలాన్ని నాగలితో దున్నుతుంటే నాగలికి ఓ పెట్టె అడ్డుతగిలింది. దానిని తెరచి చూడగా అందులో ఒక ఆడ శిశువు ఉందట. ఆ శిశువుకు పద్యావతి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆకాశరాజు దంపతులు.
తరువాత క్రమంలో వైకుంఠం నుండి బృగ్నుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భూలోకానికి రావటం.
వకుళమాత ఆశ్రయంలో శ్రీనివాసుడుగా ఉండటం జరుతుంది. 
కలియుగంలో శ్రీనివాసునిగా శ్రీమహావిష్ణువు భూమిపై అవతరించాడు . ఆకాశరాజు కుమార్తె పద్మావతి , సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి . వకుళమాత పుత్రుడు శ్రీనివాసుడు . అవతార పురుషుడు . వీరిరువురికీ కళ్యాణం జరిపించాలి వకుళమాత . 
ఆమె సన్యాసిని , ఆశ్రమవాసి . నాగరికతకు దూరంగా ఉంది .  శ్రీనివాసునితో పద్మావతీ దేవి పరిణయం జరిపించి తరించిందా పుణ్యమూర్తి . 
ఆ కళ్యాణానికి సకల దేవగణాలతో దేవదేవేరులందరూ విచ్చేశారు . 
ఆ మహాదానంద ఘటన జరిగింది  నారయణవనంలో .

👉 గ్రామానికి వన్నె తెచ్చేలా పుణ్య అరుణానది ఈ ప్రాంతాన్ని పవిత్రం చేస్తుంది 
 శ్రీవేంకటేశుని భక్తాగ్రణ్యునిగా చెప్పబడే శ్రీ తండమాన్ చక్రవర్తి స్వయంగా ఈ నగరాన్ని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశాడన్నది చారిత్రక సత్యం .

👉గర్భాలయంలో కళ్యాణ వేంకటేశ్వరుని మూర్తి అత్యంత సుందరంగా వుంది . శ్రీనివాసుడు పద్మావతిని ఇక్కడే చూశాడన్న ఇతిహాసాన్ని నిజం చేసేలా చేతిలో విల్లు ధరించి వుంటాడు .
ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు. ప్రాంగణం లోపల పద్మం లో కుర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.

👉 కళ్యాణం జరిపించుకొంటున్న ఈ పెండ్లికొడుకు సర్వలంకార భూషితుడై , సుందరకారుడై భక్తజనులను తన చల్లని చూపులతో ఆదరిస్తుంటాడు . శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులు గర్భాలయంలో వేంచేసివున్నారు . గర్భాలయ  ముఖద్వారం వద్ద నాలుగు చేతులతో ఆయుధాలు ధరించిన ద్వారాపాలకుల విగ్రహాలు రమణీయంగా వున్నాయి . ముఖ్యంగా ఈ ఆలయంలో గమనించవలసిన విషయం ఒకటుంది . గర్భాలయం అంతరాళం , ముఖమండపానికంటే ఎత్తులో వుంది . 
 ఇక్కడ తిరుమల ఆలయానికి , శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరాలయాలకు భిన్నంగా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా మందిరం వుంది . 

👉నారయణవనంలో అమ్మవారి ఆలయం ముందు " భాగంలో " పెద్ద తిరగలి " ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ . శ్రీనివాసుని కళ్యాణ సమయంలో ఈ తిరగలిని ఉపయోగించారన్నది ఇక్కడి పౌరాణిక ఐతిహ్యం .  అమ్మవారికి నలుగు పెట్టటానికి నున్నుపిండి కోసం ఈ తిరగలిని ఉపయోగించినట్లు చెబుతారు.

👉 ఆలయ ప్రాంగణంలోనే దక్షిణం వైపు వరదరాజ స్వామి ఆలయం వుంది . ఉత్తరం వైపున మరిన్ని దేవతా మూర్తులున్నాయి . ఆలయానికి వెనక వైపున కోనేరు వుంది . ఆనాటి రాజ్య కైంకర్యాలతో ఆలయం శోభించిందని చాటిచెప్పే ప్రతీక ఈ సరోవరం మధ్యలో నిరాళిమండపం , మనకు కనువిందుచేస్తుంది . కళ్యాణ వేంకటేశుని ఆలయానికి కొద్ది దూరంలోని సొరకాయల స్వామి ఆలయాన్ని తప్పక చూడాలి . ఇక్కడ నిరంతరాయంగా వెలుగుతున్న హోమగుండం లోని విభూతిని ధరాణచేస్తే అనేక విధాల పీడలు తొలగిపోతాయన్నది స్థానిక ప్రజల నమ్మకం .

👉పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు, లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రార్ధిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంది అని ప్రతీతి.
కేవలం దర్శన మాత్రముచే వివాహం, సంతానం, ఐశ్వర్యం అందించే నారాయణపురం లోని శ్రీ పద్మావతి కళ్యాణ వేంకటేశ్వరస్వామి

👉 ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి . ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతింది . 
అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది . • 

👉ఆలయ ప్రాంగణంలో ఇతర ఆలయాలు : 
🔅శ్రీ పరాశర స్వామివారి గుడి • 
🔅శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి •
🔅శ్రీ శక్తివినాయక గుడి 
👉 ప్రధాన దేవాలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నాయి. అవి : 
🔅శ్రీ అగస్త్యేశ్వరస్వామి గుడి .
🔅శ్రీ పద్మావతి అమ్మవారు గుడి •
🔅శ్రీ ఆండాళ్ అమ్మవారి గుడి •
 🔅శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి • 
🔅శ్రీ రంగనాయకులవారి గుడి . •
🔅శ్రీ అవనాక్షమ్మ గుడి

No comments: