Adsense

Wednesday, June 15, 2022

అశ్వర్థ నారాయణ - చక్ర భీమలింగేశ్వర దేవాలయం, అశ్వర్ద క్షేత్రం : చిన్న పప్పూరు (అనంతపురం)

 

🔅 శ్రీమహావిష్ణువు అశ్వర్థ నారాయణుడిగా, మహాశివుడు శ్రీచక్ర భీమలింగేశ్వరుడిగా ఒకేచోట కొలువైన ప్రాంతం అనంతపురంలోని చిన్నపప్పూరు అశ్వర క్షేత్రం.

👉 పాపాలను తొలగించే స్వామిగా అశ్వర్థ నారాయణుడు పూజలందుకుంటుంటే భక్తుల పాలిట కొంగుబంగారంగా భీమలింగేశ్వరుడు భాసిల్లుతున్నాడు.

👉శివకేశవులకు అభేదాన్ని తెలుపుతున్న అశ్వర్ధ క్షేత్రం అనంతపురం జిల్లా చిన్న పప్పూరులో ఉంది. 
పెన్నానది ఒడ్డున కొలువైన ఈ క్షేత్రం జిల్లాలోనే ప్రముఖ దర్శనీయ స్థలంగా వెలుగొందుతోంది.
 ఇక్కడ స్వయంభూలుగా వెలసిన అశ్వర్ధ నారాయణుడూ శ్రీచక్ర భీమలింగేశ్వరుడూ ఎదురెదురుగా దర్శనమివ్వడం విశేషం. వేములవాడ భీమ కవి ఈ క్షేత్రంలోనే చాలా ఏళ్లు గడిపాడని చెబుతారు.

🔅 స్థలపురాణం

🌀 శివకేశవులు :
👉పూర్వం శింగరభట్టు అనే మునీశ్వరుడికి విధివశాత్తు బ్రహ్మహత్యా దోషం ప్రాప్తి స్తుంది. దీని నుంచి విముక్తి పొందేందుకు నివారణోపాయాన్ని తెలపమంటూ వేదవ్యాసు డిని అడుగుతాడు శింగరభట్టు. అప్పుడు వేదవ్యాసుడు దక్షిణ భారదేశంలోని ఒక చోట పెన్నానది దక్షిణం నుంచి ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్పి, ఆ నదీతీరం లోనే అశ్వర్ధం అనే ప్రాంతం ఉందనీ అక్కడికి వెళ్లి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయమని చెబుతాడు.

👉 వేదవ్యాసుడు చెప్పిన విధంగానే శింగరభట్టు ఆ ప్రాంతానికి చేరుకుని తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై శింగరభట్టుకు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. 
అనంతరం శింగరభట్టు కోరిక మీద స్వామి ప్రాంతంలోనే అశ్వర్ధ నారాయణుడిగా వెలశాడని ప్రతీతి. తన భక్తితో గోవిందుడిని మెప్పించిన శింగరభట్టు కూడా ఇక్కడే శిలారూపంలో దర్శనమివ్వడం విశేషం. 


🔅 భీముడు ప్రతిష్ఠించిన లింగం

👉పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలోని పెన్నానదిలో స్నానమాచరించి గట్టుమీద కొంత సేపు సేద తీరుతారు. 
ఆ సమయంలో పాండవ మధ్యముడు భీముడికి ఇక్కడే భూమిలో శివలింగం ఉన్నట్టు కల వస్తుంది. 
ఈ విషయాన్ని అగ్రజుడైన ధర్మరాజుకు చెబుతాడు, అనంతరం అన్నదమ్ములందరూ కలిసి ఆ ప్రాంతంలో తవ్వి చూడగా శివలింగం దర్శనమిస్తుంది. భీముడి చేత లింగాన్ని పైకి తీయించి, పంచామృతాలతో అభిషేకించి ఆ ప్రదేశంలోనే శ్రీచక్రం మీద ప్రతిష్ఠచేయి స్తాడు ధర్మరాజు. 
అందుకే ఈ క్షేత్రానికి భీమలింగేశ్వర ఆలయం అన్న పేరు వచ్చిం దని చెబుతారు. 

👉 హైందవ సంప్రదాయంలో
శ్రీచక్రానికి విశేష ప్రాధాన్యం ఉంది. 
ఆదిశక్తి అనంత రూపాలూ నవావరణాల్లో ఇమిడి ఉంటాయని ప్రతీతి. అంతటి శక్తి సంపన్న మైన శ్రీచక్రం మీద శివయ్య కొలువై ఉండ టంతో ఇక్కడి స్వామిని శ్రీచక్ర భీమలింగేశ్వరుడిగా కూడా అర్చిస్తారు.

👉 కార్తికమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో స్వామివారిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.


👉 ఇలా చేరుకోవచ్చు : 
అనంతపురం జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్లు, తాడిపత్రి పట్టణానికి 18 కిలో మీటర్ల దూరంలో అశ్వర్ధ క్షేత్రం ఉంది. రోడ్డు మార్గం ద్వారా తాడిపత్రి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఘమాసంలో తాడిపత్రి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు.

No comments: