Adsense

Wednesday, June 15, 2022

అగస్తేశ్వర స్వామి దేవాలయం,చిత్తూరు జిల్లా : తొండవాడ

 
👉 తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే దారిలో 12 కి.మీటర్ల దూరంలో స్వర్ణముఖీ నదీ తీరాన తొండవాడ అనే గ్రామం ఉంది.
     ఈ ప్రదేశాన్నే ముక్కోటి అని పిలుస్తారు.
ఈ ఆశ్రమానికి అనతి దూరంలోనే భీమానది, కళ్యాణీ నది, సువర్ణముకీ నది సంగమం ఉంది. 

👉 ఇది అతి పురాతన దేవాలయం. 
ఇది ఊర్వశి కుమారుడైన గొప్ప సన్యాసి అగస్త్యునిచే స్థాపించబడింది
అగస్త్య మహాముని ద్వాపరయుగంలో తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి, ఇక్కడి ప్రకృతికి, వాతావరణానికి ముగ్దుడై అతిపెద్ద శివలింగాన్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. 

అలా ఈ ఆలయానికి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. 

👉 మూడు నదులు కలవటం వల్ల త్రివేణీ సంగమ ఫలితం లభిస్తుందని అగస్త్యుడు అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడట.   ఒకరోజు ఆయన నదీ స్నానం చేస్తుండగా ఆయనకొక సహజలింగం దొరికింది. 
దానిని నదీతీరాన ప్రతిష్టించి అక్కడొక ఆలయ నిర్మాణం చేశారు మహర్షి. 
ఆ ఆలయం కాలక్రమంలో సువర్ణముఖి నది వరదల్లో కొట్టుకొనిపోయింది. 
ఇది తెలుసుకున్న చోళరాజులు మళ్లీ ఇక్కడ ఆలయం నిర్మించి స్వామివారితోపాటు అమ్మవారిని కూడా ప్రతిష్టించారు. 

👉 అగస్త్యుడు ప్రతిష్టించిన స్వామి కనుక ఆయన అగస్త్యేశ్వరుడు. అమ్మవారు ఆనందం పెంపొందించే తల్లి కనుక ఆనందవల్లి అయింది. 

👉 ఇది చాలా ప్రాచీన సాంప్రదాయ కట్టడము.పక్కనే చిన్న కోనేరు. నదీమధ్యలో ఓ మండపము పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

👉 తనకు శ్రీ పద్మావతి తో కల్యాణం అయిన తర్వాత  అగస్థ్య మహర్షిని దర్శించుకోవటానికి కొత్త పెళ్లికొడుకైన శ్రీ వేంకటేశ్వరుడు పద్మావతి సమేతంగా ఇక్కడకు విచ్చేసాడు.  
శ్రీనివాసుడి కల్యాణం జరగకముందు కూడా నిత్యం అగస్థీశ్వర స్వామిని ఆకాశరాజు, ధరణి దేవి మరియు పద్మావతి దేవి దర్శించుకొనే వారని ప్రతీతి. 

👉అగస్థ్య మహర్షి ఇక్కడే ఉన్న ఐదు వృక్షాలూ కలిసి ఉన్న ప్రదేశం లో తపస్సు చేసుకొనే వారని చెప్తారు. 
ఇక్కడ మరో విశేషం కూడ ఉంది.

👉వివాహం కాగానే శ్రీవేంకటేశ్వరుడు, పద్మావతీ దేవి కొంతకాలం ఇక్కడకు వచ్చి.....పెళ్ళైన నూతన దంపతులు కొండలు ఎక్కరాదు అనే నియమాలు పాటించాలి అని చెప్పారు.  
కనుక అగస్త్యుల వారి ఆనతి మేరకు ఇక్కడికి దగ్గరలోనే కల్యాణి నది తీరాన 6 నెలలు కొత్త కాపురం పెట్టారు. 

ఆ ప్రదేశమే " శ్రీనివాస మంగాపురం"  . 

👉 వేంకటేశ్వర స్వామి మొట్టమొదట తిరుపతి లో అడుగు పెట్టిన ప్రదేశం ఇక్కడే ఉంది. 
అదే  " శ్రీపాదం "  అని పేరు.

No comments: