Adsense

Wednesday, June 15, 2022

శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం : కారంపూడి, గుంటూరు జిల్లా


🌀 పల్నాటి చరిత్రలో ప్రముఖ స్థానం పొంది భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న క్షేత్రం కారంపూడి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయo  

💠 కారంపూడి చెన్నకేశవాలయాన్ని పల్నాటి బ్రహ్మనాయుడు కట్టించాడు. 
ఇది పల్నాడులో విశిష్టమైన దేవాలయం.

💠 ఒకప్పుడు పల్నాటి ప్రాంతాన్ని పరిపాలించిన చందోలు రాజ వంశీకులు కారంపూడి చెన్నకేశవ ఆలయం నిర్మించగా, పల్నాటి బ్రహ్నన్న గారి ఆరాధ్య దైవం అయిన చెన్నకేశవ స్వామి ఆలయాన్ని బ్రహ్మన్న గారు కూడా పునరుద్దించారని కధనాలు ఉన్నాయి.

💠 వీరాచార ఉత్సవాల సమయంలో బ్రహ్మనాయుడు వాడిన నృశింహకుంతల ఆయుధం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయుధానికి గ్రామోత్సవం నిర్వహిస్తారు.. 
ఈ ఆలయంలో శ్రీదేవి,భూదేవి అమ్మవార్లని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.. 
 
💠 " కేశి " అనే దుర్మార్గుడైన రాక్షసుడు బ్రహ్మవరం చేత ఏ ఆయుధం చేత సంహరించకుండా వరం పొంది మునులను,ప్రజలను నానా ఇబ్బందులు పెడుతూ, ఒకనాడు తపస్సులో ఉన్న మార్కాండేయుని వద్దకు వెళ్లి తపోభంగం చేసి భాధించుచుండగా,మార్కాండేయుడు శేష తల్ప శయనుడైన విష్ణు మూర్తిని ప్రార్దించగా, శ్రీ శేషుడు మహావిష్ణువు ప్రారదించాడు. 
వారు వెలసిన స్థలంలో మార్కండేయుడు అభ్యర్దన మేర స్వయంభూ గా వెలసాడని కధనం. 
కేశిని సంహరించిన ఆదిశేషుడు స్వామి వారి హస్తంలో అస్త్రం లాగా మారి వెలసారని పురాణ కధనాలు

💠 చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించిన ఈ ఆలయం ఒకపక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే, మరోపక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది. 
అందుకే ఈ గుడిని గురించి విశేషంగా చెప్పుకుంటారు.
 
💠 కారంపూడి వీరత్వానికి పెట్టింది పేరు. అందుకు తగ్గట్టుగానే, ఈ గుడిలో వీరావేశాన్ని పెంచి పోషించే ఆయుధాలు ఉన్నాయి. 

💠 చెన్నకేశవాలయం పశ్చిమ ముఖంగా ఉంది. ఈ దేవాలయం గర్భగృహం, అంతరాలయం, మండపం - మూడు భాగాలుగా ఉంటుంది. మండపంలో చెన్నకేశవుని వాహనం గరుత్మంతుడు, బ్రహ్మనాయుడి ఆయుధం కోతతం, బాలచంద్రుడి ఆయుధం సామంతం, కన్నమదాసు ఆయుధం భైరవ ఖడ్గం ఉంటాయి. ఇక గర్భగుడిలో చెన్నకేశవ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. 

💠 ఈ ఆలయంలో చెన్నకేశవ స్వామి బహు సుందర రూపుడై ఎడమ చేతిలో చక్రం, కుడి చేతి యందు శంఖం,గద,మాఘ హస్త్ర ధారి యై పాదముల చెంత కుడి వైపున శ్రీ చక్ర యంత్రం,ఎడమ వైపున శ్రీ చక్ర పెరుమాళ్ల కలిగి ఉంటాయి. 
స్వామి వారి కుడిచేతి పక్క ఆలయంలో శ్రీ గోదాదేవి మాత విగ్రహం కలదు.

💠 స్వామి వారికి ఎడమ వైపున ప్రత్యేక దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ అమ్మవారు పద్మాసీనులై చతుర్బుజామురాలై చేతులయందు కమలాలను అభయ వరద హస్తములతో భక్తుల పూజలు అందుకుంటున్నారు.

💠 సంవత్సరాల క్రితం స్వయంభూ గా వెలసిన స్వామి వారిని ఋషులు,దేవతలు కొలిచేవారని గజారణ్య సంహితమందు చూపిన ప్రతీతి. 
ఈ ఆలయానికి బ్రహ్మనాయుడు కాలంలో అనేక గ్రామాలు దానం ఇచ్చినట్లు దానశాసనాలు ఉన్నాయి,ప్రస్తుతం అవి కాలగర్భంలో కలసిపోయాయు.
భక్తుల,వీరాచార వంతుల సహకారంతో ప్రస్తుతం ఆలయంలో స్వామి వారికి వివిధ ఉత్సవాలు జరుగుతున్నాయి.

💠 బ్రాహ్మణాయని కాలం నాటి దేవాలయం శిధిలావస్థకు చేరడంతో దాతలు,భక్తుల సహకారంతో  22-11-2004 న ఆలయ పునఃప్రతిష్ట జరిగింది.
ఉగాది,దేవీ నవరాత్రులు,
శ్రీ కృష్ణాష్ణమి,దీపావళి,కార్తీక మాస ఉత్సవాలు, ధనుర్మాసాల్లో ప్రతి రోజు ఘనంగా  పూజలు జరుగుతాయి. 

💠 ప్రతి సంవత్సరం చైత్రశుధ్ర పౌర్ణమి రోజున స్వామి వారికి ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.

💠 బ్రహ్మనాయుడి పేరు చెప్పగానే చాపకూడు గుర్తొస్తుంది. 
కులాల వ్యత్యాసం విపరీతంగా ఉండి, నిమ్న జాతులుగా పరిగణించే కొన్ని కులాలు అవమాన భారంతో కుంగిపోతున్న రోజుల్లో బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతాన్ని అమలుపరిచాడు. 
అన్ని కులాలవారినీ ఒకదగ్గర కూర్చోబెట్టి బంతి భోజనం పెట్టించాడు. 
కౌరవ, పాండవుల మహాభారత యుద్ధం మాదిరిగానే పల్నాటి యుద్ధం అన్నదమ్ముల మధ్య చెలరేగింది.
అంతులేని కల్లోలాన్ని కలిగించి, అశాంతికి దారితీసిన పల్నాటి యుద్ధం జరిగింది ఈ కారంపూడిలోనే జరిగింది. 
ఆ యుద్ధ చిహ్నాలు ఆలయంలో కనిపిస్తాయి. చెన్నకేశవ స్వామినే కాకుండా ఈ ఆయుధాలను కూడా పూజిస్తారు.

💠 ఈ చెన్నకేశవాలయం గుంటూరు జిల్లా పల్నాటి సీమ, కారంపూడి గ్రామంలో ఉంది.

No comments: