Adsense

Wednesday, June 15, 2022

గోదాదేవి సమేత రంగనాథస్వామి ఆలయం, ఘట్ కేసర్

శ్రీ గోదా అమ్మవారే కట్టించుకున్న ఆలయం🌸🌿ఘటకేసర్ ఏదులాబాద్ తెలంగాణ 🌿🙏 మన్నారు గోదాదేవి సమేత రంగనాథస్వామి ఆలయం. 
🌺సుమారు ఆరువందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ క్షేత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక్క ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. గాజులమ్మగానూ పిలిచే ఈ దేవిని సంతాన ప్రదాయిని గానూ కొలుస్తారు భక్తులు. అమ్మవారే కోరి మరీ ఈ ఆలయాన్ని కట్టించు కుందని అంటారు.

శ్రీ రంగనాథస్వామి ఆలయాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి కానీ,,,,  గోదాదేవి సమేతంగా ఉన్న ఆలయాలు చాలా అరుదు. అలాంటిదే ఒకటి, తెలంగాణ ఘటకేసర్లోని ఏదులాబాద్ లో ఉన్న మన్నారు గోదాదేవి సహిత 
శ్రీ రంగనాథస్వామి సన్నిధానం. 
దాదాపు ఆరువందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అప్పలదేశికుడు అనే భక్తుడు కట్టించాడనీ, అప్పటినుంచీ ఆ వంశస్థులే ఈ గుడి బాధ్యతను తీసుకున్నారనీ అంటారు.

🌺స్థలపురాణం,,,,, 
ఒకప్పుడు తిరువనంతపురంలో అప్పల దేశికుడు, అలివేలమ్మ అనే జంట ఉండేవారు. వాళ్లకు కొడుకు పుట్టాక ఆ జంట దేశాటన చేస్తూ రాయపురం (ఇప్పటి ఏదులాబాద్) చేరుకున్నారట. కొన్నాళ్లకు అప్పల దేశికుడు చనిపోవడంతో ఆ పిల్లాడు చదువుకునేందుకు మేన మామల ఊరు వెళ్లాడట. తండ్రి పేరే పెట్టిన ఆ పిల్లాడికి రోజులు గడిచేకొద్దీ దైవభక్తి పెరగడంతో ఓసారి రంగనాథస్వామి దేవాలయానికి వెళ్లాడట. ఆ రాత్రి అతనికి ఆండాళ్ (గోదాదేవి) కలలో దర్శనమిచ్చి ,,తనను కూడా రాయపురం తీసుకుపోమనీ, అక్కడ గుడి కట్టించమనీ, గుడి ఏర్పాటుకు డబ్బులు అవే సమకూరుతాయనీ చెప్పిందట.
నిద్రలేచేసరికి అతని ఎదురుగా ఉయ్యాల్లో ఊగుతున్న అమ్మవారి విగ్రహం కనిపించిందట. కటిక పేదవాడైన అప్పల దేశికుడు అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని ఆలయం కట్టించేందుకు అవసర మైన డబ్బు ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న సమయంలో చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన జమీందార్లు వచ్చి,  తమకు ముందురోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి డబ్బు ఇవ్వమని ఆదేశించినట్లుగా చెప్పారట. అలా డబ్బు తీసుకున్న అప్పలదేశికుడు ఎదులాబాద్కు వచ్చి ఆలయాన్ని కట్టించి,అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడట.అప్పటినుంచీ ఈ కుటుంబీకులే ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారనీ, క్రమంగా ఇక్కడకు వచ్చే భక్తులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారనీ అంటారు. 

🌺ఆ అమ్మవారిని గాజులమ్మగా పిలవడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ గుడి కట్టిన కొన్నాళ్లకు ఈ ఊరికి గాజులు అమ్మే వ్యక్తి వచ్చాడు.
ఆ సమయంలో ఓ చిన్న పిల్ల వచ్చి గాజులు వేయించుకుని గుళ్లోపూజారి దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పి వెళ్లిపోయిందట. అతను పూజారి దగ్గరకు వెళ్తే,  తనకు ఆడపిల్లలే లేరని చెప్పడంతో అమ్మవారే గాజులు వేయించు కుందని అర్థం చేసుకుని వెళ్లిపోయాడట ఆ వర్తకుడు. అప్పటినుంచే అమ్మవారిని గాజులమ్మగానూ కొలుస్తూ,  ప్రతిఏటా నాగుల పంచమినాడు దేవికి మట్టిగాజుల్ని సమర్పించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తున్నారు భక్తులు🙏🌟🌸🌿🌿🌿.

No comments: