ఐదవ నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్ రాగానే,
మన అందరం వెతుక్కునేది ఆంజనేయ స్వామి విగ్రహం.
అలా కారులోనో, బస్సు లో నో వెళ్తూ, ఆ విగ్రహానికి నమస్కారం చేస్తాం.🙏
హనుమాన్ జంక్షన్ కే ఒక ఐకాన్ ఈ, ఆంజనేయ స్వామి విగ్రహం. అంత పేరు ఉంది ఈ విగ్రహానికి.
కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలను సరిహద్దులో ఉంది ఈ విగ్రహం.
స్వామి పాదాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి. గర్భగుడి పశ్చిమగోదావరి జిల్లాలో, మెట్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయి.
ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాలకంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి.
ఇంకో స్పెషల్ ఏంటి అంటే, నాలుగు ప్రధానమైన రోడ్డుల కూడలి కనుక, దీన్ని జంక్షన్ అని కూడా అంటారు.
ఏలూరు రోడ్,గుడివాడ రోడ్, నూజివీడు రోడ్, విజయవాడ రోడ్, ఈ నాలుగు రోడ్డులు ఇక్కడే కలుస్తాయి.
స్వామి వారి విగ్రహాన్ని 1938వ సంవత్సరం లో ప్రతిష్టించారు.
ఈ విగ్రహం ఎవరు ప్రతిష్టించారు ? హనుమాన్ జంక్షన్ కు ఆ పేరు ఎలా వచ్చింది ?
పూర్వం ఈ ప్రాంతాన్ని, నూజివీడు జమిందారు శ్రీ ఎం.ఆర్ అప్పారావు గారు పరిపాలించేవారు.
ఆయన తండ్రి, శ్రీ మేకా వెంకటాద్రి బహద్దూర్ గారు 1938వ సంవత్సరం లో, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
జమిందార్ మేకా వెంకటాద్రి బహద్దూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయడం తో ఆహారం కోసం వెతికారు.
ఎటుచుసిన బీడు భుములు, డొంకల, ముళ్ళు పొదలతో నిండి అక్కడ అంతా నిర్మానిష్యముగా ఉంది.
జమిందార్ కి ఆకలి బాధ ఎక్కువ అయింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది.
హటాత్తుగా అక్కడకు ఒక కోతి వచ్చి జమిందార్ చేతి లో అరటిపండు పెట్టి అదృశ్యమైపోయింది.
ఆకలితో ఉన్న జమిందార్ ఆ పండును భుజించగానే అతనికి ఎంతో శక్తి వచ్చినట్లుయింది.
సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటిపండు ను ఇచ్చి వెళ్ళాడని గ్రహించి,
భక్తపారవశ్యం తో తన్మయత్వం చెంది శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అక్కడ ప్రతిష్టించాలని భావించారు.
భక్తులను దుష్టగ్రహ పిడముల బారి నుండి రక్షించే నిమత్తం ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహాన్నితయారు చేయించి
నాలుగు రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అనాడు దండకారణ్యం లో శ్రీ రాముడికి ఆకలివేయగా, ఆంజనేయస్వామి వచ్చి అరటి పండు ఇచ్చి స్వామి ఆకలి తీర్చాడు.
అదే విదంగా ఈ జంక్షన్ లో ఆంజనేయ స్వామి "రామా. ఆగు ఇవిగో అరటిపండ్లు" అంటున్నట్లుగా ఉన్న ఆంజనేయ విగ్రహన్ని,
ఆంజనేయస్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల రామాలయాన్ని నిర్మించారు...
అప్పటినుండి ఆ ప్రాంతానికే అభయ ఆంజనేయుడు గా పూజలు అందుకుంటున్నారు స్వామి...జై శ్రీరామ్..
No comments:
Post a Comment