🔅 ఈ భూమి మీద ఆ పరమేశ్వరుడు లేని చోటు, శివుడు లేని వస్తువు, శివుడు లేని ప్రాణి లేదని అందరిలోనూ శివుడున్నాడని అదే అద్వైత తత్వమని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది.
ఈ ముక్కోటి దేవుళ్ళకు ఆది దంపతులైన శివపార్వతులు మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలున్నాయి.
ఒక్కో ఆలయానానికి ఒక్కో చరిత్ర ఉంది. అటువంటి అలయమే అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం .
ఇది అత్యంత మహిమాన్వితమైనది.
👉తాడిపత్రి...మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ వుంది. పూర్వం ఈ ప్రాంతములో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని, తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరు వచ్చిందని కూడా అంటారు.
దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రము అనే పేరు కూడావుంది.
👉ఇది అనంతపూర్ కి 40 కి.మీ. దూరంలో ఉన్న పట్టణం. విజయనగర రాజుల కాలంలో వెల్లివిరిసిన కళల కాణాచి. శివకేశవ ఆలయాలు రెండూ ఉన్న క్షేత్రమిది. ఒకటి చింతల వేంకటరమణ స్వామి వారి ఆలయమైతే రెండవది బుగ్గ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం.
రెండు దేవాలయాలలోనూ అద్భుతమైన శిల్పసంపద, గట్టిగా మాట్లాడితే హోయసల దేవాలయాలయిన హళీ బీడు, బేలూరు శిల్పాలని మురిపిస్తాయని చెప్పవచ్చును.
👉ఇక్కడి రామలింగేశ్వరుని విగ్రహం నీటి బుగ్గలలో దొరికినందున ఈ స్వామి బుగ్గరామేశ్వరుడైనాడు.
అమ్మవారు పార్వతీదేవి,
👉ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగం లో శ్రీ రామ చంద్రుడి చేత ప్రతిష్టిం బడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు.
👉భక్తుల నుండి పూజలందుకుంటున్న రామలింగేశ్వరుడి శివలింగం త్రేతాయుగం కాలం నాటిది.
బ్రహ్మణుడైన రావణుడిని చంపడంల వల్ల వచ్చే పాపం నుండి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామ చంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలిగాలను ప్రతిష్టించారు, అలా ప్రతిష్టింపబడిన శివలింగాలలో ఇది కూడా ఒకటని ఆలయ పూజారులు కథనం.
👉ఎవ్వరైనా ఇక్కడ సొగసులు తీరిన రామలింగేశ్వర ఆలయాన్ని చూస్తే ఈ స్థలం దేవాలయాల భూమియా! అన్న ఆశ్చర్య ఆనందాలు మదిలో నింపుకుని వస్తారు.
👉రామలింగని ఆలయం పినాకినీ తీరాన ఉన్నది. ఆలయానికి గల ఉత్తర, దక్షిణ, పశ్చిమ గోపురాలు శిథిలాలైనాయి. రామలింగేశ్వర లింగం భూమిలో నుంచి చొచ్చుకొని వచ్చినట్లుంటుంది.
👉గర్భగుడికి కుడి ఎడమలలో కోదండ రామస్వామి, పార్వతీ అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి. ఈశాన్యంలో చండీ ఆలయం, దాన్ని ఆనుకొని ఎత్తైన స్తంభాల మంటపం ఉన్నాయి.
రామలింగని ఎదురుగా నంది ఉన్నది. నందికి చేరువలో ఉన్న గోపురం నుంచి చూస్తే నిర్మలంగా ప్రవహించే పినాకిని కన్నుల విందుగా కనిపిస్తుంది.
వర్షాకాలంలో పై నుంచీ కురిసిన గంగ గలగలా పారుతూ పెన్నలో కలుస్తుంది.
👉తెలంగాణలో కూడ " బుగ్గ రామలింగేశ్వర స్వామి " పేరుతొ వికారాబాద్ దగ్గరలో వేరొక ఆలయం ఉన్నది.
కానీ తాడిపత్రి శిల్పకల పురాతన అద్భుతమైన ది..
👉భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుడిని దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ గోడల మీదున్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు.
రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.
👉అలాగే ఏడాదిలో 365 రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతునే ఉంటుంది.
బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది.
ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడినది.
👉ఇక్కడ మండపం నాలుగు స్థంభాలమీద నిర్మించబడి, ప్రతి స్థంభం తిరిగి నాలుగు చిన్న స్థంభాలమీద నిర్మించబడి వున్నది.
ఈ నాలుగు స్థంభాను తాకితే సంగీతం వినిపిస్తుందంటారు.
👉పెన్నా నదీతీరంలో వెలసిన ఈ దేవాలయం వెనుకన స్మశానం ఉంది. ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించటం అరిష్టమని పండితులు చెప్పటంతో మాహాద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశారు.
👉ముఖమండపంలోని స్ధంభాలను తాకితే సప్తస్వరాలు ప్రతిధ్యనిస్తాయంటారు.
No comments:
Post a Comment