Adsense

Wednesday, June 15, 2022

శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం : పొన్నూరు, శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం : పొన్నూరు

 
💠 పూర్వము పొన్నూరు స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళింది. 

💠అప్పుడు ఈ ఊరిని, "పొన్నూరు" (పొన్ను+ఊరు) అని పిలవడం ప్రారంభించారు. 
తమిళంలో "పొన్ను" అంటే బంగారం అని అర్థం. పొన్ను + ఊరు అంటే స్వర్ణపురి అని అర్థం వస్తుంది.
 కాలక్రమేణా ఇదే పేరు వాడుకలో అలాగే పొన్నూరు గా నిలిచిపోయింది. 


👉1. సహస్ర లింగేశ్వరాలయము : 

💠 ఈ ఆలయం పొన్నూరు నందు కలదు.
 ఇది నవీన ఆలయము. 
శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ఆలయాన్ని  బ్రహ్మశ్రీ సద్గురు కోట జగన్నాధ దాసుగారు 1955లో ప్రారంభించి అచిరకాలంలోనే 1962లో పూర్తిచేసి, ప్రజలకు అందించారు.
 
💠 పొన్నూరులో వెలసిన సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం మరో ఐదు దేవతలకు నిలయం కావడం ఆలయ విశిష్టత. 
ఇక్కడ ప్రధాన దైవమైన సహస్ర లింగేశ్వర స్వామితో పాటుగా ఏకశిలా నిర్మిత శ్రీవీరాంజనేయ స్వామి, 
శ్రీ గరుత్మంత స్వామి,
శ్రీ దశావతారాల స్వామి, 
శ్రీ కాలభైరవ స్వామి మరియు 
శ్రీ స్వర్ణ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఆలయంలో శ్రీపార్వతీ దేవి, శ్రీషణ్ముఖ స్వామి పూజలందుకొంటున్నారు.
ఈ విధంగా ఇది ఆ అనేక ఆలయాల సంగమ ప్రదేశంగా ప్రఖ్యాతిగాంచినది
 
💠 ఇక్కడ 5 లింగాలను శివుడి పాదాలదగ్గర ప్రతిష్టించడం జరిగింది . నల్లటి శిలపైన అమ్మ వారి రూపం దర్శనం ఇస్తుంది. 
5 అకండ దీపాలు ఉంటాయి ఈ క్షేత్రం లో . ఆలయ గోడల పైన అద్భుతమైన శిల్పాలు ,దేవాలయ చరిత్ర ను రాయడం జరిగింది . 
ఆలయం లో వివిధ రకాల దేవత మూర్తులు కొలువై ఉన్నారు. .
 
💠శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి ఆలయానికి సంబంఛించి ఏలాంటి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాలు లభ్యం కావడం లేదు. 
దీనికి కారణం ఆలయం ఇటీవల అంటే క్రిందటి శతాబ్దం పూర్వార్ధంలో నిర్మించబడింది.

💠 శ్రీ సహస్ర లింగేశ్వర స్వామికి,మరియు శ్రీ కాలభైరవ స్వామి వారికి పూజలు 'శ్రీ శైవ ఆగమ' సాంప్రదాయానికి అనుగుణంగా నిర్వహిస్తున్నారు.
శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ గరుత్మంత స్వామి స్వామి, దశావతారములు ఆలయం, శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు, "వైఖానస ఆగమ" సంప్రదాయం ప్రకారం నిర్వహించబడుతున్నాయి. 

💠 ఆలయంలో  శివుని పాదాల చెంత ఐదు లింగాలు స్థాపించబడినాయి. అవి వెర్వేరు పరిమాణాలలో ఉన్నాయి. ఇక్కడ వెలసిన శ్రీవీరాంజనేయ స్వామి 24 అడుగుల ఎత్తు విగ్రహం రూపంలో దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా శ్రీ  గరుత్మంత స్వామి విగ్రహం 30 అడుగుల ఎత్తు కలిగి ఉన్నది.

💠 ఇక్కడ, సహస్ర లింగం అంటే వెయ్యి లింగాలు అని అర్ధం. 
శివ లింగాలను కాశి క్షేత్రం నుంచి తీసుకు రావడం వలన, దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. 
శివ లింగానికి గంగాభిషేకం చేస్తారు.
 ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి శివ లింగం నుండి గంధం తీసి, భక్తులకు పంపిణీ చేస్తారు.


👉 2. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం: 

💠 తెలుగు రాష్ట్రాల్లో  ప్రసిద్ది చెందిన ఆంజనేయ క్షేత్రాల్లో చాల ప్రాముక్యత గల దేవాలయం పొన్నూరు ఆంజనేయ స్వామి దేవాలయం . 

💠ఈ దేవాలయంలో  శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంత స్వామిల విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. ఈ విగ్రహాలు 24 అడుగుల ఎత్తు 30 అడుగుల ఎత్తుతో నయనానందకరముగా కనిపిస్తూ బహుళ ప్రసిద్ధికెక్కినవి.

💠ఆలయంలో ఉన్న మహిమన్మితమైన హనుమ గ్రహ పీడలను ,దుస్త శక్తులను తోలిగిస్తాడని భక్తుల విశ్వాసం. 
స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు . 

💠ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి . మంగళ ,శని వారాల్లో ప్రత్యేకమైన పూజలు ఉంటాయి . 

💠 ప్రపంచం అంతటి నుండి వచ్చే పర్యాటకులు ,యాత్రికులు, ఆంజనేయ స్వామి భక్తులు ఈ గ్రామంలో ఉన్న వీరాంజనేయస్వామి మందిరాన్ని తప్పక సందర్శించాలని అనుకుంటారు. 

💠 సంతానము లేని వారు ఈ దేవాలయంలో ఉన్న వీరాంజనేయస్వామికి నలభై రోజులు పూజించినట్లయితే సంతానము లేనివారికి సంతానము కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకము. 

💠ఈ దేవాలయాన్ని దర్శించడం వల్లనా మానసికంగా ఏర్పడిన ఆందోళనలు , రుగ్మతలు ,భాధలు, కష్టాలు తొలిగి ప్రశాంతత మరియు ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలుగుతాయి అని భక్తులు విశ్వసిస్తారు.

No comments: