Adsense

Wednesday, June 15, 2022

శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవస్థానము : హిందూపురం. (అనంతపురం)



🔅 శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల పాలిట కల్పవృక్షం అనడానికి హిందూపురం నందు జరిగిన సంఘటనే సాక్ష్యం.

👉 హిందూపురంలో తనను దర్శించడానికి ఉవిళ్ళూరుతున్న ఓ వృద్ధ దంపతుల కోసం తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి హిందూపురానికి తరలివచ్చి ఇక్కడ పేట వేంకటరమణ స్వామిగా స్థిరపడినారు.

👉హిందూపురం పట్టణంలో శ్రీ పేట వేంకటరమణస్వామి దేవస్థానం దాదాపు 643 సంవత్సరముల క్రితం స్థాపించారని చరిత్ర చెబుతోంది. 
వేంకటరమణస్వామి ఆలయ నిర్మాణం వెనుక ఒక ఐతిహ్యం కూడా జన బహుళ్యంలో ప్రచారంలో ఉంది.

👉 ఒకప్పుడు హిందూపురం ప్రాంతాన్ని హిందూరావు అను సామంతరాజు పాలించేవాడు. హిందూరావు తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో తిరుమలకు నడిచి వెళ్ళి వేంకటరమణుని దర్శించడం ఎలా? అని కోర్కె కల్గడంతో వృద్ధ దంపతులు స్వామి! నిన్ను దర్శించు భాగ్యం కలిగించు అని మనసులోనే ప్రార్థించాడు.

👉 భక్త జనమందారుడైన శ్రీ వేంకటరమణస్వామి ఒక రోజు హిందూరావు గారికి కలలో కనిపించి మీ తల్లితండ్రుల కోరిక నెరవేరాలన్న, ఈ ప్రాంతంలోని నా భక్తుల మనోవాంఛ తీరాలన్న, ఇక్కడి నా భక్తులు తిరుమలకు రానవసరం లేకుండా యిచ్చటనే నా దేవస్థానము నిర్మించమని ఆజ్ఞాపించెను. స్వామి వారి ఆజ్ఞానుసారం హిందూరావు శ్రీ పేట వేంకటరమణ స్వామి దేవస్థానం నిర్మించెను. 

👉ఈ దేవస్థానం గర్భాలయం నందు 7-11-2004వ తేది కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారు శ్రీ చక్ర స్థాపన చేసిరి. 


👉శ్రీ స్వామి వారి ఆలయము మరియు విగ్రహ ప్రతిష్ఠ తిరుమల శ్రీ వేంకటరమణ స్వామి ప్రేరణతో నిర్మించడం జరిగింది, కావున ఈ దేవస్థానం ఎంతో పవిత్రను సంతరించుకొంది. 

👉అనారోగ్య పీడితులు, గ్రహపీడిత భక్తులు వారి వారి కోర్కెలతో శ్రీస్వామి వారిని సేవిస్తే మహామహిమోపీతులు, భక్తజన మందారులు అయిన శ్రీ వేంకటరమణ స్వామి భక్తుల సర్వ కోర్కెలు తీర్చుననడంలో సందేహం లేదు. 

👉నిరంతర పూజలతో, ధృడ విశ్వాసంతో దాతృత్వంతో సేవించిన భక్తాదుల మనోవాంఛలు తీరుస్తూ శ్రీస్వామి వారు హిందూపుర పరిసర వాసులకు ప్రత్యక్ష కలియుగ దైవంగా దర్శనమిస్తున్నారు.

👉 ఆనాటి నుండి ఈనాటి వరకు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున  శ్రీ పేట వేంకటరమణస్వామి బ్రహ్మరథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

No comments: