💠గుంటూరు జిల్లా, దుర్గి మండలం, అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్నది. పేరులో శ్రీ లక్ష్మి అని ఉన్నా, ఈమెను పార్వతి దేవి అంశగా భావిస్తారు.
🌀 అమ్మవారి చరిత్ర:
💠 ద్వాపర యుగాంతంలో కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కొలువుదీరి వుండగా నారదుడు మరియు నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి దర్శనానికి వచ్చారు. ఈ రోజు నందీశ్వరుడు నాట్యం చేస్తాడు అని నందీశ్వరునితో నాట్యం చేయమని శివుడు ఆజ్ఞాపించెను.
నందీశ్వరుడు నాట్యంని చూసి పార్వతి దేవి పగలబడి నవ్వింది.
💠 అందుకు కోపంతో శిలాదుడు పార్వతీ దేవితో " తల్లీ ఎందుకు నా పుత్రుడు నాట్యం చూసి హేళన చేయుచున్నారని ప్రశ్నించగా,దానికి బదులుగా పార్వతి లయబద్దం లేని నాట్యం వింత రూపంతో చేసే నాట్యం చూసి నవ్వు వచ్చిందని,అసలు ఈ నాలుగు కాళ్లతో వున్న వింత ఆకారంను గర్భాన మోసిన నీ భార్య అసలు మనిషినా? అంటూ నవ్వుతూ అడిగింది.
దానికి పట్టరాని కోపంతో శిలాదుడు పరమ శివుని భార్యవన్న గర్వంతో మునీశ్వరులను వారి భార్యలను అవమానిస్తావా, అంటూ భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవరూపంలో పుట్టి,12సంల వయస్సు లో వివాహాం కాకుండానే గర్బం ధరించి, అవమానంకు గురి అయ్యి తుదకు నీ ఇంటి వారే నిన్ను అవమానించి అగ్నిలో ఆహుతి చేయుదరని శపించెను.
💠 భూలోకంలో పరమనిష్టాగరిష్టుడు,శివున్ని అనునిత్యం కొలిచే యాగంటి అను కమ్మవారి కులంలో జన్మిస్తావు,మరియు నీకన్నా ముందే కైలాసంలో కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది. అనునిత్యం ఆ కామధేనువును కొలువుము,ఆ గోవు పంచకం వల్లన నీకు మాయా గర్బం వస్తుంది.నీ గర్బంలో నందీశ్వరుడు సూక్ష్మరూపంలో ఉంటాడు అని పలుకుతూ, మీ మానవ రూపం అంతంతో శాప విముక్తి కలుగుతుందని చెప్పెను.
💠 ఇదంతా చూస్తున్న శివుడు నోరెత్తకుండా మౌనంగా ఉండటం గ్రహించి,పార్వతి దేవి ఏమిటి స్వామి ఇంత జరుగుతున్నా మీరు నోరు మెదపకుండా అలా ఉన్నారు, నందీశ్వరుడు నా కుమారుడు లాంటి వాడు అతన్ని చూసి నేను నవ్వటం ఏమిటి? ఈ శాపం ఏమిటి? అని ప్రశ్నించింది. దానికి బదులుగా పరమ శివుడు మరిచితివా పార్వతీ, గజాసుర మరణం తర్వాత నందీశ్వరుడు నీ గర్భాన జన్మించాలని వరం కోరగా, నువ్వు వరం ప్రసాదించావు. ఇప్పుడు జరిగినదంతా విష్ణుమాయ, లోక కళ్యాణం కోసం నువ్వు భూమిపై అవతరించ వలసిన సమయం ఆసన్న మయినది దిగులు చెందకు అని వారించాడు.
💠 పార్వతీ దేవి నిదానంపాడులో ఉన్న యాగంటి రామయ్య,సుగుణమ్మ దంపతులకు జన్మించెను. ఆమెకు శ్రీలక్ష్మి అని నామకరణం చేసారు. ఆయనకు నలుగురు మగ సంతానం కలరు. మూర్తయ్య, వెంకయ్య, నరసయ్య, లింగయ్యలు. ప్రతి రోజు శ్రీలక్ష్మి గోశాలకు వెళ్లి,కామధేనువు కు నమస్కరించి,3 ప్రదక్షినలు చేసి కామధేనువు గోపంచకంను స్వీకరించేది.
💠 ఇలా 12 సం.ల వరకు అనునిత్యం చేసేది. ఒకరోజు ఒక ఆంబోతు,రామయ్య గోశాలపై పడి కామధేనువుతో బలవంతంగా క్రీడించింది.అదే రోజు కూడా శ్రీలక్ష్మి రోజు లాగే గోశాలకు వెళ్లి కామధేనువుకు నమస్కరించి గోపంచకం స్వీకరించగా,ఆంబోతు వీర్యకణాలతో ఉన్న నీరు శ్రీలక్ష్మి గర్భంలోకి వెళ్లి,గర్బం దాల్చేలా చేసింది. అప్పుడు శ్రీలక్ష్మి రజస్వల కూడా కాలేదు,కాని ముని శాపపలం వలన గర్బం దాల్చిoది శ్రీలక్ష్మి .
💠 ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆమెని, వారి ఇంటివారిని చాల అవమానించారు. దానితో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకి నిప్పు పెట్టాలి అని నిర్ణయించి తమ తల్లితండ్రుల ఇంట లేని సమయంలో ఒక ఆదివారం రోజు ఆమెతో పొలంకు మధ్యహ్నం భోజనం తీసుకురమ్మని చెప్పారు.
💠 అన్నలలో చిన్న అన్న అయిన లింగయ్య తన అన్నలు మాటలు ద్వారా చెల్లిని అంతం చేయుచున్నారని అర్ధమయ్యి, అన్నలారా, శ్రీలక్ష్మికి గర్బం దైవ లీల అని ఆమెను ఏమి చేయవద్దని వారించాడు కానీ మిగతా అన్నలు అతని మాటలు వినలేదు.
💠 అన్నలు బలవంతంగా శ్రీలక్ష్మీని అగ్నికి ఆహుతి చేశారు.12 గం మిట్టమధ్యనం సమయంలో శ్రీ లక్ష్మీ అమ్మవారు ఓ గ్రామ ప్రజలారా నేను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను వారికి ఈ విషయం తెలియక దహనం చేసారు. ఆదివారం నన్ను దహనంచేసారు కావున ప్రతి ఆదివారం నాకు పసుప,కుంకుమ తొ పూజించండి.నన్ను దహనం చేసిన అన్నల వంశం నాశనమయ్యి ఒక్క లింగయ్య వంశం మాత్రం వర్ధిల్లితుంది అని చెప్పి, నాకు ఎటువంటి రూపం కల్పించరాదని,నన్ను మండుటెండలో అగ్ని దహనం చేసినంద్దున నాకు ఆలయం కట్టవద్దని,నన్ను ఎండలో ఉండే భక్తులు దర్శించుకోవాలని షరతు పెట్టింది.
💠 "జయజయ లక్ష్మి నిదానంపాటి శ్రీలక్ష్మి" అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తాను అని చెప్పి వరం ఇచ్చింది.
💠 భక్తులు అమ్మవారిని దర్శించి భక్తితో ప్రార్ధించి మొక్కుకుంటే కోరిన మొక్కులు తీరుతుండటంతో ఈ విషయం ఆ నోటా,ఈనోటా ప్రాకి ఒకప్పుడు సాధారణ రద్దీ ఉండే అమ్మ ఆలయం ప్రస్తుతం ఆదివారం వేల సంఖ్యాక భక్తులతో అతి రద్దీ గా మారింది .
ఇటువంటి మహిమ కలిగిన దేవత పల్నాడు ప్రాంతంలో వెలవటం అదృష్టం.
No comments:
Post a Comment