🔅 తాతయ్యగుంట గంగమ్మదేవి తిరుపతిలోని అవిలాలలో జన్మించిందని నమ్ముతారు. తాతయ్యగుంట గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని చెల్లెలుగా పూజిస్తారు.
👉 ప్రతి గ్రామంలోని అందరు అన్నోన్యమైత్రి బావంతో ఆరాధించడానికి వీలుగా గ్రామ దేవతా పూజ ఏర్పడింది.
ఒకప్పుడు గ్రామస్తులే స్వయంగా పూజించేవారు,తర్వాత క్రమంగా మందిరాలు, ఆలయాలు ఏర్పడినాయి. మునుపు వేప చెట్టు క్రిందనో,కొండ క్రిందనో,ఎతైన ఒక పెద్ద బండనో,రాయినో వుంచి,దాన్నే గ్రామ దేవతగా బావించేవారు.తర్వాత విగ్రహాలు వచ్చాయి. ఇప్పటికి చాలా గ్రామంలో గుడిగోపురాలు లేకుండా,విగ్రహాలు లేకుండా,పెద్ద బండలే గ్రామ దేవతలుగా పూజలు అందుకొంటున్న సంగతి మనం గమనించవచ్చు
👉 గ్రామ సంరక్షణకు,మశూచి మొదలగు వ్యాధుల నివారణకు,దుష్టశక్తులను రానివ్వకుండా,జంతువులను వింత వ్యాధులనుండి సంరక్షించుటకు,వర్షాలు వచ్చి భూములు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండడానికి,పంటలకు తెగుళ్ళు రాకుండా ఉండుటకు- ఇలా అనేక శుభ ఫలితాలకై గ్రామ దేవతలను పూజించుట ఆచారంగా ఏర్పడింది.
👉 తిరుపతి స్థానిక నివాసితులు 'జాతర' ఆచారబద్ధంగా ఆచరిస్తారు.
తిరుపతి ప్రజలకు ముఖ్యమైన పండుగ తిరుపతి గంగమ్మ జాతర. పండుగ సమయంలో వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
తిరుపతి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం మే మొదటి పక్షం రోజులలో జరుపుకునే వార్షిక పండుగ.
👉అన్ని చోట్లా వున్న గంగమ్మకు, తిరుపతిలో ఎంతో వైభవంగా జాతర జరుపుకుంటున్న గంగమ్మకు చాలా ప్రత్యేకతలు ,విశిష్టతలు ఉన్నాయి.
ఇక్కడి గంగమ్మకు చాలా చారిత్రక నేపధ్యం ఉంది.
ఇక్కడి తిరుపతిలో కొలువైన ఇద్దరు "గంగమ్మలు" మహా మహిమ గలవారె.
👉తాళ్ళపాక గంగమ్మను పెద్ద గంగమ్మగా అని ,తాతయ్య గుంట గంగమ్మను చిన్న గంగమ్మగా అని పిలుస్తుంటారు
👉 తాళ్ళపాక గంగమ్మ గుడి తాళ్ళపాక చెరువు గట్టు (తిరుపతి)ఫై వుంది. ఈ చేరువునే- నేడు ఆర్.టి.సి. బస్ స్టేషన్ అయింది.తాతయ్య గుంట గంగమ్మ గుడి తుడా ఆఫీసుకు ముందు వైపున ఉంది.
భక్త్తులు విశేషంగా తమ మొక్కుబడులు తాతయ్య గుంట గంగమ్మకే సమర్పిస్తుంటారు
👉ఈ ఇద్దరు గంగమ్మల చరిత్ర ,ఇక్కడికి ఎలా వచ్చిందో సంగ్రహంగా చూద్దాం
పూర్వం తిరుమలఫై శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి అనే ఒక వైష్ణవ భక్తుణ్ణి ``తాతా! తాతా అని పిలిచేవారట! అందువల్ల ఆ భక్తుని పేరు తాతచార్యులుగా రూపొందింది.
క్రి.శ.16 వ శతాబ్దంలో ఆ తాతచార్యుల వారి వంశస్తులకు కైంకర్యం కోసం లబించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది.
ఆ తాతాచార్యుల వంశస్తులచే చెరువు(గుంట) గట్టున ప్రతిష్టించిన గంగమ్మ కనుక `తాతయ్య గుంట గంగమ్మ' అనే పేరు వచ్చింది.
👉 పూర్వం తిరుమలకు యాత్ర చేసే భక్తులు మొదట ఈ గ్రామ దేవతను పూజించి ,పిదప తిరుమలకు బయలుదేరేవారని పెద్దలు అంటారు. గంగమ్మ శ్రీవారి చెల్లలని అందుకే ఒక సోదరుడు తన సోదరికి పుట్టినరోజు కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంవారు నుండి(సారే) చిర,రవిక,పసుపు,కుంకుమ,గాజులు,మున్నగు, మంగళ ద్రవ్యాలు, జాతరకు ముందురోజు గంగమ్మకు పంపడం ఈనాటికి ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
👉అది పరాశక్తి అయిన గంగమ్మ తిరుపతికి దక్షిణంవైపున రెండు కి.మీ దూరంలో వున్న అవిలాల గ్రామంలో పుట్టిందని అంటారు.ఇప్పటికి అవిలాల గ్రామం నుంచి పసుపు కుంకుమలు రానిదే గంగమ్మ జాతర జరిపించుకోదు అని చెప్పి...అమ్మవారికి జాతర చేయరు.
కనుక ఆ గ్రామం నుండి విధిగా అమ్మవారికీ మంగళ ద్రవ్యాలు ప్రతి ఏడు వస్తాయి.
👉ప్రసిద్ద వైష్ణవచారుడైన తాతాచార్యులు అన్నమాచార్యుల స్వగ్రామమైన తాళ్ళపాక నుండి గంగమ్మను తెచ్చి,తిరుపతిలో నిలిపినందున తాళ్ళపాక గంగమ్మ అయిoదని ప్రతీతి.
🔅తిరుపతి గంగమ్మ జాతర వెనక ఉన్న చరిత్ర :
👉జానపద కథల ప్రకారం, "పాలెగాడు" అని పిలువబడే స్థానిక నాయకుడు అందమైన స్త్రీలను ప్రలోభపెట్టేవాడని , అతని ఆదేశాల ప్రకారం, కొత్తగా పెళ్లయిన స్త్రీలు తమ మొదటి వివాహ రాత్రి అతనితో గడపవలసి వచ్చింది.
తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో గంగమ్మగా జన్మించిన జగన్మాతను మహిళలు వేడుకున్నారు.
ఆమె పెద్దయ్యాక పాలెగాడు తన కామపు చూపును గంగమ్మపై వేశాడు. ఆ తర్వాత గంగమ్మ తిరస్కరించినప్పుడు ఆమెను ప్రజల దృష్టికి లాగి పాలెగాడు అవమానించాడు. ఆమె తన భయపెట్టే “విశ్వరూపం” అతనికి చూపించినప్పుడు, మరణం నుండి తప్పించుకోవడానికి, పాలెగాడు పారిపోయి గుర్తు తెలియని ప్రదేశంలో దాక్కున్నాడు. అతని కోసం వెతుకుతూ గంగమ్మ మూడు రోజుల పాటు అనేక వేషధారణలు వేసుకుంది. మరియు నాల్గవ రోజు, ఆమె పాలెగాడు, అతని యజమాని (దొర) వలె ధరించి ఆకర్షించింది. ఆమెను తన యజమాని అని తప్పుగా భావించి, పాలెగాడు ప్రజల్లోకి వచ్చాడు, ఆమె చేత చంపబడ్డాడు.
👉ఈ చిరస్మరణీయ ఘట్టానికి గుర్తుగా, జగన్మాతకు గంగమ్మ దేవి రూపంలో కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతి వాసులు జాతర వేడుకలు నిర్వహిస్తున్నారు...
ఈనాటికి 3 రోజుల పాటు తిరుపతి ప్రజలు వివిధ వేషధారణలతో అమ్మవారిని పూజిస్తారు.
No comments:
Post a Comment