Adsense

Wednesday, June 15, 2022

శ్యామలాంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం : రాజమండ్రి

 
🔅శ్యామలంబ (సోమలమ్మ తల్లి ) దేవాలయం రాజమండ్రి ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి.
ఇక్కడ ఆలయం లో ఉన్న దేవత శ్యామలంబ.
ఈ అమ్మవారిని రాజమండ్రి నగర దేవతగా పిలుస్తారు.

👉రాజమండ్రి మంగళవరపు పేటలో 
శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం ఆలయం ఉంది

👉శ్యామలంబ అమ్మవారు పార్వతీ దేవి యొక్క తొమ్మిది దైవ రూపాలలో ఒకటి.

👉 ఈ అమ్మవారి చరిత్ర సరిగా ఎవరికీ లభించ లేదు; 
కాని అమ్మ వారి ఆలయం రాజ రాజ నరేంద్రుని కాలం నుంచి వుందనీ, వారు శ్రీ అమ్మవారిని కొలిచేవారని కొంతమంది పెద్దలు చెబుతారు. 

👉పెద్దల కథనం మేరకు అమ్మవారు చిన్న వయసులో తోటి పిల్లలతో ఆడుకుంటూ ఏడు పెంకులు కోసం అని బయలుదేరి ప్రస్తుతం ఆర్.టి.సి బస్సు కాంప్లెక్సు దగ్గర ఉన్న ప్రదేశంలో అమ్మవారిగా అవతరించారని అక్కడే ఆమె నేను సోమ్మలమ్మను రాజమహేంద్రవరం నగర దేవతను అని ప్రకటించారని పెద్దలు చెబుతుంటారు. అలా దేవతగా మారిన అమ్మవారు ప్రతి ఏట ఉగాది పర్వదినం సందర్భంలో నన్ను నగరంలోకి తీసుకువెళ్ళి జాతర చెయ్యాలి అని వారి భక్తులను ఆదేశించారు అంట ! 
ఆ తల్లి కోరిన విధంగానే నేడు ప్రతీ ఏట ఇక్కడ అమ్మ వారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. 

👉ఈ జాతర జరిగే తీరు హిందూ కుటుంబంలో ఆడపిల్లకు గల ప్రాముఖ్యం, అక్కచెళ్ళెల మధ్య వుండే అనుబంధం అందరికి స్ఫూర్తి కలిగిస్తుంది. 
అది ఎలా అంటే ఒకసారి జాతర జరిగే తీరును తెలుసుకుందాం. 

👉శ్రీ సోమలమ్మవారు ఇప్పటికీ నగరం చివరన కొలువై ఉన్నారు. సాధారణంగా తెలుగు సంవత్సరాది (ఉగాది) నాడు వచ్చే జాతర పండుగ సందర్భంగా మాతృ సంస్థ అయిన శ్యామలాంబ ఆలయానికి శ్రీ సోమాలమ్మవారిని సత్కరించి తీసుకువస్తారు. 

👉అమ్మవారి పుట్టినిల్లుగా పిలువబడే శ్యామలనగర్ (కొత్త పేట) లోని ఆలయంలో నుంచి అమ్మవారి కుటుంబంకి చెందిన వ్యక్తి అమ్మవారిని పుట్టింటికి పిలిచేందుకు కావిడితో చీర,ముర్రట (పసుపు నీరు )వేపాకులు ఇంకా ఇతర సారె వస్తువులు తీసుకొని రోడ్డు మర్గాన రాజమహేంద్రవరం నగర వీదులలో నుంచి వెళ్తారు ఈ మార్గ మధ్యంలో ప్రజలు ఆ కావిడి తీసుకొని వెళ్ళే వ్యక్తికి కాళ్ళు కడిగి అమ్మ వారిని నగరంలో తీసుకొని రావాలని ప్రార్థిస్తారు.
 ఈ సమయంలో పాత సోమాలమ్మ ఆలయం వద్ద జాతర మొదలవుతుంది. 
ఈ వ్యక్తి ఆ ఆలయంకి వెళ్లి అమ్మవారిని పిలిచి జాతరగా అమ్మను తీసుకొని నగరం లోకి ప్రవేశిస్తారు.

👉 దారిపొడవునా ప్రజలు అమ్మవారికి వేపాకులు ముర్రట డప్పులతో స్వాగతం పలుకుతారు అలా అమ్మవారు అత్త వారి ఇంటినుంచి పుట్టింటికి వస్తారు. 
అప్పుడు పుట్టింటి వద్ద జాతర అంగరంగ వైభవంగా మొదలవుతుంది. 
అమ్మవారు నగరంలో ఉండే ఒక్కో రోజు అమ్మవారి చెల్లెళ్ళుగా పిలిచే గొల్లమారమ్మతల్లి,ముత్యాలమ్మ తల్లి,గంటాలమ్మతల్లి,పున్తలమ్మ తల్లి గంగలమ్మ తల్లి మొదలగు అమ్మవారులు ఊరేగింపుగా జాతరతో ఈ ఆలయం వద్దకు వచ్చి అమ్మ వారిని కలుసుకుంటారు...

👉 చూసారా ఎంత ఆప్యాయత !.
ఈ జాతర ప్రతి ఒక్కరికి ఆదర్శం. 
అలా అందరు అమ్మవారులు పల్కరించాక చివరగా సోమాలమ్మ అమ్మవారి జాతర అంగ రంగ వైభవంగా జరుగుతుంది. 
అలా ఈ జాతర చివరి రోజు అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తూ అత్త వారి ఇంటికి వెళ్తారు.
 ఈ విధంగా జాతర ముగుస్తుంది.

No comments: