💠 కోరిన కోర్కెలు తీర్చే మన తూర్పుగోదావరి జిల్లా తంటికొండ
శ్రీ వెంకటేశ్వరశ స్వామి వారి ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం ..
💠 శ్రీ వెంకటేశ్వరశ స్వామి కొలువుదీరిన ఓ అపురూప క్షేత్రం తంటికొండ.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉందీ ఆలయం.
ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసే ఈ క్షేత్రంలో స్వామి వారి ఆవిర్భావం వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
💠 పూర్వం ఈ కొండ మీద అనేక మంది మునులు, ఋషులు తపస్సు చేసినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి.
ఆ కాలంలో ఆ పుణ్య పురుషులంతా తమ తపశ్శక్తిని ఈ కొండపై ధార పోశారట. అనంతరం వారు ఇక్కడ అపూర్వమైన జ్ఞానాన్ని అందుకున్నారట.
ఆ సందర్భంలో ఇక్కడ ఓ దివ్యమైన తేజస్సు సాకారమైందట.
💠ఆ కాంతి పుంజాన్ని శ్రీనివాసుని స్వరూపంగా భక్తులు భావించి ఈ కొండపై ఆలయాన్ని నిర్మించారు.
💠 తంటికొండ గ్రామానికి దక్షిణ దిశలో సుమారు 200 అడుగుల ఎత్తులో ఈ ఆలయం విలసిల్లుతోంది.1961 సంవత్సరంలో ఈ కొండపై స్వామివారి అర్చావతార మూర్తిని ప్రతిష్టించి అప్పటి నుంచి స్వామి వారిని సేవించుకుంటున్నారు.
💠 గర్భాలయంలో సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామి వారు దర్శనమిస్తారు. స్థానక భంగిమలో ఉన్న స్వామి వారిని మాఘ శుద్ధ పంచమి నాడు ప్రతిష్టించారు.
💠 బద్దిరేద్ది శేషామణి అనే భక్తురాలికి స్వామి కలలో కనిపించి తాను పరంజ్యోతి రూపంలో సాకారమవుతానని చెప్పారట.
అనంతరం స్వామి జ్యోతిగా సాకారమిచ్చారట.
మరో భక్తురాలికి తన అర్చావతార మూర్తుల గురించి వివరాలు చెప్పినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి.
💠 ఏటా మాఘ మాసంలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
ఓ విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతులను ఇచ్చే మహత్తర క్షేత్రమిది.
💠 ఈ ఆలయం ఆవరణలో మరికొన్ని దేవాలయాలు వున్నాయి.
* గోవిందరాజు స్వామి ఆలయం
* ఆంజనేయస్వామి ఆలయం
* శ్రీవారి స్వయంభుః పాదం
🔅 ఈ ఆలయం చుట్టూ ప్రకృతి శోభతో కమనీయంగా ఉంటుంది.
No comments:
Post a Comment