ఈ నవరాత్రులలో దుర్గామాత యొక్క నాల్గవ అవతారము "కుశ్మాండ దేవి" ....!!
🌿దరహాసము చేయుచు బ్రహ్మానందమును సృజించునది గావున ఈ దేవిని కుశ్మాండ దేవి అను పేరుతొ విఖ్యాతమయ్యెను.
🌸ఈమెయు సింహవాహినీయే. సంస్కృతము నందు కుశ్మాండ అనగా గుమ్మడి కాయ. కుశ్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరము.
🌿 అందువలననే ఈమెను కుశ్మాండ దేవి అని పిలుస్తారు. నవరాత్రి ఉత్సవములలో నాల్గవ రోలున్నా కుశ్మాండ దేవి స్వరూపముననే దుర్గామాత భక్తుల పూజలను అందుకొనును.
🌸ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రము నందు స్థిరమగును. కావున ఈ దినమున సాధకుడు మిక్కిలి పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో కుశ్మాండ దేవి స్వరూపమునే ధ్యానించుచు పూజలు సలుపవలెను.
🌿 కొద్దిపాటి భక్తి సేవకులకు ఈ దేవి ప్రసన్నురాలగును . మానవుడు నిర్మల హృదయముతో ఈమెను శరణుజొచ్చినచో అతనికి అతి సులభముగా పరమపదము ప్రాప్తించును.
No comments:
Post a Comment