22వ మహర్షి కాత్యాయన మహర్షి గురించి తెలుసుకుందాము.
🌿పూర్వం పుష్పదంతుడు అనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన ఎప్పుడు శివుణ్ణి సేవిస్తూ శివసేవకులలో మొదటివాడుగా ఉండేవాడు.
🌸కాని దేవి శాపంతో పుష్పదంతుడు బాధపడుతుంటే శివుడు దయతో “ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. నువ్వు భూలోకంలో ఒక బ్రాహ్మణుడికి కొడుకుగా పుట్టి శివభక్తి కలిగి మళ్ళీ నన్నే చేరుకుంటావు బాధపడకు" అన్నాడు.
🌿పుష్పదంతుడు శివుడితో నీ పాదాలు వదలకుండ భక్తితో ఉండ గలిగినప్పుడు ఎన్ని జన్మలెత్తినా నేను బాధపడను అన్నాడు.
🌸శాపకారణంగా పుష్పదంతుడు భూలోకంలో సోమదత్తుడు వసుదత్త అనే పేరు గల దంపతులకి కొడుకుగా పుట్టాడు.
🌿 చక్కటి కాంతితో వెలుగుతున్న అతణ్ణి కాత్యాయనుడని వరుచి అని పిలిచేవాళ్ళు.కాత్యాయనుడు పుట్టినప్పుడు ఆకాశవాణి ఇతడు శ్రుతధరుడు అనే పేరుతో వర్షుడికి శిష్యుడయి వ్యాకరణశాస్త్రాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడని చెప్పింది.
🌸మానవులు నా పిల్లలు చాలా గొప్ప వాళ్ళయిపోవాలి, నాకు చాలా డబ్బు వచ్చెయ్యాలి, అని ఏవేవో ఆశలు పెట్టుకుంటాడు. కాని భగవంతుడు ఏమి చెయ్య దల్చుకున్నాడో మనిషికి తెలియదు కదా !
🌿అలాగే కాత్యాయనుడు పుట్టిన అయిదు సంవత్సరాలకి సోమదత్తుడు చచ్చిపోయాడు. తల్లి వసుదత్త ఆ పిల్లవాణ్ణి పెంచుతోంది. కాని అతనికి ఉపనయనం చేసి ఏ గురువు దగ్గరైనా చదివించాలి కదా.... ఏంచెయ్యాలో తెలియక వసుదత్త బాధపడుతోంది.
🌸అదే కాలంలో వేతనము అనే ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ పేర్లు దేవస్వామి, కరంభుడు. వాళ్ళిద్దరికి ఇంద్రదత్తుడు, వ్యాడి అని ఇద్దరు పిల్లలుండేవారు.
🌿అంతలో కరంభుడు చచ్చిపోయాడు. అన్నగారయిన దేవస్వామి కరంభుడు పోవడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ములు ఇద్దరూపోయేసరికి వాళ్ళ భార్యలు కూడ సహగమనం చేశారు.
🌸చిన్నవాళ్ళు ఇంద్రదత్తుడు, వ్యాడి అనాథలయిపోయారు కదా... వాళ్ళకేమో గొప్ప పండితులవ్వాలని చాలా ఆశ. అందుకని కుమారస్వామిని గురించి తపస్సు చేశారు.
🌿 కుమారస్వామి ఆ పిల్లలిద్దరికి కనిపించి పాటలీపుత్రంలో వర్షుడు అనే గురువు దగ్గర మీరు విద్య నేర్చుకోండి, గొప్ప పండితులవుతారు అని చెప్పాడు.
🌸ఆ పిల్లలిద్దరు పాటలీపుత్రం వెళ్ళి వర్షపధ్యాయుడు ఎక్కడవున్నాడు అని అడిగారు. ఊరివాళ్ళు ఉపాధ్యాయుడి గురించి తెలియదు కాని, వర్షుడు అనే మూర్ఖుడు గురించి తెలుసు అన్నారు.
🌿 ఆయన మూర్ఖుడో, పండితుడో ఎందుకు గానీ ఆయన ఇల్లు ఎక్కడవుంది? అనడిగి వాళ్ళింటికి వెళ్ళారు పిల్లలు.
🌸ఒక చిన్న గుడిసెలాంటి ఇంట్లో వర్షుడు భార్యతో కలిసి వుంటున్నాడు. పిల్లలు అక్కడికి వెళ్ళి వర్షపధ్యాయులవారి ఇల్లు ఇదేనా ? అని అడిగారు. వర్షుడి భార్య బయటికి వచ్చి పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళింది.
🌿అమ్మా ! మేము వర్షుడి దగ్గర విద్య నేర్చుకుందుకు వచ్చాము. ఆయన్ని అందరూ మూర్ఖుడు అని ఎందుకంటున్నారు ? అని అడిగారు పిల్లలు.
🌸వర్షుడి భార్య తన భర్తని గురించి వాళ్ళని ఇలా చెప్పింది. వర్షుడు, ఉపవర్షుడు అన్నదమ్ములు. ఉపవర్షుడు గొప్ప పండితుడు. వర్షుడు మాత్రం ఏమీ తెలియనివాడు. మమ్మల్ని ఉపవర్షుడు చాలాకాలం పోషించాడు.
🌿 ఒకనాడు నేను నాభర్తని అవమానంగా మాట్లాడాను. దానికి ఆయన బాధపడి వెళ్ళిపోయి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేశాడు.
🌸ఆయనకి కుమారస్వామి కనిపించి శ్రుతధరుడు అనే శిష్యుడికి ఓంకారంతో ఎప్పుడయితే వేదం చెప్పడం మొదలుపెడతావో అప్పుడు నీకు సకల విద్యలూ వచ్చేస్తాయని చెప్పాడు.
🌿 అందుకే శ్రుతధరుడు అనే శిష్యుడికోసం చూస్తున్నాము. నాయనా ! మీరు కొంచెం అతన్ని తీసికొస్తే మీరు కూడ అతనితో పాటే విద్యనేర్చుకోవచ్చు అని చెప్పింది వర్షుడి భార్య.
🌸అప్పుడా పిల్లలు అమ్మా ! కుమారస్వామి చెప్పింది తప్పదు. మేమే శ్రుతధరుడు ఎక్కడ ఉన్న వెదికి తీసికొస్తామని చెప్పి ఆమెకి నమస్కారం చేసి బయలుదేరారు. వాళ్ళు తిరిగి, తిరిగి వసుదత్త ఇంటి అరుగు మీద కూర్చున్నారు.
🌿ఆ ఊరికి నందుడు అనేవాడు నాట్యం చెయ్యడానికి వచ్చాడు. వసుదత్త కొడుకుతో నాయనా ! నీ తండ్రి ఉన్నప్పుడు నందుడు చేసిన నాట్యం చూసి అతనిని మన యింటికి పిలచేవాళ్ళం.
🌸ఇప్పుడు నాకు ఆ నాట్యం చూసే యోగం లేదని బాధపడింది. కాత్యాయనుడు నేను వెళ్ళి నాట్యం చూసి అంతా నీకు చేసి చూపిస్తాను అని తల్లిని ఓదార్చాడు.
🌿ఇదంతా అరుగుమీద కూర్చున్న వాడి ఇంద్రదత్తులు విని కాత్యాయనుడితో కలిసి నాట్యం చూడ్డానికి వెళ్ళారు. వచ్చాక కాత్యాయనుడు చూసింది చూసినట్లు తల్లికి చేసి చూపించాడు.
🌸 అతనే శ్రుతధరుడు అని తెలుసుకుని వసుదత్తకి చెప్పి ముగ్గురు కలిసి వర్షడింటికి వచ్చారు. గురుపత్ని ఆనందంతో ఆ ముగ్గుర్ని గురువుగారికి నమస్కారం చెయ్యమని చెప్పింది.
🌿 వాళ్లు అలా చెయ్యగానే వర్షుడు వాళ్లగురించి అడిగి తెలుసుకుని ఒక మంచి రోజు చూసి కుమారస్వామికి నమస్కారం చేసి విద్యాబోధన మొదలుపెట్టాడు.
🌸ఓంకారంతో చెప్పడం మొదలుపెట్టగానే వర్షుడు గొప్ప పండితుడయ్యాడు.
🌿ఒకసారి చెప్పగానే కాత్యాయనుడు చెప్పేసేవాడు, అతడు ఏకసంతగ్రాహి. రెండుసార్లు చెప్పగానే వ్యాడి చెప్పేసేవాడు,
🌸అతడు ద్విసంతగ్రాహి. మూడుసార్లు చెప్పగానే ఇంద్రదత్తుడు చెప్పేసేవాడు, అతను త్రిసంతగ్రాహి. ఈ విధంగా వీళ్ళు ఒక సంవత్సరంలో మూడు వేదాలు నేర్చుకున్నారు.
🌿పాటలీపుత్రం మహారాజు, వర్షుడు అనే గురువుగార్ని గురించీ ఆయన ముగ్గురి శిష్యుల గురించీ విని, వాళ్ళని రాజ్యానికి తీసుకువెళ్ళి గురువుగారికి కనకాభిషేకం చేశాడు. వాళ్ళకి చక్కటి ఇల్లు ఇచ్చి ఆ మహారాజు కూడ వర్షుడికి శిష్యుడయిపోయాడు.
🌸గాంధార దేశంలో పాణి అనే పిల్లవాడొకడుండేవాడు. అతడు కూడ వర్షుడి దగ్గర శిష్యుడుగా చేరాడు. కానీ, అతనికి ఎంత చదివినా వచ్చేది కాదు.
🌿 తప్పులు చెప్తుంటే మిగిలినవాళ్ళు నవ్వేవాళ్ళు. గురువుగారి భార్య పాణిని పిలిచి బాధపడకు గురువుగారు కూడ నీలాగే ఉండేవారు.
🌸ఆయనలాగే నువ్వు కూడ కుమారస్వామిని గురించి తపస్సు చెయ్యి. నీకు అన్ని విద్యలూ వస్తాయని చెప్పింది.
🌿గురువుగారి భార్య చెప్పినట్లే తపస్సు చెయ్యడం మొదలు పెట్టాడు పాణి. గుహుడు ప్రత్యక్షమయి పంచాక్షరీ మంత్రం చెప్పి ప్రయాగ వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చెయ్యమన్నాడు.
🌸 శివుడు కరుణతో పాణికి వ్యాకరణ శాస్త్రాన్ని అనుగ్రహించాడు.
పాణి తిరిగివచ్చి కాత్యాయనుణ్ణి వాడి ఇంద్రదత్తుల్ని కూర్చోపెట్టి వ్యాకరణం గురించి చెప్పాడు.
🌿కాత్యాయనుడు పాణి వాదించుకున్నారు. ఇలా ఏడు రోజులు వాదించుకున్నాక పాణి ఓడిపోయాడు. ఏడుస్తూ కూర్చున్నాడు. మళ్ళీ శివుడు కనిపించి నీకేం ఫర్వాలేదు మళ్ళీ వాదించు అన్నాడు.
🌸 ఈ సారి కాత్యాయనుడు ఓడిపోయాడు.
ఒకరోజు పాణి గురువుగారికి శిష్యులకి వ్యాకరణం గురించి చెప్పాడు. శిష్యులు ముగ్గురూ వ్యాకరణంలో గొప్ప పండితులయ్యారు.
🌿పాణి గురువుగారి దగ్గర అనుమతి తీసుకొని వేరే చోట ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడ శిష్యులకి పాఠాలు చెప్పుకుంటూ ఉండిపోయాడు.
🌸కాత్యాయనుడు శివుడు గురించి తపస్సు చేశాడు. శివుడు కాత్యాయనుణ్ణి ఏంకావాలి? అని అడిగాడు.
🌿అతడు శబ్దశాస్త్రం కావాలి అన్నాడు. అలా శివుణ్ణి అడిగి
తీసుకున్న శబ్దశాస్త్రం సహాయంతో పాణి రాసిన వ్యాకరణశాస్త్రాన్ని వృద్ధి పరిచాడు కాత్యాయనుడు.
🌸దాంట్లో పాణి చెప్పనిదీ, చెప్పినదానికి ఇంకా చెప్పీ, ఇంకా చెప్పడానికి సాధ్యం కాకుండాను వ్యాకరణ శాస్త్రాన్ని రాశాడు.
🌿ఇదంతా తెలుసుకున్న పాణికి కాత్యాయన మహర్షి మీద కోపం వచ్చి అతని దగ్గరకి బయలుదేరి వెళ్ళాడు. కాత్యాయన మహర్షి పాణికి ఎదురుగా వెళ్ళి తీసుకుని వచ్చాడు.
🌸కాని పాణి అసూయతో నీతల ఈ రాత్రికే ముక్కలు ముక్కలుగా అయిపోతుందని శపించాడు.
కాత్యాయన మహర్షి నేను శివుడి ఆజ్ఞ తీసుకుని ఈ గ్రంథాన్ని రాశాను.
🌿అదే నిజమయితే నువ్వు నాకిచ్చిన శాపం నీక్కూడ జరుగుతుంది అన్నాడు. చివరికి ఇద్దరూ ప్రాణాలు వదిలి శివలోకం చేరుకున్నారు.
🌸శివుడు దేవి శాపం వలన పుష్పదంతుడు అనే శివసేవకుడు కాత్యాయనుడగా పుట్టాడనీ, అతని శాపం పోగొట్టడానికే తన తేజస్సుతో పాణిని పంపంచాననీ ఇద్దర్నీ తనదగ్గరే ఉంచుకున్నాడు శివుడు.
🌿ఈ విధంగా శాపం వల్ల కలిగిన మానవ రూపం వదిలేసి మళ్ళీ శివసేవకుల్లో కలిసిపోయాడు ఇది"కాత్యాయన మహర్షి" కధ!!
🌸ఈయన వ్యాకరణశాస్త్రం, కాత్యాయన స్మృతి, బుధకవచ స్తోత్రం మొదలయిన గ్రంథాలు రాశారు.
🌿ఈ కధవల్ల మీకు ఏం తెలిసింది ? అంత గొప్ప తపస్సంపన్నులు, పండితులు అయి కూడ ఈర్ష్యవల్ల ఒకళ్ళని ఒకళ్ళు శపించుకుని మరణించారు.
🌸అందుకే మనిషికి అసూయ అనేది ఉండకూడదు. అది ఎంత గొప్పవాణ్ణయినా పతనం చేస్తుంది.

No comments:
Post a Comment