మన మహర్షుల చరిత్ర..
23వ కాశ్యప మహర్షి గురించి తెలుసుకుందాం
🌿కాశ్యపుడు కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టాడు. కాశ్యపుడు ధర్మం, దయ, తేజస్సు అన్నీ ఉన్నవాడు. ఇంకా భూతదయ ఎక్కువ.
🌸 ఆ కాలంలో పాముల బాధ ఎక్కువగా వుండేది. విషంతో భూప్రపంచాన్నే గడగడలాడించేవి. కాశ్యపుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేసి ఈ పాముల బాధనుండి సకలజీవులను రక్షించమని అడిగాడు.
🌿బ్రహ్మ కాశ్యపుడికి 'జీవసంజీవని' మంత్రాన్ని ఉపదేశించాడు.
అప్పటినుండి కాశ్యపుడు అన్నిరకాల జీవుల్ని రోగాల్నుంచి, విససర్పాల్నుంచి రక్షిస్తున్నాడు.
🌸దయగల మనసున్న వాళ్ళకి ప్రపంచమంతా తమ కుటుంబమే అనిపిస్తుంది. లోకాలకి మేలు చేస్తూ కూడా కాశ్యపుడు తపస్సుని వదలకుండా బ్రహ్మర్షి అయ్యాడు.
🌿పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము వలన చనిపోతాడని ఆరోజే చివరి రోజని రాజుని బ్రతికించాలని బయలుదేరాడు.
🌸దార్లో తక్షకుడు కన్పించి నువ్వు ఎవరినైనా బ్రతికించవచ్చునేమో గాని, నేను కరిచాక అతన్ని నువ్వు బ్రతికించలేవు అన్నాడు. కావాలంటే నేను ఈ మర్రి చెట్టుని కరుస్తాను,
🌿అధనో కాదో పరీక్షించుకో అన్నాడు తక్షకుడు, కాశ్యపుడు సరే కానివ్వు అదీ చూద్దాం అన్నాడు. !
🌸తక్షకుడు చెట్టుని కరిచాడు. అది కాలిపోయి బూడిదయింది. కాశ్యపుడు ఆ బూడిదని
🌿మళ్ళీ చెట్టుగా చేశాడు. తక్షకుడు చెట్టుని బ్రతికించావేమో గాని పరీక్షిత్తు మహారాజుని బ్రతికించలేవు అన్నారు. కాశ్యపుడు దివ్యదృష్టితో చూశాడు. ఆరోజుతో ఆయుష్షు అయిపోయిందని
🌸 అది బ్రహర్షి శృంగి శాపమని తెలుసుకొని తక్షకుడి దగ్గర ధనం తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు.
🌿 ఒకసారి ఒక సిద్ధుడు బ్రహ్మతేజను
వేరే సిద్ధులతో కలిసి ఒక అంతర్ధానమై ఒకసారీ కనపడుతూ ఉంటే ఆయన దగ్గరకి వెళ్ళి మీరెవరని అడిగాడు కాశ్యపుడు.
🌸ఆ సిద్ధుడు నేను పుణ్యకార్యాలు చేసి ఎన్నో సుఖాలు అనుభవించాను కానీ కామక్రోథాలు నన్ను విడిచిపెట్టకపోవటం వలన మళ్ళీ చాలా మంది తల్లులకి పుట్టాను,
🌿 చాలా మంది భార్యలతో కలిసి బ్రతికాను, పిల్లలు, మిత్రులు బార్యల వియోగాన్ని అనుభవించాను. ఇంక ఈ లోకాన్ని చూడ్డం నాకు ఇష్టం లేదు. బ్రహ్మానందం కోసం తిరుగుతున్నాను అన్నాడు.
🌸కాశ్యపుడు సిద్ధుణ్ణి పరతత్త్వం గురించి చెప్పమని ప్రార్ధించాడు. సిద్ధుడు "కుమారా! అంతా చెప్తాను విను. ధర్మకార్యాలు చేయాలంటే శరీరం కావాలి,
🌿అందుకే శరీరాన్ని అశ్రద్ధ చేయ్యకుండా రక్షించుకోవాలి. అదెలాగ ? అంటావేమో. ఇష్టమైన ఆహారాన్ని కొంచెంగా తినాలి.
🌸ఏది దొరికితే అది తినడం, ఒకేరోజు చాలా సార్లు భోజనం చేయటం, ఒకరోజు ఉపవాసం చేయడం, పగలు నిద్రపోవడం చేయకూడదు.
🌿రోగాలతో చచ్చిన మనిషి కర్మఫలం అనుభవించడానికి మళ్ళీ పుడతాడు. మళ్ళీ కర్మలు చేస్తాడు. మళ్ళీ చస్తాడు. పాపం చేసిన జీవుడు నరకము, పుణ్యం చేసిన జీవుడు స్వర్గము అనుభవిస్తాడు.
🌸 కానీ ఈ రెండింటికి అతీతమైన మోక్షాన్ని పొందలేడు. పుణ్యఫలం అయిపోగానే తిరిగి భూమిమీద పుడతాడు. ముక్తి పొందేవరకు జీవుడు ఇలా చస్తూ పుడుతూ ఉంటాడు.
🌿ముక్తి ఎలా సంపాదించాలో చెప్తాను విను. దానము, శమము, దమము, బ్రహ్మచర్యం, పరుల ధనాన్ని, పరుల భార్యల్ని ఆశించకపోవడం,
🌸తల్లిదండ్రుల్ని గురువుల్ని పూజించడం, పితృదేవతల్ని అర్చించడం, ఇంద్రియ నిగ్రహం ఇలాంటివి కలిగి ఉంటే ముక్తిని పొందవచ్చు. లోకమంతా భగవంతుడే ఉన్నాడన్నది గ్రహించాలి.
🌿పుణ్యాత్ముడు తనను తాను తెలుసుకుని, సుఖం క్షణికమని అన్ని పదార్థాలు నశించేవే అని తెలుసుకోవాలి.
🌸జన్మ మృత్యు జరావ్యాధులన్ని ప్రకృతి ధర్మాలని అవి కలిగినప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుని మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని బాధల్ని వదిలివేయాలి.
🌿“యోగి అయిన వాడు ఇంద్రపదవిని కూడా వదిలివేస్తాడు” అని చెప్పాడు సిద్ధుడు. అంతా విని మహాత్మా ! మోక్షాన్ని పొందే ఉపాయాన్ని చెప్పమన్నాడు కాశ్యపుడు.
🌸 “నాయనా ! దంతములు, జిహ్వ, కుత్తుక, తాలువు, కంఠనాళము, హృదయము వీటిలో మనసు ఎక్కడ ఆగుతుందో అక్కడే ఉంచితే మనస్సు ఆత్మని వెతుకుతుంది.
🌿ఆత్మ పంచేద్రియాలకి కనపడదు. ఒక్క మనస్సే దాన్ని చూడగలదు. ఇదే బ్రహ్మవిద్యా రహస్యం", అని చెప్పి సిద్ధుడు అంతర్ధానమయ్యాడు.
🌸'కాశ్యపస్మృతి' అనే గ్రంథంలో ఆహితాగ్ని లక్షణం, ఆవు మొదలైన జంతువుల్ని చంపితే ఏపాపం వస్తుందో, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో,
🌿పంచ మహాపాతకాలు, వాటి ప్రాయశ్చిత్తాలు ఏమిటో మొదలైనవాటి గురించి చెప్పబడి ఉన్నాయి.
🌸కాశ్యప మహర్షి కథ వల్ల మనకి ధర్మకార్యాలే చేయాలనీ, దయకలిగి ఉండాలనీ, చెడు చేస్తే మళ్ళీ దాన్ని మనం అనుభవించక తప్పదనీ,
🌿మనం చేసే పనులను బట్టే తర్వాత జన్మలో మన పుట్టుక కూడ ఉంటుందనీ తెలుసుకున్నాము ఇదండీ కాశ్యప మహర్షి చరిత్ర..
🌸రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి
No comments:
Post a Comment