మన మహర్షుల చరిత్ర..
24వ కృత్సమద మహర్షి గురించి తెలుసుకుందాం
🌿 కృత్సమద మహర్షి శౌనక మహర్షి వంశంలో సునహోత్ర మహర్షికి పుట్టాడు .
🌸ఈయనకి ఇద్దరు అన్నలున్నారు . వాళ్ళ పేర్లు కాశుడు , శాల్ముడు . సునహోత్రుడి కొడుకు కనక
🌿ఈయన్ని సౌనహోత్రుడని కూడ పిలుస్తారు .
బ్రహ్మచారి విప్రర్షి శ్రీమంతుడు అని కూడ పేరుపొందాడు .
🌸కృత్సమద మహర్షి వేదవేదాంగాలు నేర్చుకుని అగ్ని దేవుణ్ణి వేదమంత్రాలతో స్తోత్రం చేశాడు . అగ్నిదేవుడికి ఇష్టమైన యజ్ఞం చేశాడు .
🌿 సహృదయుడు , అనుపమ భక్తుడు అయిన కృత్సమద మహర్షి చేసిన యజ్ఞానికి అగ్ని ఆనందంతో మహర్షికి దివ్యశరీరం ఇచ్చాడు .
🌸అంటే ఏమిటో తెలుసా ? త్రిలోకాల్లో తిరగగల శక్తి , భూమిపైన ఆకాశంలోను గాలిలోను మూడు చోట్ల మూడు శరీరాలు ధరించి తిరగ్గలిగే శక్తినిచ్చాడు .
🌿ఇంద్రుడికి ధుని , చుమురి అనే రాక్షసులు శత్రువులు . వాళ్ళు స్వర్గంలో రహస్యంగా తిరుగుతూ ఇంద్రుణ్ణి ఎలా చంపాలా అనే ప్రయత్నంలో ఉన్నారు .
🌸ఇంద్రుడితో సమానమైన తేజస్సున్న కృత్సమద మహర్షిని చూసి ఆ రాక్షసులిద్దరూ ఇంద్రుడనుకుని చంపబోయారు .
🌿వేదమంత్రాలతో ఇంద్రుడి గుణగణాలు చెప్పడం మొదలు పెట్టాడు కృత్సమదుడు . అవి విన్న రాక్షసులకి ఇంద్రుడంటే భయం పట్టుకుంది .
🌸అదే సమయంలో ఇంద్రుడు వచ్చి వాళ్ళని చంపేశాడు . మునీంద్రా ! నువ్వు నాకు చక్కటి ప్రియమిత్రుడివి . నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు ఇంద్రుడు .
🌿మహేంద్రా ! నీ కటాక్షం వల్ల నాకు సర్వైశ్వర్యాలు కలిగి , నామనస్సులో ఎప్పుడూ నువ్వు స్థిరంగా నిలచి జన్మజన్మలకి
🌸నీ పాదములందు భక్తి ఉండేటట్లు అనుగ్రహించమని చెప్పి ఇంద్రుణ్ణి తన ఇంటికి తీసుకువెళ్ళాడు .
🌿 వేదమంత్రాలతో స్తోత్రం చేశాడు కృత్సమదుడు . అదే సమయానికి ఇంద్రుడి గురువు బృహస్పతి అక్కడికి వచ్చాడు .
🌸మహర్షి ఇద్దరినీ వేరువేరుగాను , ఇద్దరినీ కలిపి వేదమంత్రాలతో స్తుతించాడు .
🌿ఇంద్రుడు , బృహస్పతి చాలా ఆనందపడి నీకంటే మేథావి ఇంకెవరున్నారు ! అని అభినందించారు .
🌸ఒకసారి ఇంద్రుడు కృత్సమద మహర్షిని పరీక్షించడానికి పక్షిరూపంలో వచ్చి అతని భుజం మీద వాలాడు .
🌿 కృత్యమదుడు దివ్యదృష్టితో ఆ పక్షి ఇంద్రుడేనని తెలుసుకుని పక్షీంద్రుడుగా స్తుతించాడు .
🌸 ఇంద్రుడు నిజరూపంలో కనిపించి మిత్రమా ! నువ్వు నిజంగా నాకు మిత్రుడవే . నువ్వు నాదగ్గరకి ఎప్పుడేనా రావచ్చు పోవచ్చు అని చెప్పాడు .
🌿ఇంద్రుడు సహస్రవర్ష సత్రయాగం ప్రారంభించి బృహస్పతిని యాగం చేయించడానికీ ఆయనకి సహాయంగా కృత్సమద మహర్షిని ఉండమన్నాడు .
🌸 కృత్సమద మహర్షికి అంత గౌరవప్రదమైన స్థానం దొరకడం చూసి అసూయ కలిగింది వరిష్ఠ మహర్షికి .
🌿 చక్కటి ఉచ్చారణతో సామవేదం పఠిస్తూ యజ్ఞం చేయిస్తున్న కృత్సమదనుణ్ణి .
🌸 వరిష్ఠుడు ఇంద్రుడు చేస్తున్న యజ్ఞానికి అపశృతులతో సామవేదాన్ని ఉచ్చరిస్తున్నావే పాపం వస్తుందని తెలియదా ? ఏదీ మళ్ళీ చెప్పు అన్నాడు .
🌿 అపస్వరాలు పలికితే పాపం నాదే అవుతుంది కదా ... అయినా నేను సరిగానే చెప్తున్నాను అన్నాడు కృత్సమద మహర్షి . మళ్ళీ చెప్పమంటే చెప్పలేదు కాబట్టి
🌸నువ్వు నీకు వచ్చిన విద్యలన్నీ పోయి తిండి నీళ్ళు దొరకకుండ అడవిలో క్రూరజంతువైపోతావు అని శపించాడు వరిష్ఠుడు .
🌿అదే అడవిలో వేలవేల సంవత్సరాలు అలాగే బ్రతుకుతావని కూడ వరిష్టుడు కృత్సమద మహర్షిని శపించాడు .
🌸 కృత్సమదుడు వెంటనే క్రూరజంతువుగా మారిపోయి ఎదురుగా ఉన్న ఈశ్వరుడి పాదాలమీద పడిపోయాడు .
🌿 నువ్వు చదివిన సామవేదం తప్పులు లేవని కృత్సమద మహర్షిని మూమూలుగా మార్చి
🌸నీకు రోగం మరణం లేకుండా అన్ని దుఃఖాలకి దూరంగా శాశ్వతంగా ఉంటావని వరమిచ్చానన్నాడు ఈశ్వరుడు .
🌿 వరిష్ఠుడ్ని పిలిచి కృత్సమదనుడికి క్షమాపణ చెప్పమన్నాడు . దేవతలు మహర్షి మీద పూలవాన కురిపించారు . ఇంద్రుడు అభినందించాడు .
🌸వరిష్టుడు సిగ్గుపడి ఇకనుంచి స్నేహంగా ఉంటానన్నాడు . కృత్సమద మహర్షి విఘ్నేశ్వర భక్తుడు .
🌿 మానసికపూజ , బాహ్యపూజ చేసి భక్తులందరిలో మొదటివాడయ్యాడు .
మహాయోగి , సంతతభక్తి సమన్వితుడు అయిన కృత్సమదుడు రోజుకి మూడుసార్లు విఘ్నేశ్వర పూజ చేసి తరించాడు .
🌸ఇదండి కృత్సమద మహర్షి చరిత్ర
No comments:
Post a Comment