Adsense

Thursday, October 27, 2022

25వ మహర్షి.. కండు మహర్షి

మన మహర్షుల చరిత్ర..
25వ కండు మహర్షి గురించి తెలుసుకుందాం


🌿కండుముని చిన్నప్పటి నుంచి గౌతమీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.

🌸 ఆయన ఆశ్రమం పూల చెట్లతో, మంచి మంచి రుచిగల పండ్లతో చక్కటి లతలతో ఎప్పుడూ వసంతమాసంలా ఉండేది. అక్కడ జంతువులన్నీ ఒకదానితో ఒకటి స్నేహంగా ఉండేవి.

🌿కండు మహర్షి తపస్సు చాలా కఠినంగా ఉండేది. ఆయన వేసవికాలంలో నిప్పుల మధ్య కూర్చుని, శీతాకాలంలో చల్లటి నీళ్ళల్లో కూర్చుని తపస్సు చేశాడు. 

🌸ఆయన తపస్సుకి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు అందరూ ఆశ్చర్యపోయారు.

🌿ఈయన తపస్సు గురించి విని ఇంత ధైర్యం, ఇంత నిష్ఠ, ఇంత నియమం ఎక్కడా, ఎప్పుడూ చూడలేదని మూడు లోకాల్లోనూ చెప్పుకునేవారు.

🌸తన స్థానం ఎవరు తీసేసుకుంటారోనని ఇంద్రుడికి ఎప్పుడూ భయమే కదా!

🌿 కండు మహర్షి తపస్సుకి భయపడి ప్లమోచన అనే పేరుగల అప్సరస ను వెళ్ళి కండు మహర్షి తపస్సుని భగ్నం చెయ్యమన్నాడు ఇంద్రుడు.

🌸ఆయన చెప్పినట్లు చెయ్యకపోతే శపిస్తాడని భయం కదా..! అక్కడికీ ప్లమోచన నాకన్న బాగా ఆడిపాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లని పంపించండి అంది.

🌿ఇంద్రుడు నువ్వే వెళ్ళు నీకు తోడుగా కామం, వసంతం
 చక్కటి చల్లగాలుల్ని పంపిస్తాను పని పూర్తిచేసుకుని రా! అని చెప్పాడు.

🌸 ఇంకేం చేస్తుంది ప్లమోచన బయలుదేరి భూలోకానికి వచ్చింది ప్లమోచన ఆశ్రమంలో అడుగుపెట్టగానే వసంతం వచ్చేసింది.

🌿చెట్లన్నీ పువ్వులతో
నిండిపోయి కిందపడి నేలంతా పూలు పేర్చినట్లయ్యింది. మన్మథుడు కండు మహర్షి మీద బాణం వేశాడు. 

🌸కండు మహర్షి కళ్ళు తెరిచి చూశాడు.
ఇంకేముంది తపస్సు మానేసి మాయలో పడిపోయాడు.

🌿కండు మహర్షి ప్లమోచనతో వందసంవత్సరాలు కలిసి ఉన్నాడు. చాలాసార్లు ప్లమోచన నేను దేవలోకం నుంచి వచ్చాను.

🌸నన్ను పంపించెయ్యండి అని చెప్పింది. కాని కండు మహర్షి వినలేదు. కొంతకాలం పోయాక కండు మహర్షి యోగదృభష్టితో చూసి ఫ్లమోచనని నా తపస్సు నాశనం చేశావు,

🌿అయినా, నీ తప్పులేదు, నువ్వు ఇంద్రుడు పంపితే వచ్చావు కాబట్టి శపించకుండా వదిలేస్తున్నాను. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో..అన్నాడు

🌸కండు మహర్షి ప్రమోచనలకి కలిగిన పుత్రిక పేరు మారిష, ప్రచేతసుడు మారిషని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టినవాడు దక్షప్రజాపతి.

🌿కండు మహర్షి ఇంద్రుడి మోసం తెలుసుకుని అక్కడి నుంచి పురుషోత్తమ క్షేత్రం వెళ్ళి అక్కడ మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు.

🌸 ఇంతకుముందు కంటే కఠినమైన తపస్సు చేశాడు.
శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై కండు మహర్షిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు..

🌿 కండు మహర్షి విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్తోత్రం చేసి స్వామీ! ఈ సంసార సాగరం నుంచి తప్పించి పరమపదాన్ని చేరుకునేలా చెయ్యమని అడిగాడు.

🌸 విష్ణుమూర్తి వరమిచ్చి అంతర్జానమయ్యాడు
కండు మహర్షికి 'కంథు మహర్షి' అని పేరు కూడా ఉంది. 

🌿మంచి తపస్సంపన్నుడయినా మధ్యలో మాయలో పడి మళ్ళీ తన తప్పు తెలుసుకుని

🌸 పశ్చాత్తాపంతో మహా ఉగ్రమైన తపస్సు చేసి శ్రీహరి చరణాల దగ్గరికి చేరుకుని దివ్యపదవిని
పొందాడు. 

🌿అంటే ఏమిటన్నమాట... తెలియక తప్పు చేసినా తెలిశాక పశ్చాత్తాపపడి, అయ్యో తప్పుచేశానే అని బాధపడి,

🌸ఆ తప్పుని సరిదిద్దుకుని ఇంకెప్పుడూ తప్పులు చెయ్యకుండా అభివృద్ధిలోకి వెళ్ళడం చాలా గొప్పతనం..... 

🌿శ్రీ రాముడు యుద్ధానంతరం అయోధ్యకు వచ్చాక ...
శ్రీ రామ దర్శనము చేసిన ఋషులలో

🌸 అగస్త్య, వాల్మీకి ఋషులుతో పాటు .. ఈ కండు మహర్షి దక్షిణము నుంచి వచ్చాడని ఉత్తర రామాయణము చెబుతుంది

🌿ఇదండీ కండు మహర్షి విశేషాలు.

No comments: