మన మహర్షుల చరిత్ర...
31వ జమదగ్ని మహర్షి గురించి తెలుసుకుందాం
🌿పూర్వం బుచీక మహర్షి గాధి రాజు కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు .
🌸గాధిరాజు ఋచీక మహర్షి తన కూతురికి తగిన వాడో కాదో పరీక్షించాలని వెయ్యి గుర్రాలని తెచ్చి ఇచ్చి తన కూతుర్ని పెళ్ళి చేసుకోమన్నాడు .
🌿వెయ్యి గుర్రాలని తెచ్చి ఇచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకున్నాడు ఋచీక మహర్షి ఒకసారి సత్యవతి తనకి ఒక కొడుకునీ , తల్లిదండ్రులకి ఒక కొడుకునీ , అనుగ్రహించమని ఋచీక మహర్సిని అడిగింది .
🌸రాజు బ్రహ్మ మంత్రాలతో రెండు కుండలు తెచ్చి మొదటి కుండలోనున్న దాన్ని ఉపయోగించిన వాళ్ళకి ఉత్తముడైన రాజు , రెండవ కుండలోనున్న దాన్ని ఉపయోగిస్తే తపస్సంపన్నుడయిన బ్రాహ్మణుడు పుడతాడు .
🌿మొదటి కుండని నీ తల్లికిచ్చి , రెండవ కుండలోవున్నది నువ్వు తిను అని చెప్పాడు ఋచీకుడు .
కాని తల్లి మాటలు విని సత్యవతి , మొదటిది తాను తీసుకుని రెండవ కుండను తల్లికిచ్చింది .
🌸సత్యవతికి జమదగ్ని , ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుట్టారు .
ఇల్లా పుట్టిన జమదగ్ని రేణుకని పెళ్ళి చేసుకున్నాడు . అతడు తపోమహత్యంతో ఒక కామధేనువుని సంపాదించాడు .
🌿ఈ కామధేనువు వల్ల ఏం కావాలంటే అది వచ్చేస్తుంది . జమదగ్ని రేణుక అన్ని భోగాలు అనుభవిస్తున్నారు . ఒక రోజు జమదగ్ని భార్య రేణుకతో కలిసి నర్మదానదీ తీరంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాడు .
🌸వాళ్ళని చూసిన సూర్యుడు జమదగ్నిని నువ్వు బ్రాహ్మణుడివి , వేదకర్తవి అన్ని తెలిసిన నువ్వు పట్టపగలు ఇలాంటి పని చెయ్యొచ్చునా అని అడిగాడు .
🌿జమదగ్ని సూర్యుడితో ఓయీ ! నువ్వు నాకు చెప్తున్నావా ... నేను భృగుమహర్షి శిష్యుణ్ణి . ధర్మాధర్మాలు తెలియని వాణ్ణి కాదు . నువ్వే కాదు బ్రహ్మరుద్రయమాదులు కూడ నన్ను శిక్షించలేరు .
🌸నువ్వు మా కార్యాన్ని భంగం చేశావు కనుక నా శాపంతో రాహువుతో మింగబడి తేజస్సు లేకుండా పోతావని సూర్యుణ్ణి శపించాడు జమదగ్ని .
🌿అది విని సూర్యుడు మనం ఇద్దరం సమానమే . నువ్వు శపించి నేను శపించకపోతే ప్రజలు నాకు చాతకాదనుకుంటారు .
🌸నీకు క్షత్రియుడితో అవమానం , మరణం కూడ కలుగుతుంది అని ప్రతి శాపం ఇచ్చాడు జమదగ్నికి సూర్యుడు ఇలా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు శపించేసుకుంటుంటే
🌿కశ్యపుడి వల్ల విషయం తెలిసిన బ్రహ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరిని శాంతపరిచి ఇద్దరికీ వాళ్ళ శాపాలే వాళ్ళకి మంచి జరిగేలా ఆశీర్వదించి వెళ్ళాడు .
🌸తర్వాత రేణుకకి అయిదుగురు కొడుకులు పుట్టారు . అందులో ఆఖరివాడు పరశురాముడు . రేణుకాదేవి నీళ్ళు తెచ్చుకునేందుకు నదికి వెళ్ళి చిత్రధరుడనే రాజు భార్యతో కలిసి స్నానం చేస్తుండగా ఆనందంగా చూసింది .
🌿ఆ సమయంలో ఆమె చేతిలో వున్న కుండ క్రిందపడి పగిలింది . ఎప్పుడైనా కుండ పగిలితే ఇసుక తీసి అనుకోగానే కుండ వచ్చేసేది .
🌸కాని పరపురుషుణ్ణి చూడ్డం వల్ల పాతివ్రత్య భంగం కలిగి కుండరాలేదు . కుండలేకుండా వస్తున్న రేణుకని చూసి జమదగ్ని జరిగింది తెలుసుకుని పిల్లల్ని పిలిచి తల్లిని చంపేయమన్నాడు .
🌿పరశురాముడు గొడ్డలి తీసుకువచ్చి వెంటనే నరికేశాడు . తండ్రి అతణ్ణి మెచ్చుకుని ఏం కావాలో అడగమనగానే తల్లిని బ్రతికించమన్నాడు పరశురాముడు .
🌸పూర్వం హైహయ వంశం వాడయినా కార్తవీర్యార్జనుడు దత్తాత్రేయుడితో వరం పొందాడు . ఒకసారి వేటకి వచ్చి విశ్రాంతి కోసం జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు .
🌿జమదగ్ని అలిసిపోయిన రాజుకి , సైన్యానికి తమ కామధేనువు సహకారంతో భోజనాలు పెట్టాడు .
ఆ ఆవుని ఎలాగయినా తీసికెళ్ళాలని ఇరవై ఒక్కసార్లు జమదగ్నితో యుద్ధం చేశాడు కార్తవీర్యార్జునుడు .
🌸చివరకి జమదగ్నిని చంపి కామధేనువు కోసం వెతికాడు . అది ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది . భృగు మహర్షి వచ్చి జమదగ్నిని బ్రతికించాడు .
🌿తర్వాత పరశురాముడు వచ్చి జరిగింది విని యుద్ధం చేసి కార్తవీర్యార్జునుడిని చంపి ఆశ్రమానికి వచ్చి తండ్రికి చెప్పాడు .
🌸జమదగ్ని పరశురాముడితో రాజెంత దుష్టుడయినా చంపడం పాపమని తీర్థయాత్రలు చెయ్యమని చెప్పాడు . విష్ణు స్వరూపుడయినా , కార్తవీర్యుడు తనకి విరోధి అయినా ధర్మానికి కట్టుబడి కొడుకుని కూడ శిక్షించాడు మహర్షి .
🌿జమదగ్ని మహర్షి పితృకార్యం చేస్తూ ఆవుపాలు పిండి ఒకచోట పెట్టాడు . కోపదేవత మహర్షికి శాంతం ఎక్కువ కదా పరీక్షిద్దామని పాలు క్రిందపడిపోయేలా చేసింది .
🌸జమదగ్ని శాంతంగానే ఉన్నాడు . కోపదేవత భృగువంశం వాళ్ళు కోపిష్ఠులని విన్నాను అందుకే నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను , క్షమించమని జమదగ్నిని అడిగి వెళ్ళిపోయింది .
🌿కానీ , పితృదేవతలు జమదగ్నిని నువ్వు మా కోసం పెట్టిన పాలు పారబోస్తే ఊరుకున్నావు కాబట్టి ముంగివై పుట్టమని శపించారు .
🌸జమదగ్ని తెలియక చేశాను క్షమించమన్నాడు . ధర్మరాజు అశ్వమేధ యాగం చేసినప్పుడు నీకు శాపవిమోచనం అవుతుందని చెప్పారు .
🌿ఈ విధంగా జమదగ్ని జన్మ రాహిత్యం పొందాడు . అంటే ఇంక జన్మలే రావన్న మాట .
🌸ఇంకా చాలా విషయాలు ఉన్న ముఖ్యమైన జమదగ్ని విషయాలు తెలుసుకుంన్నాము రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి.
No comments:
Post a Comment