37 వ దధీచి మహర్షి గురించి తెలుసుకుందాం
🌿దధీచి మహర్షి కూడా చాలా గొప్ప ఋషి . దధీచి మహర్షి తల్లిదండ్రులు ఎవరో తెలుసా ? తండ్రి , చ్యవన మహర్షి తల్లి సుకన్య .
🌸దధీచి చిన్నతనం నుంచీ సరస్వతీ నది దగ్గర ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు .
🌿 దధీచికి తపశ్శక్తి వల్ల వచ్చిన తేజస్సు చూసి సరస్వతి ఆనందపడుతుండేది . కానీ , అతడి తపస్సుకి భయపడి ఇంద్రుడు
🌸 విఘ్నం చెయ్యడానికి పంపించిన అలంబుస అనే అప్సరస దధీచి మహర్షి తపస్సుని భగ్నం చేసింది .
🌿 వాళ్ళకి పుట్టిన వాడు సారస్వతుడు . సరస్వతి సారస్వతుణ్ణి పెంచింది . సారస్వతుడు కూడ దధీచి అంతటి తపస్సంపన్నుడై కరువు రోజుల్లో ఋషులందరికీ భోజనం పెడుతుండేవాడు .
🌸ఒకనాడు ఇంద్రుడు దధీచిని నువ్వు చాలా గొప్పవాడివి . నీకు ఉత్తమమైన శాస్త్రాలు చెప్తానని చెప్పి శాస్త్రాలన్నీ దధీచికి చెప్పాడు .
🌿ఇవి ఎవరికైనా చెప్తే నీ తల నరికేస్తానని కూడ చెప్పాడు . ఇది తెలుసుకుని అశ్వినీ దేవతలు దధీచిని కలిసి ఇంద్రుడు చెప్పిన శాస్త్రాలు వాళ్ళకి చెప్పమని అడిగారు .
🌸 చెప్తే ఇంద్రుడు తలనరికేస్తానన్నాడు కదా అన్నాడు దధీచి . నీకు ఏమీ కాకుండా మేం చేస్తామని చెప్పి అశ్వినీ దేవతలు మొదట దధీచి తల తీసి వేరే చోట దాచి అతడికి గుఱ్ఱం తల అతికి శాస్త్రాలు నేర్చుకున్నారు .
🌿 ఇంద్రుడు వచ్చి దధీచి తల నరికేశాడు . అశ్వినీ దేవతలు వాళ్ళు దాచిన దధీచి తల మళ్ళీ అతికించారు . దధీచి బ్రతికిపోయాడు . ఆలోచన బావుంది కదూ !
🌸దధీచి ఒకనాడు తన బాల్య స్నేహితుడైన క్షువుడనే రాజుని చూడ్డానికి వెళ్ళాడు . క్షువుడు దధీచిని గౌరవంగా తీసుకెళ్ళాడు .
🌿ఇద్దరు మాట్లాడుకుంటూ వుండగా బ్రాహ్మణుడు గొప్పవాడని దధీచి , కాదు క్షత్రియుడే గొప్పవాడని క్షువుడు వాదనలోకి దిగారు .
🌸వాదన పెరిగి ధధీచికి కోపం వచ్చి క్షువుణ్ణి పొడిచాడు . క్షువుడు దధీచిని ముక్కలు ముక్కలుగా నరికేశాడు .
🌿 శుక్రాచార్యుడు వచ్చి ఆ ముక్కల్ని కలిపి దధీచిని బ్రతికించి శివుణ్ణి గురించి తపస్సు చెయ్యమని చెప్పి వెళ్ళిపోయాడు .
🌸 ధధీచి శివుణ్ణి గురించి ఘోరతపస్సు చేశాడు . మూడు లోకాలు దధీచి తపస్సుకి భయపడిపోతుంటే ,
🌿శివుడు ప్రత్యక్షమై దధీచికి ఎప్పుడు కావాలంటే అప్పుడే మరణించగలిగే శక్తి , వజ్రంతో సమానమయిన శరీరం , ముల్లోకాల్ని జయించగల శక్తిని ఇచ్చాడు .
🌸 ఇన్ని వరాలొచ్చినా దధీచి క్షువుడు చేసిన అవమానం మర్చిపోలేక అతనింటికి వెళ్ళి ఒక తన్ను తన్ని నువ్వు కాదు నీ విష్ణువు కూడ నన్నేం చేయలేడని చెప్పి వచ్చేశాడు .
🌿క్షువుడు విష్ణువు గురించి తపస్సు చేసి తనకి జరిగిన అవమానం చెప్పాడు . విష్ణువు దధీచిని తప్పించి నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు , అతడు క్షమాపణ అడగడం గొప్ప తపశ్శాలి అని చెప్పాడు . క్షువుడు దధీచిని క్షమించమని అడిగాడు .
🌸బ్రాహ్మణుల కోపం నీటి మీద రాసిన గీతల్లా ఎక్కువకాలం ఉండవు కదా ! అలాగే ఇద్దరు స్నేహితులు మళ్ళీ కలిసిపోయారు .
🌿దధీచి ధర్మరక్షణ కోసం ఒక ఆశ్రమంలో శిష్యులకి విద్యాభ్యాసం మొదలు పెడితే ఆ శిష్యులు వారి శిష్యులు ఇలా .. కోటాను కోట్ల ఋషులైపోయారు .
🌸 దధీచి ' సువర్చ ' అనే పేరుకల అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు . ఇలా ఉండగా ఒకసారి దక్షప్రజాపతి యజ్ఞం చెయ్యాలని అనుకుని దధీచిని శిష్యులతో కలిసి రమ్మని పిలిచాడు .
🌿 దధీచి శిష్యుల్ని తీసుకుని వెళ్ళాడు . దక్షప్రజాపతి శివుణ్ణి , శివభక్తుల్ని పిలవలేదు . దధీచికూడ తనకి భయపడి వచ్చాడనుకుని మహర్షీ !
🌸 నేను శివుణ్ణి , శివభక్తుల్ని పిలవలేదు . నీకు ఇష్టమైతే ఉండు . కష్టమైతే వెళ్ళిపో అన్నాడు దక్షుడు .
🌿దధీచి తోక తొక్కిన పాములా లేచి దక్షప్రజాపతిని నీకీ దుర్భుద్ధి ఎలా పుట్టింది ? దేవాదిదేవుడైన శివుడు లేకుండా యజ్ఞం ఎలా చేస్తావు ?
🌸 అని శివుణ్ణి స్తోత్రం చెయ్యడం మొదలు పెట్టాడు . దక్షప్రజాపతి ఇక్కడ శివుణ్ణి తలిచే వాళ్ళుంటే వెళ్ళిపొండన్నాడు .
🌿 దధీచి శిష్యుల్తో సహా లేచి నేనెన్ని చెప్పినా నువ్వు లెక్క చేయడం లేదు . నీ యజ్ఞం సర్వనాశనమయిపోతుంది .
🌸 నువ్వు చేస్తున్న యజ్ఞానికి వచ్చిన వాళ్ళు కూడా నాశనమయిపోతారని శపించాడు . తర్వాత వీరభద్రుడి వల్ల దక్షయజ్ఞం నాశనమయిపోయింది .
🌿 రాక్షసులు దేవతల మీద విజృంభించి యుద్ధం చేస్తున్నారు . దేవతలు వాళ్ళ బాధపడలేక శస్త్రాస్త్రాలన్నీ దధీచికి ఇచ్చి దాచమన్నారు .
🌸ఇంద్రుడి లాంటి పెద్దవాళ్ళు చెప్పారుక దాని దధీచి సరే అని ఎక్కువకాలం దాచలేక అన్నీ మింగేశాడు . అవన్నీ జీర్ణమయిపోయి రక్తనాళాల్లోను ఎముకల్లోనూ చేరిపోయాయి .
🌿దేవతలొచ్చి దధీచిని అస్త్రాలిమ్మన్నారు . మీరు చాలాకాలం రాలేదు కదా , అందుకే అవన్నీ మింగేశాను . ఎముకల్లో కలిసిపోయాయి నన్ను చంపి నా అస్థికలను తీసుకోమన్నాడు .
🌸దేవతలు ఏం చెయ్యలేక దధీచిని చంపలేక ఏడ్వడం మొదలు పెట్టారు . దధీచి వాళ్ళని ఓదార్చి మీకు తప్పనిసరిగా కావాలి అనుకున్నప్పుడు రండి .
🌿 నా శరీరం నేను విడిచేస్తాను .నా అస్థికలు మీకు విలువైన ఆయుధాలుగా ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళని పంపించాడు .
🌸 వృత్రాసురుడనే రాక్షసుడు దేవతల్ని చంపెయ్యడం మొదలెట్టాడు . అతన్తో యుద్ధం చెయ్యలేక బ్రహ్మని ప్రార్థించారు దేవతలు .
🌿వాళ్ళని దధీచి దగ్గరకు వెళ్ళి అతని అస్థికలను తీసుకుని ఆయుధాలుగా ఉపయోగిస్తే వృత్రాసురుణ్ణి చంపచ్చని చెప్పాడు బ్రహ్మ .
🌸దేవతలు దధీచికి జరిగింది వివరంగా చెప్పారు . దధీచి తనని చంపి అస్థికలను తీసికెళ్ళమన్నాడు . దేవతలు మహాత్మా ! మిమ్మల్ని చంపితే మాకు బ్రహ్మహత్యా పాతకం వస్తుంది .
🌿మీకు మీరుగా మరణించగల వరం మీకుంది అనుగ్రహించండి స్వామీ ! అన్నారు . దధీచి వాళ్ళు అడిగినట్లుగా శరీరాన్ని విడిచి పెట్టి పరమేశ్వరుడిలో ఐక్యమయిపోయాడు .ఇంద్రుడు గోవు రూపములో నాలుకతో దధీచి శరీరాన్ని ఆస్వాదించాడు
🌸అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం బ్రహ్మ చక్రం , లాంటి ఆయుధాల్ని చేసుకుని రాక్షసుల్ని చంపారు . దధీచి మరణించేనాటికి ఆయన భార్య సువర్చల గర్భవతి .
🌿భర్తతోపాటే సతీ సహగమనం చేస్తుంటే బ్రహ్మ వచ్చి అమ్మా ! నీ కడుపులో మహాత్ముడైన బాలుడున్నాడు సహగమనం చెయ్యద్దన్నాడు .
🌸కానీ , సువర్చల మీ దేవతలు చిత్రవిచిత్రంగా చేస్తున్నారు . నా భర్తని చంపారు . నన్ను వైధవ్యాన్ని అనుభవించమంటున్నారు . నా భర్త మరణానికి కారణమయిన దేవతలు
🌿పశువులుగా ప్రవర్తిస్తారని చెప్పి శపించి చితిలో దూకింది . ఆవిడ కడుపులో పిల్లాడు పిప్పలచెట్టుకింద పడ్డాడు .
🌸 పిప్పల చెట్టు చంద్రుడ్ని అడిగి అమృతం తెచ్చి ఆ పిల్లవాడికిచ్చి పెంచింది . పిప్పలచెట్టు పెంచిన ఆ పిల్లాడే పిప్పలాది మహర్షి అయ్యాడు .
🌿 పిప్పలాదుడు పెరిగి పెద్దవాడయ్యాక తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి తన తండ్రిని చంపిన దేవతల్ని చంపగలిగేలా వరం అడిగాడు .
🌸 దేవతల్ని చంపడం తప్పని పితృలోకంలో వున్న తల్లిదండ్రుల్ని చూసుకునే శక్తినిచ్చాడు శివుడు .
🌿 దధీచి మహర్షి కథ !! దధీచి మహర్షి ఎంత గొప్పవాడో చూశారా ! గొప్ప తపశ్శాలే కాకుండా తను మరణించి తన ఎముకల్ని ఆయుధాలుగా ఉపయోగించుకుని రాక్షసుల్ని చంపమన్నాడు .
🌸తన శరీరాన్ని మంచి పనికోసం ఉపయోగించాడు . గొప్పవాళ్ళెప్పుడూ వేరే వాళ్ళకోసమే బ్రతుకుతారని అర్ధమయింది కదా !
🌿ఇదండి దధీచి మహర్షి గురించి మనం తెలుసుకున్నది మరెన్నో విశేషలతో రేపు మరో మహర్షి గురుంచి తెలుసుకుందాము స్వస్తి

No comments:
Post a Comment