74వ శక్తి మహర్షి గురించి తెలుసుకుందాం
🌿ఇప్పుడు శక్తి మహర్షి గురించి తెల్సుకుందాం శక్తి మహర్షి వసిష్ఠుడికి పెద్దకొడుకు .
శక్తి మహర్షి గురించి మహాభారతంలో ఒక పురాణ కథ ఉంది.
🌸ఇక్ష్వాకు వంశంలో పుట్టిన అయోధ్య నగరాన్ని పాలిస్తున్న కల్మషపాదుడు,
ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళి అడవిలో చాలా జంతువులను
చంపుతాడు.
🌿అలసిపోయి, ఆకలితో, దాహంతో ఉన్న కల్మషపాదుడు వసిష్ఠ మహర్షి ఆశ్రమ సమీపంలో తిరుగుతూ ఉన్నాడు.
🌸కట్టెల కోసం వెలుతున్న శక్తి మహర్షి అదే మార్గంలో ఎదురుగా వచ్చాడు. శక్తి మహర్షి తల వంచుకుని తన పనిమీద తను వెళ్ళిపోతుండగా,
🌿 కల్మాషపాదుడు శక్తి మహర్షికి అడ్డంగా వచ్చి మహర్షిని ప్రక్కకి తప్పుకోమన్నాడు . రాజా ! ఇదేమిటని సద్రాహ్మణుడు ఎదురయితే నమస్కరించాలి గాని నన్నే తప్పుకో అంటున్నావు .
🌸 అంత తెలియని వాడివా ! నాకు భక్తితో నమస్కరించి నువ్వు ప్రక్కకి వెళ్ళాలి . అయినా నేను నీకు అడ్డుగా లేను . సరయిన మార్గంలోనే నడుస్తున్నానని చెప్పాడు శక్తి .
🌿కల్మషపాదుడు రాక్షసుడిలా క్రూరంగా వ్యవహరించి శక్తి మహార్షిని చేతికర్రతో గట్టిగా కొట్టాడు.
🌸 శక్తి మహర్షి ఆగ్రహంతో ఏ కారణం లేకుండానే దారిన వెడుతున్నవాణ్ణి అవమానించావు, రాక్షసుడిలా నన్ను కొట్టావు కనుక రాక్షసుడివై మాంసాహారం తింటూ జీవించు అని శపించాడు.
🌿కల్మాషపాదుడు అహంకారంతో కర్రతో కొట్టి శక్తి మహర్షిని చంపేశాడు . అప్పటికే గర్భవతిగా వున్న శక్తి భార్యకి పరాశరుడు కలిగాడు .
🌸తల్లి గర్భంలో పన్నెండు సంవత్సరాలు ఉండి శక్తి మహర్షి చదివిన వేదాలన్నీ విని నేర్చుకుని పుడుతూనే వేదాధ్యయన సంపన్నుడుగా పుట్టాడు పరాశరుడు .
- స్వస్తి
No comments:
Post a Comment