Adsense

Saturday, October 29, 2022

75వ మహర్షి.. శమీక మహర్షి

 మన మహర్షుల చరిత్రలు..

75వ శమీక మహర్షి గురించి తెలుసుకుందాం



🌿శమీక మహర్షి అంగిరసుడి సంతతివాడు . ఒక ముని కూతుర్ని పెళ్ళి చేసుకుని ఒక కొడుకుని పొందాడు .

🌸అతడి పేరు శృంగి . శమీక మహర్షి గృహస్థాశ్రమం నిర్వహిస్తూ శిష్యులకి విద్యాబోధన చేసేవాడు . శమీకుడు ఒకరోజు శిష్యులతో కలిసి ఒక అరణ్యంలో తిరుగుతుండగా ఒక గంట కనిపించింది .

🌿ఆగంటని మెల్లగా తీసి చూశాడు . దాని కింద నాలుగు పక్షి పిల్లల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు . ఇప్పటివరకు ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగింది . భీష్ముడు అంపశయ్య మీద వుండి ధర్మరాజుకి ధర్మాల గురించి చెప్తున్నాడు .

🌸అలాంటి ఈ ప్రదేశంలో గ్రుడ్లు ఎల్లా పడ్డాయి ? గంట ఎక్కడి నుంచి వచ్చి ఆ పక్షి పిల్లల్ని రక్షించింది ? అనుకుని పక్షి పిల్లల్ని ఇంటికి తీసుకురమ్మని శిష్యులకి చెప్పి తానే స్వయంగా పండ్లు కాయలు తినిపించాడు శమీకుడు

🌿పక్షి పిల్లలు కొంచెం పెరిగి ఎగరడం మొదలుపెట్టాక శమీకుడు వాటికి పక్షిరూపం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు .

🌸మా తండ్రి పేరు సుకృశుడు . ఆయన సత్యనిష్ఠ పరీక్షించడానికి దేవేంద్రుడు ముసలి పక్షిరూపంలో వచ్చి ఆకలిగా వుంది మాంసాహారం పెట్టమన్నాడు .

🌿 మమ్మల్ని దేవేంద్రుడికి ఆహారంగా వెళ్ళమంటే మేం వినలేదని మమ్మల్ని శపించి మనుష్య భాషలో మాట్లాడగలిగే శక్తి మాత్రం ఇచ్చాడు
మా తండ్రి అని చెప్పి ఆ పక్షులు వింధ్య పర్వతాల వైపు ఎగిరిపోయాయి .

🌸 శమీక మహర్షికి సత్యనిష్ఠ , తపస్సమాధి , బ్రహ్మజ్ఞాన దీక్ష ఇవే ఆహార పానీయాలైపోయాయి . వృద్ధుడౌతున్నా కూడా బ్రహ్మజ్ఞానం వల్ల వచ్చిన తేజస్సుతో బ్రహ్మర్షి అయ్యాడు .

🌿మౌనవ్రతంలో చాలా కాలం వుండిపోయాడు .
ఒకనాడు పరీక్షిన్మహరాజు వేటకి వెళ్ళి అలిసిపోయి , శమికుడి ఆశ్రమానికి వచ్చాడు . కానీ శమీకుడు తపస్సులో వుండి పరీక్షిత్తుని పలకరించలేదు .

🌸పరీక్షిత్తుకి కోపం వచ్చి బ్రాహ్మణుడుకి ఇంతగర్వమా ? మంచినీళ్ళడిగితే కూడా ఇవ్వనంత అహంకారమా ? నా వైపు చూడడానిక్కూడ కష్టంగా వుందా ? అని కోపంతో అక్కడ ఒక చచ్చిన పాముని శమీకుడి మెడలోవేసి వెళ్ళిపోయాడు .

🌿దూరంనుంచి ఇది చూసిన శిష్యుడు పరుగెత్తు వెళ్ళి శమికుడి కొడుకు శృంగికి చెప్పాడు . తన తండ్రి మెడలో పాముని వేసినవాడు ఏడు రోజుల్లో పాము విషంతోనే చస్తాడని శపించి

🌸 తండ్రి దగ్గర కూర్చుని గట్టిగా ఏడుస్తుంటే శమీకుడు కళ్ళు తెరిచి మెడలో వున్న పామును తీసి పడేసి ఏం జరిగందని కొడుకు నడిగాడు . శృంగి జరిగినదంతా చెప్పాడు .

🌿 శమీకుడు కొడుకుని మందలించి బ్రాహ్మణుడికి క్షమాగుణం వుండాలికాని కోపం వుండకూడదని శాపాన్ని తిప్పుకోమని చెప్పాడు . శృంగి శాపాన్ని తిప్పే శక్తి నాకు లేదన్నాడు .

🌸అప్పుడు శమీకుడు కృష్ణా ! పరమేశా ! హరా ! పిల్లవాడు తెలియక చేశాడు క్షమించమని అడిగాడు . శమీకుడు గౌరముఖ మహర్షిని పిలిచి శాపాన్ని గురించి పరీక్షిత్తుకు చెప్పమని చెప్పి పంపాడు .

🌿పరీక్షిత్తు శమీకుడికి కృతజ్ఞతలు చెప్పుకొని , శ్రీశుక మహర్షి ద్వారా మోక్ష మార్గం తెలుసుకుని మోక్షాన్ని పొందాడు .

🌸 స్వస్తీ

No comments: