Adsense

Tuesday, October 4, 2022

ధారీదేవి శక్తిపీఠం - పవిత్రత.....!!




🌸విశిష్ట దైవంగా.. ఈ తల్లి ఉత్తరాఖండ్ యొక్క శక్తి దేవతగా, చార్ధామ్ యొక్క కొంగు బంగారు దేవతగా పూజించబడుతోంది.

🌿ఉత్తరాఖండ్‌లోని గర్వాల్- శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత రక్షణ దేవతగా ఈ ప్రాంతవాసుల నమ్మకం.

🌸గుడి అలకానంద నది మధ్యలో ఉంటూ, నది యొక్క ధారను ప్రవాహాన్ని) నియంత్రిస్తుంది కనుక ఈ అమ్మవారికి ధారీ దేవి అని పేరు వచ్చిందని ఒక కథనం....ధారీదేవి ఆశీసులతోనే అలకనంద ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది.
    
🌿ధారీదేవి కాళీమాత ప్రతిరూపం. శక్తి స్వరూపిణి. చార్ధామ్ క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులకు రక్షకురాలు, ఉత్తరాఖండ్ గ్రామ దేవత ఈ ధారీ దేవి ధారీ దేవి కేధార్ నాధ్ లో నిత్యం సంచారం చేస్తూ, రక్షిస్తూ ఉంటుంది.

🌸ఉదయం బాలిక స్వరూపంలో,

మధ్యాహ్నం యవ్వన స్త్రీ రూపంలో,

రాతి వేళ ముసలి స్త్రీ రూపంలో,

దర్శనమిస్తూ, కేధార్ నాధ్ క్షేత్రంలో తిరుగుతూ ఉంటుంది.

🌿ఈ ఆలయం గురించి మహాభారతం లోనూ ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలోనూ పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు. 

🌸ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే ధారీదేవి.

🌿భక్తితో కొలిచినవారిని అనుగ్రహించే దేవత. ధిక్కరించిన వారికి అంతే కీడు జరుగుతుంది. .శ .పూర్వం1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు.

🌸ఆ రాజు చేసిన అపచారంతో కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది.
ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలితీసుకుంది. దేవి మహత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముడిచాడు.

🌿అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది.

🌸గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయాన గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్‌లో ఉంది.

🌿ఈ క్షేత్రంలో దేవీ రూపం మారుతుంది. ఉదయం పూట బాలికగానూ, మధ్యాహ్నం నడి వయస్కురాలిగానూ, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతూ ఉంటుంది.

🌸కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ పీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది.

🌿సూమారు 800 ఏళ్ళ క్రితం ఉత్తరాఖండ్లో గార్వాల్ ఎగువ ప్రాంతంలో వచ్చిన వరదలకు ఒక అమ్మవారి విగ్రహం కొట్టుకువచ్చి ఇప్పుడు ధారీదేవిని ప్రతిష్టించిన ప్రదేశంలో ఉన్న ఒక శిలకు తగిలింది. దీంతో అక్కడున్న శిల(రాయి) విలపించిందట.

🌸ఒక అశరీరవాణి వాక్కులు వినబడగా, ఆ సూచనలతో ఆ విగ్రహాన్నీ కనుగొనగలిగారనీ, అప్పటి నుంచి ఆ ప్రాంతంవారు ఆ శిలను పూజిస్తున్నట్టు కథనం. ఈ ఆలయం మరియు మూలవిరాట్టు చుట్టూ పైన గోడలు ఉండవు, అలానే బహిరంగ ప్రదేశంలో ఉంటుంది.

🌸16 జూన్ 2013న జరిగిన ఒక ఉదంతం అమ్మవారిపై వున్నా నమ్మకాన్ని బలపరిచింది. ఇవే ఉత్తరాఖండ్ వరదలు. హైడ్రో ప్రాజెక్ట్ లో భాగంగా అడ్డుగా నది మధ్యలో  విగ్రహాన్ని తరలింపును స్థానికులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో, ప్రాజెక్టు అధికారులు వ్యూహాత్మకంగా డ్యాంలో నీటిమట్టాన్ని పెంచుతూ వచ్చారు.

🌿దీంతో, అమ్మ ఆలయం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. విగ్రహం మునిగిపోతుందంటూ హడావుడి చేసి, ధారీదేవి పైభాగాన్ని పెకిలించి, ఎత్తున నిర్మించిన ప్లాట్ ఫామ్ పైకి మార్చారు.

🌸విగ్రాహాన్ని ప్రయివేటు సిబ్బంది సాయంతో మార్చారు. ధారి దేవి విగ్రహాన్ని మార్చుతున్న సమయంలోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు విపరీతంగా వచ్చాయని ధారీదేవిని పెకిలించిన సిబ్బందే చెప్తున్నారు.

🌿కొద్దిసేపటికే భారీ వర్షం మొదలయ్యింది. హిమాలయాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగి, భారీగా వరద పోటెత్తడంతో పెద్ద నష్టం జరిగింది. ఇదంతా అమ్మ ప్రకోపించడం వల్లే సంభవించిందంటున్నారు స్థానికులు.

🌸వందలాది భవనాలు నామరూపాల్లేకుండా పోయినా, వేలాదిమంది కొట్టుకు పోయినా, అలకానంద నది మధ్యలో ఉన్న కేదర్ నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం,

🌿ఆలయంలోని శివలింగం బురదలో కూరుకుపోకుండ ఉడడం (పూజకోసం తెచ్చిన బిల్వ పత్రాలు శివలింగాన్ని కప్పిఉంచడం), అంతా అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు.

🌸ధారి దేవి ఆలయం శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ వెళ్లే మార్గంలో వస్తుంది. కాబట్టి మీరు కేదార్‌నాథ్ లేదా బద్రీనాథ్ వెళ్ళినప్పుడల్లా ఈ ఆలయాన్ని చూడవచ్చు. శ్రీనగర్ నుండి దాని దూరం పదిహేను కిలోమీటర్లు, రుద్రప్రయాగ్ నుండి ఇరవై కిలోమీటర్లు. ఈ స్థలం పేరు కలిసౌర్..

🌿ఇది దేవీ మహిమా, లేదా సాధారణ ప్రకృతి వైపరీత్యమా అని ఇప్పటికీ తెలియలేదు..స్వస్తి...

No comments: