Adsense

Tuesday, October 4, 2022

నవదుర్గలు

 
  

🌸లోక సంరక్షణార్ధం జగన్మాత దాల్చిన అవతారాలు అనేకం. మన పురాణాలలో ఆ దేవినే శక్తి, చండి, అన్నపూర్ణ, దుర్గ , జగధ్ధాత్రి అని లెక్కకు మించిన పేర్లతో కొలుస్తారు.

🌿శక్తి పూజా మహత్యాన్ని వివరించే శాక్తం అనే దేవీ మహాత్యం, దుర్గా సప్తశతి మొదలైన గ్రంధాలలో దేవిని "చండీ" అని వివరించాయి.

🌸సామాన్యంగా చండి అనే నామాన్ని ధ్యానించినప్పుడు మన కళ్ళెదుట అమ్మవారి  భయంకర రూపం గోచరిస్తుంది. దానవులను, దుష్టశక్తులను నాశనం చేయడానికి   అవతరించిన  జగన్మాత రూపం చండి.

🌿ఆ చండియే తరువాత కాలంలో
దుర్గాదేవిగా పిలువబడినది. దుఃఖాన్ని నాశనం చేసే దేవి దుర్గాదేవి. దుర్గతి అనే  విధి కలిగించే  కష్టాలను తొలగించే దేవి దుర్గ. ఆ దేవి యే  మానవుల ఆకలిని తీర్చి సంపదలనిచ్చే అన్నపూర్ణాదేవి. విశ్వాధిదేవత అయినందున జగధ్ధాత్రి, వసంత కాలంలో వాసంతి.

🌸మహాశక్తియే దుర్గ, లక్ష్మీ, సరస్వతి అని  ముగ్గురు దేవేరులుగా నవరాత్రులలో పూజించబడుతున్నారు.
దేవీ కవచం అనే గ్రంధం
దుర్గాదేవి యొక్క ప్రధానమైన
తొమ్మిది రూపాలను
'నవదుర్గ' లుగా వివరించినది. అవే -

🌿1. శైలపుత్రి,
🌸2.బ్రహ్మచారిణి,
🌿3.చంద్రఘంటా,
🌸4.కుష్మాండా,
🌿5.కాత్యాయనీ,
🌸6.స్కంద మాతా
🌿7.కాళరాత్రి,
🌸8.మహాగౌరి,
🌿9.సిధ్ధధాత్రి,


🌸ఇవేకాకుండా గుణాలననుసరించి , దేవి మూడు మూర్తులుగా కీర్తించ బడుతున్నది. సత్వగుణానికి సరస్వతిగా, రజో గుణానికి మహాలక్ష్మి గా తామస గుణానికి మహాకాళిగా వర్ణించారు..స్వస్తి...

No comments: