Adsense

Tuesday, October 4, 2022

పాండవులు పూజించినదుర్గాదేవి....!!




🌸సాధారణంగా దుర్గాదేవి
ఆలయాలలో ఉత్తర ముఖంగాకాని, పడమటి  ముఖంగాకాని దర్శనానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. 

🌿విల్లుపురం జిల్లా శంకరిపురం సమీపాన  వున్న కల్వరాయన్మలై చరియలలో పన్నెండు వేల దేవ బ్రాహ్మణులు పూజించిన దేవపాణ్డలమ్ గ్రామంలోని ఏటి ఒడ్డున 900 సంవత్సరాల నాటి  దుర్గాదేవి ఆలయం .

🌸పైకప్పు ఏమీలేకుండా మైదానంలో వున్నది. ఈ అమ్మవారిని పంచపాండవులు తమ వనవాస సమయంలో పూజించినందు వలన యీ దుర్గాదేవి కి వనదుర్గ అనే పేరు వచ్చింది.

🌿ఇక్కడ దుర్గాదేవి ఏక శిలపై 9 అడుగుల ఎత్తున తూర్పు ముఖంగా అనుగ్రహిస్తున్నది.

🌸ఈ అమ్మవారిని మనసార వేడుకొని, శుక్రవారం నాడు, ఆదివారం నాడు, రాహుకాల సమయాన, పూలమాల సమర్పించి  నిమ్మపండు దొప్పలలో దీపం వెలిగించి పూజించిన సంతాన భాగ్యం,  వివాహభాగ్యం లభిస్తాయని భక్తులు ధృఢంగా నమ్ముతారు.

🌿తమ కోరికలు నెరవేరిన తక్షణమే అమ్మవారికి నూతనవస్త్రాలు సమర్పించి,  అర్చనాభిషేకాలు చేసి మ్రొక్కులు తీర్చుకుంటారు.

🌸కల్వరాయన్ కొండ ప్రాంతంలో
96 గ్రామాలకు చెందిన  కొండ జాతివారు ఈ దుర్గాదేవి ని కులదైవంగా పూజిస్తారు. ఇక్కడ దుర్గాదేవి ని ముస్లింలు కూడా ఆరాధించడం
ఆశ్చర్యపరుస్తుంది. రాహువుకు
అధిదేవత దుర్గాదేవి.

🌿కుటుంబ ఉన్నతికై చందనఅభిషేకం, శతృ బాధా నివృత్తికై  కుంకుమ పూతపెట్టి, ఎఱ్ఱ గన్నేరు పుష్పాలతో
పూజించి మ్రొక్కులు తీర్చుకుంటారు.
జీవితంలో సర్వ సుఖాలకి దుర్గాదేవి ని పూజిస్తున్నారు భక్తులు. ఈ ప్రాంతమే పంచ పాండవులు వనవాసం ఆరంభించిన ప్రధమ వనంగా చెప్తారు.

🌸ఆదికాలంలో ఈ ప్రదేశం
దట్టమైన అడవిగా వుండేదని
దేవతలు వచ్చి తపమాచరించి వరాలు పొందేవారని, పంచపాండవులు ప్రధమంగా నివసించిన సూర్య వనం యిదే అని చెప్తారు.

🌿పంచపాండవులు, ద్రౌపది నివసించిన ధౌమ్య వనమని ద్రౌపది కి సూర్యభగవానుడు అక్షయ పాత్ర యిచ్చిన స్ధలమని, దుర్వాస మహామునికి భోజనం పెట్టినదని సుదర్శనగిరి (వృధ్ధగిరి) పురాణంలో చూస్తాము.

🌸పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు వారితో వచ్చిన 12000 మంది వేద బ్రాహ్మణులు, ఒక సంవత్సర కాలం ఇక్కడ నివసించారు. అందువలన యీ ఊరు పాణ్డలమ్ అనే పేరుతో ప్రసిధ్ధి చెందినది.

🌿వేయి సంవత్సరాల విశేష మామిడి వృక్షం. కాంచీపురం ఏకాంబరేశ్వరుని ఆలయంలో వున్నట్లుగా పాండవవనేశ్వరర్.. దుర్గాదేవి
ఆలయానికి  మధ్య స్ధలవృక్షంగా యీ మామిడి చెట్టు వున్నది. నాలుగు ఏళ్ళకు ఒక సారి కాస్తుంది.

🌸చెట్టు చుట్టుకొలత  22 అడుగులు.  ఎత్తు 77 అడుగులు, వయసు అయినందున పెద్ద గాలికి  చెట్టు కొమ్మలు విరిగిపోతూ వుంటాయి.
ఈ చెట్టుకి చాలా చిన్న చిన్న పళ్ళు కాస్తాయి.

🌿వాటి బరువు సుమారుగా 100గ్రా. వరకూ ఉంటుంది, అయితే పెద్ద పండు బరువు 140గ్రా. నుంచి 160 గ్రా.ల వరకు వుంటుంది. ఇది భగవంతుని
అతిశయ సృష్టిగా భావిస్తారు. ఈ చెట్టు కాయలను కొన్ని వందల చిలకలు, ఉడతలు, పలు రకాల పక్షులు తిని ఆనందిస్తాయి.

🌸తిరువణ్ణామలై, శంకరాపురం
మార్గంలో , దేవపాణ్డలమ్ అనబడే గ్రామంలో వున్నది..స్వస్తి.

No comments: