Adsense

Saturday, October 1, 2022

అన్నమయ్య సంకీర్తన..!(శ్రీ లక్ష్మీదేవి కీర్తన)

అన్నమయ్య సంకీర్తన..!
(శ్రీ లక్ష్మీదేవి కీర్తన)


లక్ష్మీకళ్యాణము లీలతోబాడే మిదే నేడు
లక్ష్మీనారాయణులే లలనయు నీవును||


చూపులే చూపులు మీకు సూనకము బాసికము
వూపుచున్న గుబ్బలివి బూజగుండలు
తీపులమోవితేనెలు తీరని మధుపర్కము
దాపుగబెండ్లియాడేరయ్య తగుదగు మీకును||


మాటలు మీకిద్దరికి మదనమంత్రములు
మేటితలబాలు మీలో మించునవ్వులు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
నీటునబెండ్లాడర య్య నెరవేరె మీకును||


కౌగిలి కౌగిలి మీకు కందున పెండ్లి చవికె
పాగినకోరికలే పావకోళ్ళు
ఆగిన శ్రీవేంకటేశ అల మేలుమంగా నీవు
వీగక పెండ్లాడుడయ్య వేడుకాయె మీకు||...

No comments: