Adsense

Saturday, October 1, 2022

స్త్రీ సృష్టి కర్తయొక్క సజీవ కళాకృతి



స్త్రీ ఈ సృష్టి యొక్క సౌందర్యము ఆమెను సజీవ కళాకృతి రూపంలో చూడవచ్చును. స్నేహము ఆమె ప్రవృత్తి అనుదానము ఆమె స్వభావము, ఆమెలో, జీవితంలోని తత్వాల సన్నింటిని సృష్టికర్త మరీ మరీ నింపాడు. సృష్టియొక్క అన్నవస్థిత రూపాన్ని సున్నవస్థిత రూపంలో పరిణితి చెందించే సామర్థ్యాన్ని స్త్రీలో పొందుపరిచాడు. మనుష్యుని వద్ద తనది అని చెప్పుకోదగినది యోగ్యమైనదేదైనా వుంటే అది స్త్రీయొక్క అనుదానమే.

జీవితం ఆమె ఉదరకోశము నుండే ప్రారంభమవుతుంది. పచ్చదనాన్ని ఉత్పన్నం చేసే ధరిత్రికి తన శ్రేష్టత ఉన్నది. కానీ, మనుష్యత్వానికి సృజన కర్త జననియే. ఖనిజాలు, వృక్షాల కంటే మనిషి శ్రేష్ఠుడు. అందుకే ధరిత్రి కంటే అన్యధాత్రియైన జనని యొక్క మహిమ అనేక రెట్లు అధికమని అంగీకరించబడుతుంది. పృధ్విపైన మన పోషణ జరుగుతుంది. కానీ, స్త్రీ సమస్త మానవ సృష్టియొక్క సృజన, పోషణ చేస్తుంది.

మానవ అండము తల్లి గర్భములో పక్వమవుతుంది. శిశువు ప్రారంభిక ఆహారము తల్లి స్థనము నుండి వస్తుంది. వాత్సల్యాన్ని త్రాగి అంతరాత్మ ఉల్లాసితమవుతుంది. వికసిస్తుంది. ఆమెను మించి పోషణ, పెంపుదల, సందర్షణ మరెవ్వరూ ఇవ్వలేరు. శారీరికపోషణయే కాదు అంతఃకరణ పోషణ కూడా తల్లి కొంగు నీడలోనే అధికంగా జరుగుతుంది. వయస్కుడైన పురుషుడు స్త్రీ యొక్క సమర్పణతో కూడిన అనురాగం పొంది. అలౌకికానందం ప్రాప్తించుకొంటాడు. తృప్తి పొందుతాడు. సృజన యొక్క దేవి ఏ ఇంటికి వెళ్లుతుందో. నివసిస్తుందో అక్కడ గృహలక్ష్మి యొక్క పాత్ర నిర్వర్తిస్తుంది. మట్టి మిద్దెలో స్వర్గాన్ని ఎలా అవతరింపజేయవచ్చో దాని సిద్ధాంతము ప్రత్యక్షముగా చేసి చూపెడుతుంది.

*- మూలం పండిత శ్రీరామశర్మ ఆచార్య*

మాతృమూర్తి మాతృభాష మాతృభూమి మాకు శిరోధార్యం

*- యుగపరివర్తనామిషన్*
విచార క్రాంతి ప్రజ్ణా అభియాన్
ఆలోచనా విప్లవం వర్ధిల్లాలి

No comments: