రాజరాజేశ్వరి: కామేశ్వరుని పట్టమహిషి అయిన తల్లి శ్రీ రాజరాజేశ్వరి, పాశ, అంకుశము, పుష్ప బాణములను మరియు చాపాలను ధరించి కృపారసముతో , అన్ని ఆభరణాలతో అలంకరించబడి, తన అనుగ్రహము ద్వారా తన భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది.
సింహా వాహన, చాముండా ప్రజలను రక్షించడానికి మరియు చండ, ముండ మొదలైన క్రూరమైన రాక్షసులను నాశనం చేయడానికి జగన్మాత ఈ చాముండా రూపాన్ని తీసుకున్నారు. త్రిశూలాన్ని చేతిలో పట్టుకున్న సింహవాహనంపై ఆమె కూర్చొని వున్నది.
*ప్రాముఖ్యత:-* శ్రీ దేవి మహాత్మ్యంలో దేవి ఉదహరించిన ఒక ఉల్లేఖనం “ఏకైవాహమ్ జగత్యాత్ర ద్వితీయ కా మమాపారా” (నేనే ప్రపంచంలోని ఏకైక శాశ్వతమైన శక్తిని, మరెవరో కాదు). అందువల్ల ఈ విభిన్నమైన అలంకారాలు మరియు అవతారాలు జగన్మాతకు చెందినవి. సర్వమూ తానైన ఏకైక శక్తి ఆ జగన్మాత.
*దేవీ మాహాత్మ్యం*
-------------------------
శరన్నవరాత్రులలో ఆరాధించబడే జగన్మాత ఆదిపరాశక్తి ! ఆవిడే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, ఆవిడే పరబ్రహ్మ, ఆవిడే సాకార నిరాకార స్వరూపిణి ! జగత్తంతా తన శక్తితో వ్యాపించి, నడిపించే తల్లి.
'సైషా దేవీ ఇదమగ్ర ఆసీత్' అని చెప్పారు జగన్మాత గురించి. సా ఏషా దేవీ - ఆ పరబ్రహ్మమే ఈవిడ. పరబ్రహ్మమే ఈ జగన్మాత రూపంలో వచ్చింది. ఈవిడే అందరి కంటే అన్నింటి కంటే, ముందర ఉన్నది. ఈమెయే ఆద్యాదేవి.
దేవీ అంటే స్వయం ప్రకాశ స్వరూపిణి.
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః !
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతామ్ !!
దేవి అయిన, దేవతలకు దేవి అయిన, ప్రకృతి స్వరూపిణి అయిన, మనకు శుభములను కలిగించే శివానికి మేము నమస్కరిస్తున్నాము.
ఉన్నది ఒక్క సత్యమే ! దానినే అనేక రూపాలతో, నామాలతో, అనేకులు అనేక విధాలుగా స్తోత్రించారు.
" ఏకం సద్విప్రా బహుధా వదన్తి " అని శ్రుతి వాక్యం. " ఏకమేవాద్వితీయం బ్రహ్మ " బ్రహ్మము ఒక్కటే, రెండవది లేదు, అని ఉపనిషత్తు బోధిస్తోంది.
" మాతా చ పార్వతీదేవీ
పితా దేవో మహేశ్వరః !
బాంధవాః శివ భక్తాశ్చ
స్వదేశో భువన త్రయమ్ "!!
అని శ్రీ శంకరభగవత్పాదులు స్తోత్రించారు.
యావద్విశ్వానికీ తల్లి పార్వతీదేవి, తండ్రి మహేశ్వరుడు. శివభక్తులందరూ బంధువులే ! ముజ్జగములు మన స్వదేశమే, అనటంలోని విశాల దృక్పథము - దేవతలు, దానవులు, మానవులు, తిర్యక్కులు - సర్వ ప్రాణికోటి ఒకే పరమాత్మ సంతానము అని చెప్పటమే ! అంటే, అందరికీ మూలము, ఆధారము, అధిష్ఠానము పరమాత్మే ! ఆ పరబ్రహ్మమునే అనేక నామాలతో, రూపాలతో ఆరాధిస్తాము. నిర్గుణము, నిరాకారము, నిరంజనము, త్రిలింగాతీతము అయిన పరమాత్మను స్త్రీగా భావిస్తే, ఆమె ఆదిపరాశక్తి. అంటే, అన్నింటి కంటే, అందరి కంటే మొట్ట మొదటగా ఉన్న తల్లి ! ఆమెయే, సతీదేవిగా, పార్వతీదేవిగా వచ్చింది.
ఆ పరబ్రహ్మను పుం రూపముగా భావిస్తే, పరమేశ్వరుడు ! ఈశ్వరుడు అంటేనే శాసకుడు, సర్వమును పాలించే వాడు. పరమమైన ఈశ్వరుడు పరమేశ్వరుడు. అత్యుత్కృష్టమైన శాసకుడు. ఏ దేవుని ఆరాధించే వారికి ఆ దేవుడే పరమేశ్వరుడు, గొప్ప పాలకుడు. శివభక్తులందరూ బంధువులు అంటే - శివము అంటే మంగళము, శుభము.
మనకు మంగళములను, శుభములను ఇచ్చే దైవాన్ని ఏ నామరూపాలతో భావించినా శివుడే !శివకేశవులకు అభేదం, సర్వదేవతలకు అభేదమే ! దైవారాధకులందరూ మనకు ఆప్తులే !
కాళిదాస మహాకవి -
"వాగర్ధావివ సంపృక్తౌ
వాగర్ధ ప్రతిపత్తయే !
జగతః పితరౌ వందే
పార్వతీ పరమేశ్వరౌ" !!
అని స్తుతించాడు.
వాగర్ధౌ ఇవ సంపృక్తౌ - వాక్కు, దాని అర్ధము ఎలా అవినాభావమో, అలా ! అంటే, ఒక పదము పలకగానే, దాని అర్థం స్ఫురిస్తుంది. అది ఫలానా అని తెలుస్తుంది. పదము దాని అర్ధము ఎలా విడదీయడానికి రావో, అలా అవినాభావంగా కలిసి ఉన్న పార్వతీ పరమేశ్వరులను, జగత్తుకు తల్లి దండ్రులైనటువంటి వారిని, 'వాగర్ధ ప్రతిపత్తయే వందే.' వాక్కులు, వాని అర్ధములు చక్కగా స్ఫురించుట కొరకు నమస్కరించు చున్నాను అని ప్రార్థించాడు.
వాక్కు జ్ఞాన వ్యక్తీకరణ సాధనము. వాక్కు అంటే శబ్దము. శబ్ద బ్రహ్మము ఓంకారము. ఓంకారము లోనుండి సర్వ వర్ణాలు వచ్చాయి. వర్ణము అంటే అక్షరము. అక్షరాలు వచ్చాయంటే, అక్షరాలు, పదాలు, భాష, భాషతో చెప్పబడే వస్తు జాతము అంటే ప్రపంచము వచ్చింది. ఓంకారము, దాని నాదము ఎలా విడదీయటానికి రావో, అలా ఏకమై ఉన్న పార్వతీ పరమేశ్వరులు అని చెప్పాడు కాళిదాస మహాకవి. అంటే పార్వతిగా, పరమేశ్వరునిగా ఇద్దరుగా కనిపిస్తున్నది ఒక్కరే అని చెప్పాడు.
ఆ ఒక్కటే అయిన శక్తిని అమ్మవారిగా కొలవ వచ్చును. అయ్యవారిలా ఆరాధించ వచ్చును. అమ్మవారు నాద రూపంలో మనలో ఉంటేనే, మనం శబ్దరూపంలో మాట్లాడ గలుగుతున్నాను. జగన్మాత తత్త్వమైన వినబడని అవ్యక్త నాదం లోంచి ఓంకారం వచ్చింది. ఓంకారం లోంచి వేదాలు, వేదాల్లోంచి శాస్త్రాలు వచ్చాయి. మూలంలో ఉన్నదే దానిలోంచి వచ్చిన వాటిలో ఉంటుంది కనుక అన్నింటిలో ఉన్నది అమ్మవారే ! జగన్మాతే !
చండీ సప్తశతి నాల్గవ అధ్యాయములో ఏడవ శ్లోకంలో అమ్మవారి గురించి ఇలా చెప్పారు -
హేతుస్సమస్త జగతాం త్రిగుణాऽపి దోషైః
న జ్ఞాయసే హరి హరాదిభిరప్యపారా !
సర్వాశ్రయాఖిలమిదం జగదంశ భూత
మవ్యాకృతా హి పరమా ప్రకృతిస్త్వమాద్యా !!
దసరా సందర్భంగా మనం జగన్మాతను కొలుచుకుంటున్నాము. దశ అహః - దశ హరా - దసరాగా మారింది. దశ అహః అంటే పది రోజులు. పది రోజుల పండుగ. దశ హరా - పది రకాల పాపాలను పోగొట్టేది, పది జన్మల పాపాలను తొలగించేది. తొమ్మిది రోజులు నియమబద్ధమైన పద్ధతిలో జగన్మాతను వివిధ నామరూపాలతో ఆరాధించి, నైవేద్యములు సమర్పించి, పదవ రోజున ఈ తొమ్మిది రోజుల సాధన పండగా, జగన్మాత అనుగ్రహాన్ని పొంది, సాధనలో విజయము పొంది, పదవరోజున విజయదశమి పండుగ జరుపుకుంటాము.
మహిషాసుర వధ చేసిన చండీ దేవిని - జగన్మాతను దేవతలు ప్రశంసిస్తున్నారు, ప్రార్ధిస్తున్నారు - హేతుః సమస్త జగతాం -
తల్లీ ! నువ్వు సమస్త జగత్తుకు కారణమైన దానివి. త్రిగుణాత్మకురాలివి. సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలు కలిగిన దానివైనా, ఇతరులకు ఉండే దోషాల వల్ల నీవు ఇతరుల చేత తెలియబడటము లేదు. అంటే ఎవ్వరూ కూడా నీ అసలు స్వరూపాన్ని, అసలు తత్త్వాన్ని తెలుసుకోలేక పోతున్నారు. ఎందుకంటే నీవు తెలియబడని దానివి. కనుకనే హరిహరాదులు కూడా నిన్ను తెలుసుకోలేక పోతున్నారు. నీవే ఈ సమస్త జగత్తుకు ఆశ్రయమైన దానివి. ఈ జగత్తంతా నీలోని ఒక అంశ మాత్రమే ! నీవు పరమమైన ప్రకృతివి, ఆద్యా ప్రకృతివి.
జగన్మాత ఇక్కడ పరబ్రహ్మ స్వరూపిణిగా స్తోత్రించబడింది, ఆద్యా ప్రకృతిగా కీర్తించబడింది. సమస్త జగత్తుకు ఆవిడే కారణమంటే ఆవిడే సృష్టి కర్త్రి. '...సృష్టి కర్త్రీ బ్రహ్మ రూపా...' ఆవిడే ప్రకృతి స్వరూపిణి కనుకే త్రిగుణాత్మకురాలు. సత్వరజస్తమో గుణములతో ఉన్న ప్రకృతి అయితే హరిహరులకు ఆమె గురించి తెలిసి ఉండాలి కదా ! కానీ ఎవ్వరూ ఆవిడను తెలుసుకోలేరు ఎందుకంటే జగన్మాత మన కంటికి కనుపించే ప్రకృతి మాత్రమే కాదు, ఆద్యా ప్రకృతి, మూలప్రకృతి. సృష్టి జరగక ముందు ఉన్న సామ్యావస్ధ ఈ తల్లియే ! అంటే ప్రధానము అన్నమాట ! త్రిగుణాలతో ఉన్నా, ఈవిడ నెందుకు తెలుసుకోలేరు అంటే, దేవతలకు మానవులకు కూడా బ్రహ్మజ్ఞానం కలగటం అంత సులభం కాదు. అవిద్య, పరిమితత్వము, జ్ఞానరాహిత్యము అనే దోషాలతో ఉంటారు కనుక మానవులకే కాదు, దేవతలకు కూడా ఈవిడ తెలియబడదు. 'దేవైరత్రాऽపి విచికిత్సితం కిల ?' అంటోంది కఠోపనిషత్తు.
మనకు కనిపిస్తున్న ఈ విశ్వమంతా అమ్మవారి లోని ఒక పాలు మాత్రమేనట ! మూడొంతులు ఎవ్వరికీ తెలియబడకుండా ఉన్నదిట.
'...పాదోऽస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి.
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః
పాదోస్యేహాభవాత్పునః.'
అని పురుష సూక్తం చెప్తోంది.
ఋగ్వేదం విరాట్పురుషుని వర్ణిస్తూ, ఈ యావద్విశ్వమూ ఆ విరాట్పురుషునిలోని నాలుగింట ఒక పాలు మాత్రమే అనీ, మూడు పాళ్ళు విశ్వానికి అతీతంగా పైన ఉన్నదనీ చెప్పింది. ఒక పాలయిన ఈ విశ్వములోని కోటానుకోట్లలో కోటోవంతు కూడా మానవులలో ఎవరికీ పూర్తిగా తెలీదు. అంతటి అనంతమైనది ఈ విశ్వము !
దైవానికి ఇన్ని రూపాలెందుకు ? అమ్మవారికి అన్ని నామాలు, రూపాలెందుకు ? అన్నీ ఒక్కరేనా ? అంటే అన్నీ ఒక్కటే, అందరూ ఒక్కరే ! అదే మన సనాతన ధర్మంలోని గొప్పదనం ! మన హిందూమతం లోని మహోత్కృష్టత ! ఈ సమన్వయం మనకు మహర్షులు అడుగడుగునా అందించారు.
ఉన్న ఒక్క పరబ్రహ్మమే సృష్టి చేసేప్పుడు బ్రహ్మగా, రక్షించేటఫ్ఫుడు విష్ణువుగా, లయకారకుడుగా రుద్రుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఐక్యమంత్రం ఏం చెప్తోందో చూద్దాము.
"వేదాన్తినోऽనిర్వచనీయమేకం
యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశన్తి !
శైవా యమీశం శివ ఇత్యవోచన్
యం వైష్ణవా విష్ణురితి స్తువన్తి....."
అనిర్వచనీయమైన పరతత్వాన్ని వేదాంతులు బ్రహ్మమంటారు, శైవులు శివుడంటారు, వైష్ణవులు విష్ణువంటారు.
ఆ తత్త్వమే సరస్వతిగా, లక్ష్మిగా, కాళికా ఉన్న త్రిలోక జనని ఆదిపరాశక్తి.
"విద్యా ప్రదాన సమయే శశికోటిశుభ్రాం
ఐశ్వర్య దాన సమయే నవ విద్రుమాభాం !
విద్వేషి వర్గ దళనే తు తమాల నీలాం
దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే" !!
విద్యల ననుగ్రహించే జ్ఞాన ప్రదాయినిగా ఉన్నప్పుడు కోటి చంద్రుల వలె తెల్లగా చల్లగా ఉన్న సరస్వతీ దేవిగా, సంపదలను, శుభాలను అనుగ్రహించేటప్పుడు ప్రేమను చూపించే ఎరుపు రంగు గల పగడపు కాంతితో ప్రకాశించే శ్రీమహాలక్ష్మి గాను, శతృవులను దునుమాడి శిష్టులను, భక్తులను రక్షించేటప్పుడు తమాల వృక్షము వలె నలుపు, నీలి వర్ణంతో శోభిల్లే కాళికా దేవి గానూ ప్రకాశించే, మూడు లోకాలకు తల్లియైన జగన్మాతను శరణు కోరుతున్నాను.
అంటే ఒక్క తల్లే మూడు రూపాలుగా కనిపిస్తూ వివిధ కార్యాలు చేస్తున్నది.
"యా దేవీ సర్వ భూతేషు విష్ణుమాయేతి శబ్దితా !
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః !!
యా దేవీ సర్వ భూతేషు చేతనేత్యభిధీయతే !
నమస్తస్యైనమస్తస్యై నమస్తస్యై నమోనమః !!
యా దేవీ సర్వభూతేషు బుధ్ధి రూపేణ సంస్ధితా

No comments:
Post a Comment