Adsense

Wednesday, October 5, 2022

మాచేనమ్మ కట్ట పెదమల్లం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా..!!




🌸ఇక్కడ అమ్మవారికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీ మాచేనమ్మ అమ్మ వారు ఆచంట మండలం పెదమల్లం గ్రామం ఆడపడుచు. ఈమె చిన్నతనం నుండి లక్ష్మీదేవి భక్తురాలు. ఈమె మనసులో ఏమి అనుకుంటే అవి జరిగేవి.

🌿ఈమె యుక్త వయస్సు వచ్చిన తరువాత వివాహము జరిగింది.ఆమె భర్త ఒక ఆశ్రమంలో గురువు వద్ద శిష్యునిగా పనిచేస్తుండేవారు. గురువుగారు కాశీ పుణ్యక్షేత్రం చూడటానికై తనతో తన శిస్తులని వెంట తీసుకుని వెళ్ళుటకు నిర్ణయించుకున్నారు.

🌸శిష్యులలో ఒకరైన ఈమె భర్త భార్యతో చెప్పి కాశీకి వెళ్లారు. ఆసమయంలో ఈమె ఒక నెల గర్భిణి. ఆ విషయం భర్తకు తెలియదు. సుమారు రెండు సవత్సరముల తరువాత భర్త కాశీ నుండి తిరిగి వచ్చారు.

🌿భర్త వచ్చిన సమయానికి ఈమె తన చిన్నారి పాపను ఎత్తుకుని భర్తకు చూపగా, ఈమె భర్త ఈ చిన్నారి పాప ఎవరు? అని ప్రశ్నించగా, ఆమె చెప్పిన మాటలు భర్త నమ్మక..,

🌸ఆమెను అత్తవారింటి వద్దనుండి పుట్టిల్లు అయిన పెదమల్లం గ్రామంలో దించుటకు గ్రామ పొలిమేర వద్దకు వచ్చిన తరువాత ఆమె భర్త చిన్నారి పాప ఎలా పుట్టింది అని ప్రశ్నించగా..

🌿ఆమె భర్త మనస్సును గ్రహించి భర్తను ముందుకు నడవమని చిన్నారి పాపను ఎత్తుకుని ప్రక్కగా ఉన్న పొదల చటునకు వెళ్లి తన భర్త అనుమానించుచున్నాడు.

🌸కావున పంచభూతాలు సాక్షిగా భూదేవి యందు ఐక్యం చేసుకోవలసినదిగా కోరగా భూదేవి ఆమె ఉన్న చోటు నుండి దారి ఇవ్వగా ఆమె, ఆమె చిన్నారి భూదేవి యందు ఐక్యమవుతున్నారు. మాచెనమ్మ చిన్నారి పాప శిరస్సుల వరకు భుగర్భము నందు దిగిపోవుచూ కనిపించినారు.

🌿వీరిని ఏ విధంగా రక్షించాలో భర్తకు అర్థం కాక ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగగా భర్త చేతికి జుట్టు వచ్చి ఆమె, చిన్నారి పాప శిరస్సులవరకు శిలా ప్రతమలుగా మారిపోయినారు.

🌸ఆమె భర్తకు ఏమి చెయ్యాలో తెలియక భయాందోళనతో జుట్టును ప్రక్కకు విసిరేసి అతను వెళ్ళిపోయాడు. జుట్టును విసిరేసిన ప్రదేశం నందు కొన్ని వృక్షములు మొలిచాయి.ఆ వృక్షము పేరులేని చెట్టుగా ప్రసిద్ధిగాంచినది.

🌿కొద్ది కాలమునకు చుట్టుప్రక్కల గ్రామస్థులకు అమ్మవారు కనిపించి గ్రామ పొలిమేర నందు మాచేనమ్మా అమ్మవారు వెలిసినారు అని చెప్పగా గ్రామస్థులు వచ్చిచూడగ దివ్య సమ్మోహితమైన శ్రీ మాచేనామ్మ అమ్మవారు చిన్నారి పాప విగ్రహములు కనిపించసాగాయి.

🌸ఈమెను కొలవడం ప్రారంభించడం ప్రారంభించిన తరువాత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ మాచేనమ్మ అమ్మవారు స్వచ్చమైన మహిమాన్వితం తెలుసుకుని గ్రామస్థులు గ్రామం పొలిమేర నుండి గ్రామంలోనికి తీసుకు వచ్చి,

🌿గుడి కట్టుటకు నిర్ణయించుకుని అమ్మవారి వద్ద ఎంత మట్టి తీసిన అంత లోతుణకు శిరస్సులు వరకే  కనిపించసాగారు. సుమారు ఐదు అడుగుల బావి ఏర్పడగా అమ్మవారి ఆజ్ఞానుసారం ఆమెను ఆ ప్రదేశము యందు ఉంచసాగారు.

🌸తరువాత కొంత కాలమునకు గ్రామస్థులు గుడికట్టుటకు ప్రయత్నము చెయ్యగా అమ్మవారు కలలో కనిపించి నాకు ఎండ,వర్షం పడే విధంగా గుడి నిర్మాణము చేసి దానిపై తాటి ఆకు శిఖరము ఉండే విధంగా కోరినారు

అందుకే ఈ రోజు వరకు తాటిఆకు శిఖరం కలదు..స్వస్తి

No comments: