THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Thursday, March 30, 2023
నేడు శ్రీరామనవమి...!!
🌿ప్రపంచం నలుమూలలా వున్న భారతీయ ఆధ్యాత్మిక పరులంతా భక్తి శ్రధ్ధలతో జరుపుకునే మహోత్సవం.
🌸శ్రీమహావిష్ణువు శ్రీరామునిగా ఈ భూలోకంలో అవతరించిన దినం.
🌿భూలోకవాసుల జన్మ సాఫల్యానికి
శ్రీ రామనామ మొక్కటే
తారకమంత్రము.
🌸రామనామము మాత్రమే
ఎలా జపించినా మోక్షాన్ని ఇస్తుందట. రత్నాకరుడనే దొంగ నారదుని ఉపదేశంతో మరా,మరా అని జపించి రామ నామ మహిమతో వాల్మీకి మహర్షి అయినట్లు
పురాణాలు తెలుపుతున్నాయి.
🌿శ్రీ రాముడు పురుషోత్తమునిగా కీర్తి పొందాడు. అతి సామాన్య ప్రాణియైన ఉడత (చిన్న జంతువు) నుండి గుహుడు( పురుషుడు)
జటాయు ( పక్షి) సుగ్రీవుడు( వానర రాజు) శబరి( స్త్రీ), విభీషణుడు
( దానవకులం) అహల్య( ఋషి పత్ని)
వరుణుడు(దేవత)
ఇలా సకల ప్రాణులను సమానంగా ఆదరించి కరుణించాడు.
🌸శ్రీమద్రామాయణాన్ని పారాయణం చేసేముందు ప్రవచనం చెప్పేవారి ముందు ఒక ఆసనం అమర్చి దాని ముందు ముగ్గు వేసి ధూప దీపాలు వెలిగించడం ఆచారం.
🌿ఎక్కడ శ్రీరామాయణ
పారాయణం జరిగినా హనుమంతుడు వచ్చి వింటాడని ఐహీకం.
🌸కాంచి రామకృష్ణ యతీంద్రులవారు త్యాగయ్యను ఆశీర్వదించి " నీవు నీ జీవితంలో 96 కోట్ల సార్లు రామనామం జపిస్తే శ్రీ రాముని దివ్యదర్శనం
లభిస్తుంది, అంతిమ సమయంలో ఆయన పాదలచెంత ముక్తిని పొందగలవు" అని ఉపదేశించారట.
🌿ఆవిధంగానే త్యాగరాజస్వామి 21 ఏళ్ళలో అన్ని కోట్ల రామనామావళిని
జపించి అనేకసార్లు
శ్రీ రామ దర్శనం పొందారు.
🌸కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో నిత్యం సాయం సమయాన సప్త ఋషులు పూజ చేసే సమయాన బిల్వదళాలపై చందనంతో శ్రీరామ నామాన్ని లిఖించి
🌿వాటిని కాశీవిశ్వేశ్వరునికి సమర్పిస్తారు. ఇలా చెసినందువలన కాశీకి వచ్చిన సర్వుల సకలపాపాలు తొలగి పోతాయనేది ఐహీకం.
🌸అన్ని మంత్రాలను ఉఛ్ఛరించడానికి, మనసు, దేహం నియమనిష్టలు పాటిస్తూ ధ్యానంలో వుండగానే ఉఛ్ఛరించాలి. కాని రామ నామం మాత్రం ఎప్పుడు యే పని చేస్తున్నా జపించ వచ్చును.
🌿రామనామాన్ని
భక్తి శ్రధ్ధలతో జపించిన
ముక్తి లభిస్తుంది అని శాస్త్రాలు తెలుపుతున్నాయి.
🌸రామానామాన్ని హనుమంతుని విగ్రహం ముందు జపించడం మంచిదని పెద్దవారంటారు.
🌿రామనామ జపంతో ఉన్నతమైన జ్ఞాన స్ధితికి చేరుకున్నవారు అనేకమంది. రామానందులు, కబీరుదాసు, సమర్ధరామదాసు,త్యాగరాజస్వామి, భద్రాచల రామదాసు , యోగి రామశరత్కుమార్, మొదలైనవారు రామనామంతో ప్రసిద్ది చెందారు.
🌸కౌశల్య పుత్రుడైన రామునికి రాముడని పేరు పెట్టేరే కాని ' రామ రామ ' అనేది ఋషులకాలం నుండి
ఉపనిషత్తులలొ చెప్పిన పేరు అని అంటారు.
🌿రామేతి రామా అంటే ఆనందాన్ని ఇచ్చే వాడని అర్ధం.
శ్రీ భోదేంద్రస్వామి కాంచి కామకోటి పీఠానికి 59వ
పీఠాధిపతి. రామనామ గ్రంధాలను లోకానికి అందించారు.
🌸రామనామాన్ని ఒక్కసారి ఉచ్ఛరించి తన దోషాలను పోగొట్టుకొన్న ఒక మహిళ దగ్గర భిక్ష తీసుకుని
రామ నామామృత మహిమను ఈ మహాజ్ఞాని తెలుసుకున్నారట.
🌿" సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే' అని తెలుపుతున్నది విష్ణు పురాణం. శ్రీ రామనామాన్ని ఒక్కసారి
జపిస్తే మహావిష్ణువు సహస్రనామాలు జపించిన పుణ్యం లభిస్తుంది.
🌸ఇది పరమేశ్వరుడు సతీదేవికి
చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి.
రామ నామాన్ని జపిస్తూ వుంటే మనసు ప్రశాంతంగా వుంటుంది.
దేహానికి చల్లదనం లభిస్తుంది. రక్తప్రవాహం క్రమబధ్ధీకరించ
బడుతుంది.
🌿కుంటుంబ క్షేమం ,,అన్యోన్యమైన సంసారం,,,మంచి ఆలోచనలతో కుంటుబ ఆరోగ్యం బాగుపడుతుందని
గ్రంధాలు వివరిస్తున్నాయి...స్వస్తి
జై శ్రీరామ్...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment