Adsense

Showing posts with label sri rama navami. Show all posts
Showing posts with label sri rama navami. Show all posts

Thursday, March 30, 2023

నేడు శ్రీరామనవమి...!!

 


🌿ప్రపంచం నలుమూలలా వున్న భారతీయ ఆధ్యాత్మిక పరులంతా భక్తి శ్రధ్ధలతో జరుపుకునే మహోత్సవం.

🌸శ్రీమహావిష్ణువు శ్రీరామునిగా ఈ భూలోకంలో అవతరించిన దినం.

🌿భూలోకవాసుల జన్మ సాఫల్యానికి
శ్రీ రామనామ మొక్కటే
తారకమంత్రము.

🌸రామనామము మాత్రమే
ఎలా జపించినా మోక్షాన్ని ఇస్తుందట. రత్నాకరుడనే దొంగ నారదుని ఉపదేశంతో మరా,మరా అని జపించి  రామ నామ మహిమతో వాల్మీకి మహర్షి  అయినట్లు
పురాణాలు తెలుపుతున్నాయి.

🌿శ్రీ రాముడు పురుషోత్తమునిగా కీర్తి పొందాడు. అతి సామాన్య ప్రాణియైన ఉడత (చిన్న జంతువు) నుండి గుహుడు( పురుషుడు)
జటాయు ( పక్షి)  సుగ్రీవుడు( వానర రాజు) శబరి( స్త్రీ), విభీషణుడు
( దానవకులం) అహల్య( ఋషి పత్ని)
వరుణుడు(దేవత)
ఇలా సకల ప్రాణులను  సమానంగా ఆదరించి కరుణించాడు.

🌸శ్రీమద్రామాయణాన్ని పారాయణం చేసేముందు ప్రవచనం చెప్పేవారి ముందు ఒక ఆసనం అమర్చి దాని ముందు ముగ్గు వేసి ధూప దీపాలు వెలిగించడం ఆచారం.

🌿ఎక్కడ శ్రీరామాయణ
పారాయణం జరిగినా  హనుమంతుడు వచ్చి వింటాడని ఐహీకం.

🌸కాంచి రామకృష్ణ యతీంద్రులవారు త్యాగయ్యను ఆశీర్వదించి  " నీవు నీ జీవితంలో 96 కోట్ల సార్లు రామనామం జపిస్తే శ్రీ రాముని దివ్యదర్శనం
లభిస్తుంది,  అంతిమ సమయంలో  ఆయన  పాదలచెంత ముక్తిని పొందగలవు" అని ఉపదేశించారట.

🌿ఆవిధంగానే త్యాగరాజస్వామి 21 ఏళ్ళలో అన్ని కోట్ల రామనామావళిని
జపించి అనేకసార్లు
శ్రీ రామ దర్శనం పొందారు.

🌸కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో నిత్యం  సాయం సమయాన సప్త ఋషులు పూజ చేసే సమయాన బిల్వదళాలపై చందనంతో శ్రీరామ నామాన్ని లిఖించి

🌿వాటిని కాశీవిశ్వేశ్వరునికి సమర్పిస్తారు. ఇలా చెసినందువలన కాశీకి వచ్చిన  సర్వుల సకలపాపాలు తొలగి పోతాయనేది ఐహీకం.

🌸అన్ని మంత్రాలను ఉఛ్ఛరించడానికి, మనసు, దేహం నియమనిష్టలు పాటిస్తూ ధ్యానంలో వుండగానే ఉఛ్ఛరించాలి. కాని రామ నామం మాత్రం ఎప్పుడు యే పని చేస్తున్నా జపించ వచ్చును.

🌿రామనామాన్ని
భక్తి శ్రధ్ధలతో జపించిన
ముక్తి లభిస్తుంది అని శాస్త్రాలు తెలుపుతున్నాయి.

🌸రామానామాన్ని హనుమంతుని విగ్రహం ముందు  జపించడం  మంచిదని పెద్దవారంటారు.

🌿రామనామ జపంతో ఉన్నతమైన జ్ఞాన  స్ధితికి చేరుకున్నవారు అనేకమంది. రామానందులు, కబీరుదాసు, సమర్ధరామదాసు,త్యాగరాజస్వామి, భద్రాచల రామదాసు , యోగి రామశరత్కుమార్, మొదలైనవారు రామనామంతో  ప్రసిద్ది చెందారు.

🌸కౌశల్య పుత్రుడైన రామునికి  రాముడని పేరు పెట్టేరే కాని ' రామ రామ ' అనేది ఋషులకాలం నుండి
ఉపనిషత్తులలొ చెప్పిన పేరు అని అంటారు.

🌿రామేతి రామా అంటే ఆనందాన్ని  ఇచ్చే వాడని అర్ధం.
శ్రీ భోదేంద్రస్వామి కాంచి కామకోటి పీఠానికి 59వ
పీఠాధిపతి.  రామనామ గ్రంధాలను లోకానికి అందించారు.

🌸రామనామాన్ని ఒక్కసారి ఉచ్ఛరించి తన దోషాలను పోగొట్టుకొన్న ఒక మహిళ దగ్గర భిక్ష తీసుకుని
రామ నామామృత మహిమను ఈ మహాజ్ఞాని తెలుసుకున్నారట.

🌿" సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే' అని తెలుపుతున్నది విష్ణు పురాణం. శ్రీ రామనామాన్ని ఒక్కసారి
జపిస్తే మహావిష్ణువు సహస్రనామాలు జపించిన  పుణ్యం లభిస్తుంది.

🌸ఇది పరమేశ్వరుడు సతీదేవికి
చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి.
రామ నామాన్ని జపిస్తూ వుంటే మనసు ప్రశాంతంగా వుంటుంది.
దేహానికి చల్లదనం లభిస్తుంది.  రక్తప్రవాహం క్రమబధ్ధీకరించ
బడుతుంది.

🌿కుంటుంబ క్షేమం ,,అన్యోన్యమైన సంసారం,,,మంచి ఆలోచనలతో కుంటుబ ఆరోగ్యం బాగుపడుతుందని
గ్రంధాలు వివరిస్తున్నాయి...స్వస్తి
జై శ్రీరామ్...

Wednesday, March 29, 2023

శ్రీరామనవమి సందర్భంగా...!!

  


🌿శ్రీ రాముడు మను వంశం లో అరవై ఐదవ రాజు. ఉత్తర ప్రదేశ్ లో చైత్ర శుద్ధ
నవమి నాటి రాత్రి రాముడవతరించిన రోజుగా,ఉత్సవాలు జరుపుతారు.

🌸అయోధ్యను దర్శిస్తే శ్రీ రాముడు పుట్టి పెరిగిన భవంతి ని దర్శించవచ్చును.
ఇక్కడి కనక భవనం చూడతగిన భవనం.

🌿ఇక్కడ శ్రీ రాముడు సీతాదేవి బంగారు సింహాసనం మీద ఆశీనులై దర్శనమిస్తారు. ఈ కనక భవనం ఒకప్పుడు కైకేయి భవనం. ఆ భవనాన్ని సీతాదేవి కి బహుమతిగా యిచ్చింది
కైకేయి.

🌸శ్రీ రాముడు నాసిక్ పంచవటి క్షేత్రం లో పన్నెండు సంవత్సరాలు పైనే నివసించాడు. నాసిక్ లోని కాలారామ్
ఆలయంలో, పదిహేను రోజులు శ్రీ రామనవమి ఉత్సవాలు జరుపుతారు.

🌿రెండవ రోజు, రధయాత్రోత్సవం ,
రధోత్సవం చూడడానికి రధం లాగడానికి , భక్తులు దేశం నలుమూలల నుండి వస్తారు.

🌸భద్రాచలం లో శ్రీ రాముని
చతుర్భుజరామునిగా దర్శిస్తాము. ఆయన హస్తాలలో, శంఖు,చక్రం
విల్లు, బాణాలు వుంటాయి.
ఉత్తర తూర్పు దిశలో శ్రీ రామ పాదుకలు వున్నాయి. 

🌿ఇక్కడ వున్న ఆభరణ ప్రదర్శనశాలలో,
రామలక్ష్మణులు‌, తానీషాకు యిచ్చిన బంగారు నాణెములు,
భక్త రామదాసు, సీతమ్మకు చేయించిన
చింతాకు పతకము, రామలక్ష్మణులకు చేయించిన , ఆనాటి ఆభరణాలు మొదలైనవి దర్శిస్తాము.

🌸కోదండరాముని ఆలయం
రామేశ్వరానికి పదమూడు కి.మీ దూరం లో వున్నది . రామాయణంలో‌, రామేశ్వరానికి ప్రాముఖ్యత వున్నది.
లంకకు వెళ్ళేందుకు  సేతువు యిక్కడే నిర్మించబడింది.

🌿1964లో వచ్చిన తుఫాను కి  కోదంరామస్వామి ఆలయం యేమీ దెబ్బ తిన లేదు.

🌸ముడికొండాన్‌ కోదండరాముని ఆలయం‌, నన్నిలం అనే ఊరికి దగ్గర వున్నది. ఇది రెండువేల సంవత్సరముల నాటి ప్రాచీన ఆలయం.ఈ ఆలయంలో శిరసున
కిరీటం తో‌, శ్రీ రాముని దర్శిస్తాము.

🌿అయోధ్యలో జరిగిన పట్టాభిషేకానికి ముందే యిక్కడ పట్టాభిషేకం
జరిగినట్లు భక్తులు చెప్తారు.
కుంభకోణం లోని  శ్రీ రామస్వామి ఆలయం చూడవలసిన ఆలయం.

🌸గర్భగుడిలో పట్టాభిషేక మూర్తిని దర్శిస్తాము. ప్రాకారంలో అనేక రామాయణ చిత్రాలు  చిత్రీకరించారు. చూసేవారిని ఆశ్చర్యపరుస్తాయి.

🌿బీహార్, ఛత్తీస్ గఢ్‌,గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మొదలైన ప్రదేశాలలో
ఉత్సవాలు జరుగుతాయి. ఆంధ్రా‌, తెలంగాణాలలో సీతారాముల కళ్యాణం, నవరాత్రి ఉత్సవాలను
వైభవంగా జరుపుతారు.

🌸మహారాష్ట్ర చిన్వాల్ గ్రామంలో, బాల రాముణ్ణి ఉయ్యాలలో శయనింప చేసి ఉత్సవం చేయడంవిశేషం.

🌿కర్ణాటకలో శ్రీ రాముని ఆలయాలలో పానకం ప్రసాదంగా పంచి పెడతారు.
దక్షిణ ఆఫ్రికా, జమైకా, పశ్చిమ ఆసియా దీవులు. మారిషస్‌,
మలేషియా‌

🌸సింగపూర్, ఫిజీ దీవుల్లో
కూడా ఘనంగా శ్రీ రామనవమి ఉత్సవాలు, జరుపుతారు.
శ్రీ రామ నవమి నాడు
భక్తులు సరయూ నదిలో
స్నానం చేసి, ఆలయానికి
వెళ్ళి శ్రీ రాముని దర్శిస్తారు.

🌿స‌రయూ నది ని అందరూ
పూజిస్తారు. కారణమేమిటి అంటే
శ్రీ రాముడు సరయూ నదిలో అవతారం చాలించినట్లు‌, చరిత్రలో వున్నది..స్వస్తి.

Sunday, April 18, 2021

నిరాడంబరంగా నవాహ్నిక ఉత్సవాలు - భద్రాచలం సీతారాముల ఆలయంలో నవమి ఉత్సవాలకు అంకురార్పణ

 


భద్రచాలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య క్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు శనివారం (17.4.2021) అంకురార్పణ చేశారు. ఉదయం ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య పవిత్ర గోదావరి నదీ గర్బం (500 నదులు కలిసిన) నుంచి జలాలను వెండి బిందెలో తీసుకొచ్చారు.  

నేడు (18.4.2021 - ఆదివారం) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడ ధ్వజ పంట లేఖనం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న ధ్వజ స్తంభం వద్ద గరుడ పటాన్ని ఆవిష్కరిస్తారు.