Adsense

Monday, March 20, 2023

శ్రీ డిబ్బిలింగేశ్వరస్వామి ఆలయం, విజయనగరం జిల్లా : సారిపల్లి గ్రామం

 


💠 విజయనగరం పట్టణంలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం. ఈ ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది .

💠 చాలా మహిమ గల శివాలయం,కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్(పురావస్తు శాఖ) ఆధ్వర్యంలో ఉండడం వల్ల సాధారణ గుడి మాదిరిగా అభివృద్దికి నోచుకోవడం లేదు.

💠 ఈ గుడిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని దేవాదాయ ధర్మాధాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చి కార్యనిర్వహణా అధికారి(EXECUTIVE  OFFICER) ని నియమిస్తే, అప్పుడు ఈ గుడి సాధారణ కోవేల మాదిరి పూజారి నియమింపబడి నిత్య పూజలు,ధూప దీప నైవేధ్యాలు ఒక సమర్ధమైన పూజారి ఆధ్వర్యంలో జరుగుతాయి,

💠 ప్రస్తుతం అక్కడ ఒక వ్యక్తి పూజా కార్యక్రమంలు వంశపారంపర్యంగా నిర్వహిస్తున్నాడు,అతడు పూజారి కాదు,అతడు నిరక్షరాస్యుడు,అతనికి కూడా న్యాయం జరిగే విధంగా అక్కడే నెల నెలా జీతం వచ్చే ఉద్యోగం ఉండేలా ఏర్పాటు చెయ్యాలి.
అతని నాన్న గారు విజయనగరం పట్టణంలో వీధి వీధి తిరిగి సారిపల్లి డిబ్బిలింగేశ్వర స్వామి గురించి ప్రచారం చేసి బిక్షాటన చేసి స్వామి వారికి ధూప దీప నైవేధ్యాలు పెట్టేవాడు.

💠 అతని కొడుకు ప్రస్తుతం ఈ గుడి ఆలనా పాలన జీతం తీసుకోకుండా చూస్తున్నాడు.
అతను నిరక్షరాస్యుడు,సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడిని అభివృధ్ధి చెయ్యవలసిన అవసరం ఎంతయినా ఉంది.

💠 ప్రస్తుతం ఈ డిబ్బిలింగేశ్వర స్వామి గుడి కేంద్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్(కేంద్ర పురావస్తు శాఖ) ఆధ్వర్యంలో ఉండడం వల్ల అక్కడ భక్తులు చందాలు వేసుకొని అభివృద్ది చేద్దాము అన్నా కుదరదు,అక్కడ ఒక్క ఇటుక తియ్యకూడదు,ఒక్క ఇటుక పెట్టకూడదు,పూజలు కూడా నిర్వహించరాదు. చట్టరిత్యా నేరం,శిక్షార్హులు.

💠 ఈ గుడి పేరు మీద చుట్టుపక్కల చాలా భూమి ఉంది,ఆ భూమిలో ఈ గుడిని ఒక దేవస్థానంలాగా అభివృద్ది చెయ్యవచ్చు,ఈ గుడి దేవస్థానంగా అభివృధ్ధి చెందితే చూడాలని భక్తుల చిరకాల కోరిక

💠 డిబ్బిలింగేశ్వర స్వామి ఆలయం చంపావతి నది ఒడ్డున ఉన్నది,చంపావతి నదిలో స్నానం చేసి కూడా స్వామి వారిని దర్శించుకోవచ్చు.

💠 విజయనగరం పట్టణం ఆర్టీసి కాంప్లెక్  కి 12 కిమీ దూరంలో ఈ దేవాలయం ఉంది.

No comments: