🌿ఆలుమగల అన్యోన్యతను పెంచే ఆరాధన ఏ ఇంట్లోనైనా అడుగుపెడితే అక్కడి వాతావరణం ప్రశాంతంగా అనిపించినా
🌸పవిత్రంగా కనిపించినా ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉందనే విషయం అర్థమైపోతుంటుంది.
🌿ఏ కుటుంబానికైనా భార్యాభర్తలు రెండు కళ్లవంటివాళ్లు. ఇద్దరిమధ్యా అనురాగం అవగాహన ఉన్నప్పుడే ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా కొనసాగుతూ వుంటుంది.
🌸ఇలాకాక ఎవరి తీరు వాళ్లదే అన్నట్టుగా వ్యవహరిస్తే, ఇద్దరూ కలిసి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.
🌿అలాంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచేదిగా 'అనంగ త్రయోదశి' కనిపిస్తుంది.
🌸చైత్రశుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశిగా పిలవబడుతోంది. ఈ రోజున మన్మథుడిని స్మరించుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
🌿 భార్యా భర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే
🌸“అనంగ త్రయోదశి”. చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశిని అనంగ త్రయోదశి అని మదన త్రయోదశి అని, మన్మద త్రయోదశి అని, కామదేవ త్రయోదశి అని పేర్లు కలవు.
🌿 ప్రేమాధిదేవత అయిన కామదేవుడు అయిన మన్మధుడి పూజకు చేసే పర్వదినం. శాస్త్ర గ్రంధాలలో అనంగ త్రయోదశి గురించి దమనేన అనంగపూజ అని చెప్పడాన్ని బట్టి
🌸ఈ రోజు అనంగుడిని లేదా మన్మధుడిని దవనంతో పూజించాలని, ఈ రోజు మన్మధుడి పూజకు చాలా మంచి రోజు అని స్పష్టమవుతుంది.
🌿 భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- 'అనంగ త్రయోదశీ వ్రతం'.
ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.
🌸 అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని తల స్నానం చేసి, నిత్య పూజావిధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి.
🌿రతీ మన్మధులతో పాటు కామసంహార మూర్తి అయిన శివుడ్ని కూడా పూజించాలి.
మన్మధుడి చిత్రపటాన్ని గాని, మన్మద సాలగ్రామాన్ని గాని, పసుపుతో చేసిన ప్రతిమను గాని మందిరంలో ఉంచి
🌹నమోస్తు పుష్పబాణాయ
జగదాహ్లాదకారిణే!!
మన్మధాయ జగన్నేత్రే !
రతిప్రీతి ప్రియాయతే!!🌹
అనే శ్లోకాన్ని పఠించి
🌹కామదేవాయ విద్మహే|
పుష్పబాణాయ ధీమహి|
తన్నో అనంగ ప్రచోదయాత్||🌹
🌸అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ
🌿మన్మధున్ని ఆవాహన చేసుకొని వివిధ పుష్పాలతో పాటు సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించవలెను.
🌸ఈ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మధుడిని పూజించటం వలన దంపతుల జీవితం సుఖమయమవుతుంది.
🌿అనంగుడన్నా, పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే, కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి.
🌸 ఈ నేపథ్యంలో మన్మథుడిని స్మరించుకునే రోజుగా మనస్ఫూర్తిగా ఆరాధించే రోజుగా అనంగత్రయోదశి అంటారు.
🌿ఈ రోజున ఆయనని స్మరించుకోవడం వలన ఆలుమగల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుందనీ, వైవాహిక జీవితం సంతోషకరంగా, సంతృప్తికరంగా సాగిపోతుందని స్పష్టం చేయబడుతోంది.
🙏మన్మథునికి శివునికి గల సంబంధం🙏
🙏🌹 మత్స్య పురాణము మరియు శివ పురాణములలో తెలుపబడినవి...🌹🙏
🌸మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు. మన్మధుడి వాహనం చిలుక.
🌿మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు ,ఇతని విల్లు చెఱుకు గడతోను మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.
🌸ఈ పువ్వులు అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. మన్మధుడి భార్య రతీదేవి.
🌿ఋషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు.
🌸బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు అని విర్రవేగేవాడు
🌿అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు.
పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు.
🌸ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. శివపార్వతుల కల్యాణం లోకకళ్యాణ కారకమైనప్పుడు, దేవతలు తలపెట్టిన ఆ ప్రయత్నంలో ప్రధానమైన పాత్రను పోషించినవాడు మన్మథుడు.
🌿సతీదేవి వియోగంతో తపస్సులోకి వెళ్లిన పరమశివుడిని అందులో నుంచి బయటికి తీసుకువచ్చి, ఆయన పార్వతీదేవి పట్ల అనురక్తుడయ్యేటట్లుగా చేసినది మన్మథుడు.
🌸అలాంటి మన్మథుడి కారణంగానే లోకంలో ఆలుమగల మధ్య అనురక్తి కలుగుతోంది.మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు.
🌿కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.
మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలం దరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని మన్మధ బాణాన్ని సందిస్తాడు.
🌸అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు.
🌿యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు.
🌸వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు.
🌿 మన్మధుడు భార్య రతీదేవి బోరున విలపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది.
🌸శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు.
🌿 రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు.
🌸రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు.
🌿ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే 'అనంగ'త్రయోదశి. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే ఈ రోజు వ్రతంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
🌸వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు.
🌿 రతీ మన్మధులు ఇద్దరూ అన్యోన్నతా అనురాగాలున్న దంపతులు, అట్టివారిని పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగాలు వృద్ధి చెందుతాయి.
🌸 దాంపత్య జీవనం సుఖమయమవుతుంది అని శివుడు వరం ప్రసాదిస్తాడు.. స్వస్తి..

No comments:
Post a Comment