Adsense

Tuesday, April 4, 2023

పుణ్యతీర్థాల దర్శనం Visiting shrines

పులిమేడు (మధ్యందినీశ్వరమ్)..!!



🌿మధ్యందినర్ అనే మహర్షి
నిత్యం పరమేశ్వరుని పూజిస్తూ వుండేవాడు. ఆయనకు వరప్రసాదంగా ఒక కుమారుడు కలిగాడు. ఆయన పుత్రుడు కూడా  పరమ శివభక్తుడు అయ్యాడు.

🌸ప్రతిదినమూ ప్రాతఃకాలమునే లేచి తేనెటీగలు పూవులను చేరకముందే శివ పూజకై స్వఛ్ఛమైన పెద్ద పెద్ద పువ్వులు  సేకరించాలని తపించేవాడు.
కానీ తేనెటీగలు తాకని పూవులను సేకరించడం కష్టసాధ్యమయింది. 

🌿 అందువలన ఆదిమూలనాదర్ ని ప్రార్ధించాడు.  స్వామి అనుగ్రహం వలన అంధకారంలో కూడా సుస్పష్టంగా చూడగల కాంతివంతమైన  నేత్రాలను, ఎంతటి పెద్ద వృక్షాలనైనా సునాయాసంగా పట్టుకొని  ఎక్కడానికి వీలుగా పులిగోళ్ళవంటి గోళ్ళతో దృఢమైన పాదాలను పొందాడు.

🌸అందువలన అతనికి వ్యాఘ్రపాదుడనే పేరు వచ్చింది. ఈశ్వర  వరప్రసాదియైన   వ్యాఘ్రపాదుని  చూచి మధ్యందర మహర్షి చాలా ఆనందించాడు.

🌿వ్యాఘ్రపాదుని తండ్రి మధ్యందర మహర్షి  శివ పూజ చేసిన  ఆలయానికి ఎదురుగా వున్న తీర్ధమే పులిమేడు తీర్ధం. ఈ తీర్ధం ఒడ్డున
సుడలైమాడన్ ఆలయం వున్నది.

🌸అక్కడ మరణించినవారికి సద్గతులు లభించి మోక్షం పొందడానికి  పితృకార్యాలు నిర్వహించి ఆ పుష్కరిణిలో అస్థికలు నిమజ్జనం చేస్తారు.

🌿ఈ పుష్కరిణి లో కలిపిన అస్థికలు
నామరూపాలు లేకుండా కరిగిపోవడం ఒక విశేషం. మరుజన్మలేని మోక్షం  యిచ్చే తీర్ధం పులిమేడు తీర్ధం.

🌹🙏శివ ప్రియా
(శివబ్రహ్మ తీర్ధం).తిల్లై కాళి ఆలయం..
🙏🌹

🌸చిదంబరం ఆలయానికి ఉత్తర దిశలో  2 కి.మీ దూరాన వున్న శివప్రియా
అనే తీర్ధం  ఒడ్డున తిల్లై అమ్మవారి ఆలయం వున్నది.

🌿పతంజలి మహర్షి, వ్యాఘ్రపాద మహర్షి
ప్రార్ధనలను అనుగ్రహించి
తిల్లై వనంలో నటరాజస్వామి  ఆనందతాండవం చేశాడు. 

🌸కాళికాదేవి పరమేశ్వరునితో పోటీగా
నృత్యం చేసి ఓడిపోయిన స్థలమిదే. ఆగ్రహంతో ఊగిపోయిన కాళికను
బ్రహ్మాది దేవతలు వచ్చిశాంతపరిచారు.

🌿ఆ అంబికయే బ్రహ్మ చాముండి ' తిల్లై అమ్మవారిగా, తిల్లైవన రక్షకురాలిగా తిల్లైవన సరిహద్దులలో వెలసినది. ఆ కాళీ ఆలయ తీర్ధమే శివప్రియా తీర్ధం. ఇక్కడ స్నానచేసేవారికి మనశ్శాంతి కలుగుతుంది.

🌹🙏నాగ చేరి తీర్థం :🌹🙏

🌸మహావిష్ణువు అంగీకారంతో పతంజలిగా అవతరించి
తిల్లై వనం వచ్చిన ఆదిశేషువు , వ్యాఘ్రపాదునితో కలసి
ఆది మూలనాదరు గురించి తపస్సు చేసి పరమేశ్వరుని వరంతో  ఆనందతాండవం దర్శనభాగ్యం పొంది
ప్రసిధ్ధి చెందేడు.

🌿ఆ సమయంలో ఆదిశేషువు వచ్చిన బిల ద్వార తీర్ధమే నాగచేరి తీర్ధం.
ఈ తీర్ధం చిదంబర ఆలయానికి ఉత్తర పశ్చిమంగా 4 కి.మీ దూరంలో వున్నది.

🌹🙏బ్రహ్మ తీర్ధం(వశిస్ట తీర్ధం):🌹🙏

🌸కుష్టు వ్యాధి సోకిన గౌడదేశపు రాజు సింహవర్మ అనేక ఆలయాలను దర్శిస్తూ
తన కుల గురువైన వశిస్ఠునితో  చిదంబరం వచ్చాడు.

🌿సింహవర్మ ఆలయ ఉత్తర పశ్చిమాన వున్న ఒక వనంలో ఆశ్రమం  నిర్మించుకుని శివుని పూజిస్తూ వచ్చాడు. బ్రహ్మ జ్ఞానాన్ని అపేక్షిస్తూ భక్తితో అక్కడ బ్రహ్మపురీశ్వరుడు పేరిట ఒక శివలింగం ప్రతిష్టించాడు.

🌸పిదప నిత్యమూ శివగంగ పుష్కరిణి లో స్నానం చేసి  సంపూర్ణ ఆరోగ్యం
పొందేడు సింహ వర్మ . ఆ రాజు చిదంబరం ఆలయాన్ని చాలా
అభివృద్ధి పరిచాడు.

🌹🙏తిరుపాల కడలి తీర్థం :🌹🙏

🌿వశిస్టుడు సింగార తోపులో తపస్సు చేసుకుంటున్నప్పుడు, ఆయనను
పతంజలి మహర్షి, వ్యాఘ్రపాద మహర్షి వచ్చి దర్శించారు. అప్పుడు వశిష్టుడు తమ  సోదరినిచ్చి వ్యాఘ్రపాదునికి వివాహం చేసేరు. 

🌸 ఆ దంపతులకి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బాలునికి ఉపమన్యు అని పేరు పెట్టేరు.  ఉపమన్యు తాత
వశిష్టుని  మామ్మ అరుంధతి పెంపకంలో, కామధేనువు పాలు త్రాగి పెరిగి పెద్దవాడయ్యాడు.

🌿కొంతకాలం తరువాత అరుంధతి ఉపమన్యుని అతని తల్లిని వ్యాఘ్రపాదుని ఆశ్రమంలో వదలివేసినది.

🌸వ్యాఘ్రపాదుడు తమ ఆశ్రమంలోని గోవు పాలు ఉపమన్యుకి ఇవ్వగా అవి
వద్దని  కామధేనువు పాలే కావాలని ఉపమన్యు పట్టుపట్టాడు. 

🌿ఏం చేయాలో తోచక వ్యాఘ్రపాదుడు  నటరాజస్వామిని వేడుకున్నాడు.
పరమేశ్వరుడు పాల కడలిని వ్యాఘ్రపాదునికి అనుగ్రహించాడు.

🌸ఉపమన్యు ఆ పాలను త్రాగి తండ్రి వద్ద విద్యలు నేర్చుకొని బ్రహ్మ జ్ఞాని అయ్యాడు.. నటరాజస్వామి ఏర్పరచిన తిరు పాల కడలి ఆలయానికి ఉత్తర దిశలో వున్నది.

🌹🙏అనంత తీర్ధం..🌹🙏

🌿పతంజలి మహర్షి తన ఆత్మార్ధ  పూజకోసం ఒక శివలింగం ప్రతిష్టించి
పూజిస్తూండేవాడు.
ఆ శివలింగం చిదంబరానికి దక్షిణ దిశలో వున్నది.
ఆదిశేషువు అంశ అయిన
పతంజలి మహర్షి  నిర్మించిన ఆలయమైనందున అనంతేశ్వరం అనే పేరు కలిగింది. 

🌸సుందరమైన
అనంతేశ్వరుని ఆలయానికి ఎదురుగా వున్న తీర్ధమే అనంత తీర్ధం.
ఈ తీర్ధం లో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు కూడా తొలగి పోతాయని
స్ధలపురాణం వివరిస్తోంది.

🌿వ్యాఘ్ర తీర్ధం, గుహ్య తీర్ధం(బంధాల నుండి  విముక్తి కలిగించే తీర్ధం)
శివగంగ తీర్ధం లో కలుస్తాయి.
ఈ పుణ్యతీర్థాల దర్శనం ఎంతో  శుభదాయకం...స్వస్తి...


No comments: