పాల పరోటాలు
కావలసిన పదార్థాలు:-1, బియ్యం-ఒక కప్పు, 2. గోధుమపిండి - ఒక కప్పు, 3. కొబ్బరి తురుము - అర కప్పు, 4. కాచిన పాలు-మూడు కప్పులు, 5. జీడిపప్పు ముక్కలు- పావు కప్పు, 6. ఏలకుల పొడి - అర 7. నెయ్యి 50 గ్రాములు, 8. నువ్వుల పొడి-ఒక స్పూను, 9. బెల్లం తురుము - 200 గ్రాములు.
తయారు చేయు విధానం:-
బియ్యాన్ని నాలుగు గంటలు నానబెట్టి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో అర స్పూన్ బెల్లం తురుము, రెండు స్పూన్ల నెయ్యి, తగినన్ని పాలు పోసి చపాతీ పిండిలాగా మృదువుగా వచ్చేలా. కలుపుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి పాలు పోసి కాగాక బియ్యపు రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దీనిలో కొబ్బరి తురుము, బాదం ముక్కలు, ఏలకుల పొడి, నువ్వుల పొడి, బెల్లం తురుము వేసి, 100 గ్రాముల నెయ్యి వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరయ్యాక దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని చపాతీ లాగా. వత్తి పెట్టుకోవాలి. ఉడికించిన బియ్యం పిండి మిశ్రమాన్ని బాల్స్ లాగా చేసి ఒక్కో చపాతీలో ఒక్కో బాల్ పెట్టి చపాతీని మడిచి మరల చేత్తో వెడల్పుగా చపాతీ బాగా వత్తాలి. స్టవ్ మీద పెనం పెట్టి అర స్పూను నెయ్యి వెయ్యాలి, వేడెక్కాక ఈ పరోటాల్ని పెనంపై వేసి మరల ఒక ఖర స్పూను నెయ్యి వేసి రెండు వైపులా దోరగా వచ్చేలా కాల్చుకోవాలి. ఇలా అన్నింటినీ కాల్చుకోవాలి. ఈ పాలతో చేసిన రవ్వ పరోటాల్ని సర్వింగ్ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. ఈ పాల పరోటాలు రుచి అద్భుతం, అమోఘం.
No comments:
Post a Comment