Adsense

Wednesday, April 5, 2023

శనగలతో కొబ్బరి వడలు

శనగలతో కొబ్బరి వడలు
కావలసిన పదార్థాలు - 1. శనగలు - ఒకటిన్నర కప్పులు, 2. కొబ్బరి తురుము - ఒక కప్పు, 3. అల్లం - పచ్చిమిర్చి తరుగు- రెండు స్పూన్లు, 4. జీరా అర స్పూను, 5. క్యారెట్ తురుము- రెండు స్పూన్లు. 6. కొత్తిమీరం కరివేపాకు తరుగు - పావు కప్పు, 7. ఉప్పు, నూనె తగినంత, 8. పసుపు- పావు స్పూను (మంచి కలర్ కోసం).

తయారు చేయు విధానం:- శనగల్ని ముందు రోజు సాయంత్రం నానబెట్టి మరుసటి రోజు ఉదయం నీళ్ళు వంచి మెత్తగా మిక్సీ పట్టాలి. దీనిని వెడల్పు గిన్నెలోకి తీసుకొని కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, అల్లం-పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు కొత్తిమీర తరుగు, జీరా, పసుపు, తగ్గినంత ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి తగినంత నూనె పోసి కాగాక పిండిని మీడియం సైజు బాల్సులాగా చేసి చెయ్యి తడి చేసుకొని బాల్ ని పాలితిన్ కవర్ పై పెట్టి వెడల్పుగా వత్తి నూనెలో వెయ్యాలి. ఇలా. ట్రిప్పుకి ఐదు చొప్పున పిండి మొత్తాన్ని వేసుకోవాలి. వీటిని రెండువైపుల దోరగా కాలే వరకు మధ్య మధ్యలో కలుపుతుండాలి.. బాగా వేగాక తీసి ముందుగా పేపర్ నాప్కిన్ పరచిన ప్లేట్లో పెట్టుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఇవి చూడడానికి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

No comments: