Adsense

Saturday, April 22, 2023

వైశాఖే మాధవో, రాధో’...!!

’వైశాఖే మాధవో, రాధో’...!!



🌿వైశాఖమాసాన్ని ’మాధవామాసం’ అని అంటారు. ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.

🌸 వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.

🌸ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!

అదే విధంలో

🌹
🙏"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన
ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్!! -
🌹🙏

🌸అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.

🌿తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్!
విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!

🌸మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః!
త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!

🌿వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.

🌸ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.

🌿ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది.

🌸ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్నిస్తుంది.

🌿ఈ నెల శివుని అభిషేకించడం సంతతధారగా నీరు పడేలా శివలింగానికి పైన ’గలంతిక’ను (ధారాపాత్ర) ఏర్పాటు చేయడం శుభఫలాన్నిస్తుంది...స్వస్తీ.

No comments: