Adsense

Tuesday, April 4, 2023

స్వయంగా ఆంజనేయ స్వామి వారే ఒక యంత్రంలో ప్రకటమైన మహామహిమాన్వితమైన క్షేత్రం..!! yantrodharaka Hanuman hospet temple






🌿ఈ యాంత్రోద్ధారక హనుమ చిత్రపటం ఇంట్లో ప్రతిష్టించి, మహామహిమాన్వితమైన యాంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం భక్తి శ్రద్ధలతో, సంపూర్ణ విశ్వాసంతో పూజిస్తే ఎంతటి కష్టాన్నైనా తొలగిస్తాడు యంత్రోద్ధారక హనుమంతుడు యాంత్రోద్ధారక హనుమంతుని ప్రతిష్టించిన గాథ..

🌸యంత్రోద్ధారక హనుమంతుడు ఎలా వెలిశాడు యాంత్రోద్ధారక హనుమాన్ స్తోత్రం..

🌿హనుమంతుని ఎన్నో రూపాలను చూస్తుటం..

🌸పంచముఖ హనుమంతుడనీ, సప్త ముఖ హనుమంతుడనీ, బాల హనుమంతుడనీ, ధ్యానాంజనేయుడనీ ఇలా ఎన్నో రకాల రూపాలతో ఆంజనేయుని ఆలయాలు నిత్యం దర్శిస్తాం.

🌿కానీ హనుమంతుడు తనకు తానుగా ఒక యంత్రానికి బద్ధుడై, యంత్ర స్వరూపంగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం యంత్రోద్ధారక హనుమంతుని గుడి.


🌹🙏🚩యాంత్రోద్ధారక హనుమంతుని ప్రతిష్టించిన గాథ...🙏🌹

🌸మధ్వసాంప్రదాయానికి కర్ణాటక ప్రాంతం పుట్టినిల్లు. 15వ శతాబ్దం లో సాళ్వ నరసింహరాయల పరిపాలనా కాలం లో వ్యాసరాయరు అనే ఒక గొప్ప తాత్వికుడు, మధ్వాచార్యుడు, హనుమద్భక్తుడు ఉండేవాడు.

🌿అతను భారతదేశమంతటా సంచరించి 732 హనుమంతుని ఆలయాలను ప్రతిష్టించాడు. వాటిలో మొదటిది తుంగభద్రాతీరాన హంపి దగ్గర గల చక్రతీర్థం లోని ఈ యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం.


🌹🙏🚩యంత్రోద్ధారక హనుమంతుడు ఎలా వెలిశాడు🙏🌹

🌸వ్యాసరాయరు గొప్ప హనుమద్భక్తుడు. అతను హనుమంతుని బొమ్మను ఒక బొగ్గుముక్కతో గీసి ఆ రూపాన్ని పూజించేవాడు.

🌿ఒకనాడు హంపీ క్షేత్రం లోతుంగభద్రా నదీ తీరాన చక్రతీర్థం లో ఒక బండరాయి పైన ఆంజనేయుని బొమ్మను యథావిధిగా బొగ్గుతో గీశాడు. పూజ చేస్తుండగా ఉన్నట్టుండి ఆ బొమ్మ నిజమైన కోతిలా మారి బండరాయినుండీ బైటికి దూకి వెళ్లిపోయింది.

🌸ఇలా పన్నెండు రోజులు జరిగింది. ఇక వ్యాసరాయరు అలసి పోయి ఈ పరీక్షనుండి కాపాడమని ఆంజనేయునే ప్రార్థించాడు.

🌿రాయరు ప్రార్థనకు కరిగిన ఆంజనేయుడు తనంతట తానుగా ధ్యానం లో రాయరుకి ఆంజనేయ యంత్రాన్ని తెలిపి యంత్రానికిబద్ధుడై అందులో కూర్చున్నాడు.

🌸అంతకుముందు బండ రాయి నుండీ తప్పించుకున్న పన్నెండు కోతులనూ యంత్రానికి చుట్టూతా ఉంచాడు.

🌿ఈవిధంగా యంత్రోద్ధారక హనుమంతునిగా ఆంజనేయ శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంది...💐🙏


🌹🙏🚩
శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం...🌹🙏

🌸దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని వ్యాసరాయలు చెప్పినది. మీరు పఠించండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి.

🌿విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలోని యంత్రోద్ధారక హనుమాన్ ఆలయ మిది. అక్కడి విరుపాక్ష ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంది. రామాయణ కాలంలో శ్రీ రాముడు, హనుమంతుడు తొలిసారి కలిసిన ప్రదేశం.

🙏🌹
సోత్రం...🌹🙏

🌷నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ ।
పీనవృత్తమహాబాహుం సర్వశత్రునిబర్హణమ్ ॥

నానారత్నసమాయుక్తకుణ్డలాదివిభూషితమ్ ।
సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే ॥

వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా ।
తుఙ్గామ్భోధితరఙ్గస్య వాతేన పరిశోభితే ॥

నానాదేశాగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః ।
ధూపదీపాదినైవేద్యైః పఞ్చఖాద్యైశ్చ శక్తితః ॥

భజామి శ్రీహనూమన్తం హేమకాన్తిసమప్రభమ్ ।
వ్యాసతీర్థయతీన్ద్రేణ పూజితం ప్రణిధానతః ॥

త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః ।
వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యన్తరే ఖలు ॥

పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః ।
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ॥

సర్వథా మాస్తు సన్దేహో హరిః సాక్షీ జగత్పతిః ।
యః కరోత్యత్ర సన్దేహం స యాతి నరకం ధ్రువమ్ ॥

ఇతి శ్రీవ్యాసతీర్థవిరచితమ్ యంత్రోద్దారక
హనుమత్స్తోత్రం సమ్పూర్ణమ్ ।..

🌸ఈ ఆలయం ఒక చిన్న కొండమీద నిర్మింపబడి ఉంది. అక్కడ మహాపురుషుడైన వ్యాసరాయని ఆధ్యాత్మిక శక్తి ఇప్పటికీ తిరుగాడుతున్న అలౌకిక అనుభూతి భక్తులకు కలుగుతుంది.

🌿కర్ణాటక రాష్ట్రంలో ,బళ్ళారి లోని హోస్పేట లో గల చక్రతీర్థం లో యంత్రోద్ధరక హనుమంతుని ఆలయం ఉంది. హంపినుంచీ ఇది పన్నెండు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది...

     జై శ్రీరామ్ జై హనుమాన్..


No comments: