Adsense

Thursday, May 4, 2023

పెళ్లిళ్ల గుడి, శ్రీ రాజగోపాలస్వామి ఆలయం, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా

పెళ్లిళ్ల గుడి, శ్రీ రాజగోపాలస్వామి ఆలయం, 
నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా

💠 ఆంధ్రప్రదేశ్లోనే  ప్రాచీన వైష్ణవ ఆలయాలలో ఒకటి నర్సాపురం శ్రీ రాజగోపాల స్వామివారి ఆలయం


⚜ ఆలయ చరిత్ర ⚜

💠 సాధారణంగా ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది కానీ అదే చరిత్ర  కొంచెం సినిమాటిక్ గా ఉంటే కనుక అది ఈ గుడి చరిత్ర ...


💠 18వ శతాబ్దంలో నరసాపురం పట్టణానికి చెందిన  వైఖానస అర్చక కుటుంబీకులు పని నిమిత్తమై నరసాపురం దగ్గర గోదావరికి సమీపములో ఉన్న రాజోలు గ్రామమునకు వెళ్లడం జరిగింది.
అక్కడ అ గోదావరి ఇసుక తిన్నెల మీద  పూజ విహీనంగా పడి ఉన్న ఆ యొక్క స్వామి వారిని చూసిన అర్చక కుటుంబీకులు ఆ యొక్క విగ్రహాన్ని నరసాపురం తీసుకువచ్చి గోదావరి తీరమున దాతలు యొక్క సహకారంతో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది .

💠 ఆలయ ప్రతిష్ట అయిన తరువాత ఈ విషయాన్ని తెలుసుకున్న రాజోలు గ్రామస్తులు, పెద్దలు తమ స్వామిని తమకు అప్పగించాలని వివాదం చేశారు, కానీ అప్పటికే ప్రతిష్ట అయిపోయింది కాబట్టి  స్వామివారిని అప్పగించడం జరగదని అందుకు ప్రాయశ్చిత్తంగా వేణుగోపాలస్వామిగా ఉన్న స్వామి వారి యొక్క పేరును రాజోలు యొక్క పేరు కలిసేలా శ్రీ రాజగోపాల స్వామిగా పేరు  మార్చడం జరిగింది.
అప్పటివరకు వేణుగోపాలస్వామిగా పూజలందుకున్న స్వామివారు అప్పటి నుంచి రాజగోపాల స్వామిగా అర్చనలు అందుకుంటూ వస్తున్నారు.

💠 కాలక్రమేణా గోదావరి కోసుకురాగా సగం ఆలయం పతనం అవ్వడం జరిగింది, అప్పుడు తిరిగి ద్రోణంరాజు యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో ప్రస్తుత స్టీమర్ రోడ్  లో స్వామి వారి యొక్క ఆలయం సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది .
1956వ సంవత్సరంలో దేవాదాయ శాఖ ఈ ఆలయం యొక్క నిర్వహణ బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది.

ఈ యొక్క ఆలయం గురించి మరొక విశేషం మనం తప్పకుండా తెలుసుకోవాలి...

🔅 పెళ్లిళ్ల గుడి 🔅

💠 ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక విశేషం ఉన్నట్టే ఈ ఆలయానికి కూడా ఉంది అది ఏంటంటే... వివాహం కాని వారు,  వివాహం ఆలస్యం అవుతున్న వారు  లేదా మంచి వివాహం అవ్వాలనుకునేవారు ఈ ఆలయంలో మొక్కుకుంటే తప్పకుండా అవుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం, అందుకే వారి కోరిక నెరవేరిన తర్వాత ఎంత కోటీశ్వర్లు అయినా స్వామి వారి యొక్క ఆలయంలో  సామాన్యంగా పెళ్లిళ్లు చేసుకుంటారు.
సంవత్సరానికి ఇంచుమించుగా 400  పెళ్లిళ్లు పైగా అవుతాయి అందుకే ఈ ఆలయం " పెళ్లిళ్ల గుడిగా " ప్రసిద్ధి చెందింది.

💠 శనివారం కానీ బుధవారం కానీ ఆ యొక్క స్వామివారికి అటుకులు సమర్పించి తమ కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుందని ఎంతో మంది నమ్మకం.

💠 అలాగే సంతానం లేనివారు కూడా ఇక్కడ మొక్కుకుంటే తప్పక సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం.
అందుకే స్వామివారిని సంతాన రాజగోపాల స్వామిగా  కూడా  భక్తులు కొలుస్తారు.

💠 స్వామి వారి కళ్యాణం పాల్గుణ శుద్ధ నవమి నుండి పాల్గుణ శుద్ధ పౌర్ణమి వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి.

💠 అలాగే ఈ ఆలయంలో లో లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, శ్రీ  విఖనష మునీంద్ర స్వామివారు కూడా కొలువై ఉన్నారు.

💠 దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల నిమిత్తం ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది.
కాబట్టి ఈసారి నర్సాపురం వచ్చినప్పుడు  తప్పకుండ ఈ ఆలయాన్ని సందర్శించడం మర్చిపోవద్దు.

No comments: