Adsense

Thursday, May 18, 2023

కమలాంబిక....!!

కమలాంబిక....!!
            
అత్యంత మహిమాన్విత స్థలమైన తిరువారూర్ లో జన్మించడమే మహాభాగ్యమని , ముక్తిప్రదమని కీర్తిస్తారు.తమిళనాడు తంజావూరు జిల్లాలో గల తిరువారూర్  ప్రాచీన నామం వల్మీకపురం. వల్మీకం అంటే పుట్ట.

ఇక్కడ పరమేశ్వరునికి వల్మీకనాదర్ అనే పేరు వుంది. ఈ ఆలయం  ఎంతో ప్రాచీనమైనదని యీ ఆలయం లోని ఈశ్వరుడు
స్వయంభూ ఆవిర్భావ కాల నిర్ణయం చేయడం ఎవరి వలనా కాదని, పరమ భక్తుడైన తిరునావుక్కరసర్ ప్రవచించారు.
తంజావూరు సమీపంలో గల సప్తవిధాంగ క్షేత్రాలాయాలలో ప్రధమ ఆలయం ఇది.  ఈ పుణ్యస్ధలంలోనవగ్రహాలను ఒకే వరసలో దర్శిస్తాము.

లలితా సహస్రనామాలలోని
అబికను సంపూర్ణ  రూపంగా  దర్శించగల  శ్రీవిద్యా క్షేత్రం.
భారతదేశంలోని పెద్ద
పెద్ద ఆలయాలలో  ఒకటిగా చెప్పబడుతున్న క్షేత్ర
ఆలయం. తిరువారూరు శ్రీ రాజేశ్వరుని ఆలయంలో ప్రవేశించగానే ఎత్తిన చేతులు దింపకుండా వందనములు
సమర్పించవలసిన దేవతామూర్తులెన్నో
ప్రత్యేక సన్నిధులలోనుండి దర్శనమిస్తారు.

అమ్మవారి శ్రీ చక్రంలోని దేవతామూర్తులు  దర్శన మనుగ్రహిస్తున్నఆలయం. 

శ్రీ మన్నారాయణుడు  పూజించిన  సోమస్కంద శివశక్తి మూర్తిని , బ్రహ్మ , ఇంద్రాది దేవతలు సేవించిన అనంతరం  ముచుకుంద చక్రవర్తి భక్తితో పూజించి ఆ విగ్రహాన్ని యిక్కడ ప్రతిష్టించినట్లు ఐహీకం.
మూర్తి  త్యాగరాజేశ్వరునిదైనా
అంబికకు కూడా అత్యంత ప్రధాన్యత వుంది.ఈ స్ధల  ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన మూర్తి అయిన
త్యాగరాజేశ్వరుని దర్శిస్తే
శ్రీవిద్యా స్వరూపం అంతర్ముఖంగా మనకి బోధిస్తునట్లు  గోచరిస్తుంది.

ఎందుకంటే  అక్కడ  ఎప్పుడూ త్యాగరాజేశ్వరుని ముఖం మాత్రం  బయటికి తెలిసేలా అలంకరించబడి వుంటుంది.
ముందు వైపునుండి దర్శిస్తే  శివశక్తి రూపిణిగా  పరమశివుడు
వెనుకవైపునుండి దర్శనం చేసుకుంటే ,శివశక్త్యైక  రూపిణి లలితాంబిక గా స్త్రీ రూపంలోనూ ఆశీనురాలై   ప్రత్యేకంగా అలంకరించిన రూపంలో దృగ్గోచరమవుతుంది.ఇటువంటి మర్మగర్భితములైన విషయాలు కలిగిన  ఆలయం యిది.
అమ్మవారు ప్రత్యేకంగా ఒక ఆలయంలో కమలాంబికగా దర్శనం కటాక్షిస్తు వున్నది.
అంబిక  ఆలయానికి పడమటి
దిశగా  అక్షర పీఠం వున్నది.
ఈ పీఠం  లో 51 బీజాక్షరాలు
వ్రాసి వున్న  శక్తివంతమైన మహిమాన్విత రాగి యంత్రం వున్నది. ఇది అన్ని మంత్రాలలోని శక్తిని సంపూర్ణంగా సిధ్ధింప జేయగల శక్తి పీఠం .

No comments: