Adsense

Thursday, May 18, 2023

సంకటహర చతుర్ధి - వినాయక చవితి

సంకటహర చతుర్ధి - వినాయక చవితి


ప్రతి దేవతకు ఒక తిథితో సంబంధం ఉంది. ప్రతి నెలలో రెండుసార్లు శుక్ల, కృష్ణ పక్షాలలో తిథి వస్తుంది. కుమార స్వామికి శుక్ల పక్ష షష్ఠితోనే సంబంధం. శివునకు కృష్ణ చతుర్దశితోనే. దానినే మాస శివరాత్రి అంటారు. రామునకు శుక్ల నవమితో. కృష్ణునకు కృష్ణపక్ష అష్టమితో. అమ్మవారికి పూర్ణిమతో. కాని గణపతికి శుక్ల, కృష్ణ పక్షాలతో సంబంధం ఉంది.

గణపతి అవతరించింది శుక్ల చతుర్దినాడు. అందుకే వినాయక చవితి అంటాం. ఇంకా సంకటహర చతుర్థి కూడా ఉంది. అనగా కష్టాలను పోగొట్టే చతుర్ధి. ఇది కృష్ణ పక్షంలోనే వస్తుంది. శుక్లపక్షంలో కాదు.

ఇది ఎట్లా వచ్చింది? ఈనాడే చంద్రుణ్ణి క్షమించాడు. శుక్ల చతుర్థి నాడు చూడకూడదనే నియమం ఉంది కదా! బాధ పెట్టానని భావించి కృష్ణ పక్షంలోనూ గణపతిని పూజించాలని దయతో ఈ నియమాన్ని ఏర్పాటు చేసాడు. ఇట్లా ప్రకటించాడు కూడా. నన్ను కృష్ణ పక్షంలో పూజించినవారికీ అన్ని కష్టాలను పోగొడతాను. ఈనాడే రోహిణితో కూడిన చంద్రుణ్ణి నా పూజతో బాటు పూజించాలి సుమా అన్నాడు. ఇట్లా రోహిణిపై పక్షపాతం చూపించిన చంద్రుని పట్ల జాలి చూపించాడు.

పార్వతీదేవి ఈ వ్రతము ఆచరించి ఆరు మాసములలో శంకరుని భర్తగా పొందినది. పార్వతిదేవీ వివాహంనకు ముందు సంకట హర చతుర్ధి వ్రతాన్ని ఆచరించి గణపతిని పూజించింది. ఈ గణపతి ॐ కార స్వరూపుడు. ప్రథమ పూజ్యుడు. వివాహం తరువాత వినాయకుడు జన్మించిన చతుర్ది నాడు మనం జరుపుకొనే వ్రతం వినాయక చవితి. రూపం ఒకటేయైన ఇది వివిధ కాలల్లో వ్యక్తమవుతుంటుంది.

No comments: