Adsense

Sunday, May 14, 2023

హనుమాన్ వైశిష్ట్యం..!!

హనుమాన్ వైశిష్ట్యం..!!



🌷వైశాఖేమాసే కృష్ణాయాం            
దశమ్యాం మందవాసరే |   
 
పూర్వాభాద్ర ప్రభూతాయ
మంగళం శ్రీ హనుమతే||🌷



🌿హనుమ జ్జయంతి వైశాఖ మాసం కృష్ణ పక్షంలో  దశమినాడు జరుపు
కుటుంటున్నాము

🌸ఈరోజు భక్తితో
హనుమంతుని ఆరాధించినా,
స్మరించినా ఏళ్లనాటిశని, అష్టమ శని,అర్థాష్టమ శని దోషాలు తొలగిపోతాయి

🌿కలౌ కపి వినాయకం...అన్నారు  కలియుగంలో పిలిస్తే పలికే దైవం గణపతి హనుమంతుడు, వెంకటేశ్వరా స్వామి వారు ,

🌸గణపతిని
ప్రతినెలా సంకష్టహర చతుర్థి నాడు,

🌿హనుమంతుని శనివారం
రోజున, ముఖ్యంగా హనుమజ్జయంతి
రోజున పూజించాలి.

🌸వెంకటేశ్వరా స్వామి వారికి శనివారం ప్రీతి , ప్రతి నిత్యం స్వామి స్మరణతో కొలుస్తే పలికే కలియుగ దైవం వెంకటేశ్వరా స్వామివారు

🌿కలియుగంలో
ఎంతోమంది రామభక్తులన కాపాడిన వైనం మనకు తెలిసిందే మనం మరువని విషయం ఏమిటంటే హనుమంతునిపూజించినా,
నామజపం చేసినా ముందుగా శ్రీరామునిపూజించాలి,స్మరించాలి అప్పుడే ఆంజనేయస్వామి
అనుగ్రహం కలుగుతుంది.

🌷యత్ర యత్ర రఘునాధకీర్తనం
తత్ర తత్ర కృతి మస్తకాంజలిం
🌷

🌸అన్నారు మన పెద్దలు ఎక్కడ రామ
నామ సంకీర్తనలు జరుగుతాయో అక్కడ హనుమ ఏదోఒక
రూపంలోఉండి ఆనంద పారవశ్యం పొందుతారని పురాణవచనం.

🌷"
నాశైరోగ హరై సబ్ హీరా
జపతు నిరంతర హనుమతవీరా"
🌷

🌿అన్న తులసీదాస్ మాటలు మరువకండి... జై శ్రీరామ్..

No comments: