మన అలవాట్లు జీవన విధానం ను బట్టి వచ్చి అనేకులు అనుభవిస్తున్న వ్యాధుల్లో మూల వ్యాధులు కొన్ని. అందరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఇబ్బందిపడుతుంటారు.
వీటికి ఆయుర్వేదం మంచి ఔషధాలు చెప్పింది.
కందగడ్డను ఎండబెట్టి పొడి చేసి 80 గ్రాములు,
చిత్రమూలం 40 గ్రాములు,
కరక చూర్ణం 10గ్రాములు,
శొంఠి 10 గ్రాములు,
మిరియాలు 5 గ్రాములు
అన్నిటిని మెత్తగా చూర్ణం చేసి, బెల్లం 100 గ్రాములు కలిపి అన్నిటిని మర్దించి కుకుండుకాయ అంత మాత్రలుగా చుట్టుకుని రెండు పూటలా సేవించవలెను.
మూలవ్యాది తప్పక నశిస్తుంది. ఉదర సంబంధ వ్యాధులు తొలగుతాయి, మలబద్ధకం పోతుంది.
ఎక్కువగా మజ్జిగ సేవించవలెను.
దీనిని సేవిస్తూ విముక్తి పొందగలరు. (సేకరణ)
No comments:
Post a Comment