ఉడుపి శ్రీకృష్ణ🙏🏵️🙏
కేవలం రెండున్నర అడుగుల ఎత్తుతో ఎడమ చేతితో కవ్వం, కుడిచేతిలో కవ్వపు తాడు ధరించి కనిపించే నవనీత చోరుడు ఉడుపి శ్రీకృష్ణుడు. ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పూజించిన విగ్రహం కలియుగంలో మధ్వాచార్యుల పవిత్ర హస్తాల మీదుగా ఉడుపిలో ప్రతిష్ఠితమైంది. ఉడుపి శ్రీకృష్ణమఠంలో తొలి ఏకాదశికి ముందురోజు మహాభిషేకం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుని రూపంలో కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం - ఉడుపి! ఉడుపి అంటే చంద్రుడు అని అర్థం. మామగారైన దక్షుని శాపానికి గురైన చంద్రుడు శాపవిముక్తి కోసం ఉడుపిలోని చంద్ర పుష్కరిణి వద్ద తపస్సు చేసినట్లు క్షేత్రపురాణం చెబుతోంది. చంద్రమౌళిశ్వరుడిని గురించి తపస్సు చేసి చంద్రుడు శాపవిముక్తుడైన ప్రాంతం కనుక... దీనికి ఉడుప అనే పేరు ఏర్పడి కాలక్రమంలో ఉడుపిగా మార్పు చెందింది. ప్రతి రోజూ పూజలు జరిగే ఉడుపి శ్రీ కృష్ణ ఆలయంలో సంవత్సరంలో వివిధ సందర్భాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు. వీటిల్లో ప్రధానంగా శ్రావణ మాసంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక ఉత్సవం కన్నులపండుగగా జరుగుతు
No comments:
Post a Comment