Adsense

Thursday, November 2, 2023

చాలా బేకరీలకి 'బెంగళూరు బేకరీ' లేదా 'బెంగళూరు అయ్యంగార్ బేకరీ' అనే పేర్లు ఉంటాయి కదా దీని కథేమిటి?

చాలా బేకరీలకి 'బెంగళూరు బేకరీ' లేదా 'బెంగళూరు అయ్యంగార్ బేకరీ' అనే పేర్లు ఉంటాయి కదా దీని కథేమిటి?
  • 1898వ సంవత్సర కాలంలో తిరుమలచార్ అనే అతను తన సోదరుడితో కలిసి కర్ణాటకలోని హాస్సన్ అనే ప్రదేశం నుండి బెంగళూరుకి వచ్చి స్వీట్ షాప్ పెట్టుకున్నారు.
  • అక్కడికి ప్రతిదినం వచ్చే ఒక ఆంగ్లేయుడు ద్వారా బేకింగ్ గురించి తెలుసుకొని, నేర్చుకొని బెంగళూరు బ్రదర్స్ పేరుతో మొట్ట మొదటి బేకరీ ని స్థాపించారు.
  • బేకరీ వ్యాపారం బాగా సాగుతుండంతో చాలా మంది అలానే హస్సన్ నుండి వలస వచ్చి బెంగళూరులో వ్యాపారం చేసుకునేవారు.
  • అలా వచ్చిన వారంతా హాస్సన్ లోని అష్టగ్రామలలోని వారు, వాళ్లంతా అయ్యంగార్లు అవ్వటం చేత బేకరీలకి బెంగళూరు అయ్యంగార్ బేకరీ అని పేరు పెట్టుకునే వారు.
  • కాలక్రమేనా దేశమంతా పేరు పొంది అన్ని చోట్ల విస్తరింపచేశారు.

అయితే ఇప్పుడ్డు ఉన్న కాలంలో నిజంగా అయ్యంగార్లు పెడుతున్నారో లేక ప్రతిఒక్కరు బేకరీ రంగంలో దిగి అయ్యంగార్ అనే పేరు వాడుకొని బేకరీ నడుపుతున్నారో మనం ఆలోచించాల్సిన విషయం.

No comments: